[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. చాలా బియ్యం పండిన ఒక సంవత్సరం (4) |
4. వెన్నెల పులుగులు అటునించి వస్తున్నాయి (4) |
7. అనేక రకములు (5) |
9. నేర్పు (3) |
11. ఊరిని తనలో దాచిన బంగారం (3) |
13. ఇంద్రధనుస్సు (2) |
14. రెండుపగళ్లతోఁగూడిన రాత్రి (3) |
16. అటునించి వేసినా ఎటునించి వేసినా హనుమంతుడి ముందు మాత్రం కూడదు – ఏకవచనంలో (2) |
17. కొలువుకూటములో ఇంగ్లీషువాడి పానశాల కూడా కనిపించిందా? (3) |
18. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1991లో వఛ్చిన ఈ సినిమా -నటుడు శ్రీకాంత్ చిత్రం – మొదటి సగమే కనిపిస్తోందిక్కడ (3) |
19. అందము (2) |
20. చిందర తరువాత తునుక (3) |
22. కావున (2) |
24. శూరుడు (3) |
26. తీక్షణమైన (3) |
27. పాతాళలోకంలో మామిడిపండుట – చూసుకోండి మరి (5) |
30. బంతి (4) |
31. మ్రాను చెక్కుట – వినటానికి వెంటనే లాగా అనిపిస్తుంది (4) |
నిలువు:
1. చెట్టుమీఁద మొలచునట్టి ఓషధి విశేషము.(4) |
2. నీళ్ళు భూమి కూడా కావచ్చు (3) |
3. పెండ్లికాని పడుచు తలక్రిందులైంది (2). |
4. రాయలసీమ పావు కింద నించి పైకి (2) |
5. రాలగొట్టు (3) |
6. ఎస్.వి. రంగారావు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన 1967 నాటి తెలుగు చలన చిత్రం (4) |
8. ఎర్రని కనులు గల సంవత్సరం (3) |
10.విష్ణువే (5) |
12. తెలుగు బుల్లితెరలో ప్రసారమయిన తొలి దైనిక ధారావాహిక దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ లో (5) |
14. ప్రాయము (3) |
15. అందమైన స్త్రీయే కానీ తిరగబడింది (3) |
19. పాండవ వనవాసంలో ద్రౌపది భీముడిని తెచ్చిఇమ్మని అడిగిన పువ్వు (4) |
21. నేర్పు (3) |
23. ముంగిస (4) |
25. తిరగబడిన అల (3) |
26. మోక్షము పొందనిచ్ఛ (3) |
28. వ్యాయామము (2) |
29. అందాలరాముడు గారి హీరోయిన్ (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 36 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 నవంబరు 20 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 34 జవాబులు:
అడ్డం:
1.విద్య లేని వాడు. 6. జంతే 8. వస్త్రగాలితం 10. విందు 11. బుడమ 13. మెత 14. వేముల 16. మన 17. రుపవిడు 18. తిమ్మరుసు 19. పుశు 20. కచిక 22. కలు 23. కవులు 25. ముము 26. ఏకు మేకగు 30. లుప్తం 31. గోడమీదపిల్లి
నిలువు:
1.విడెం/విడ్యం 2. లేవదు 3. నిస్త్ర 4. వాగానము 5. డులి 7. తేనెమనసులు 9. తంబు 10. వింత పశువు 12. డమరుకము 14. వేడుక 15. లతిక 21. చిన్నమేడ 24. లు ఏ 25. ముగుద 27. కుగో 28. కమీ 29. నల్లి
సంచిక – పద ప్రతిభ 34 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అన్నపూర్ణ దేవి
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- ఎం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమటి సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్.మూర్తి
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.