[dropcap]అ[/dropcap]క్షరాలు.. అజ్ఞాన తిమిరాల్ని పారద్రోలి
మానవ జీవితాలకు వెలుగులు పంచే కాంతి కిరణాలు!
అక్షరాలు.. మానవ హృదయాల్లో మానవత్వ పరిమళాలని
వికసింపజేసే స్ఫూర్తి తరంగాలు!
అక్షరాలు.. ఆశయాల హరివిల్లులని
నయనాల ముందు అందంగా ఆవిష్కరింప జేస్తూ
పట్టుదల పోరాటపటిమలని రగిలింపజేస్తూ
ఆనందంగా ముందుకు నడిపే సన్మార్గదర్శకాలు!
అక్షరాలు.. నల్లని క్లాస్ బోర్డ్స్ పై మాస్టార్లు వ్రాసే పాఠాలై ..
ఇష్టపడి చదువుకునే విద్యార్థుల
నుదుటి రాతలని మార్చే బ్రహ్మ లిఖితాలు!
కవితలై..
కావ్యాలై..
కథలై..
పాటలై.. మనస్సులని రంజింపజేస్తూ..
విజ్ఞానాన్ని వినోదాన్ని అందించే
పసిడి పూల జల్లులు.. అక్షరాలు!