[dropcap]ర[/dropcap]వి చంద్ర బుధులు
గురు శుక్ర
శని కుజులు గ్రహాలు
రాహు కేతులు
ఛాయా గ్రహాలు
అన్ని గ్రహాలూ
ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తూ
ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ
అమాత్య వర్గాలూ
అధికార వర్గాలూ
సామాన్య జన వర్గాలూ కూడా
గ్రహాలే
అయితే వీరు
ఉప గ్రహాలు
అప గ్రహాలు కూడా
అయితే
ఎవరు
ఎవరి చుట్టూ
ఎలా
ఎందుకు
తిరుగుతూ
తిప్పుకుంటూ
అనుగ్రహిస్తూ
ఆగ్రహిస్తూ..!