[dropcap]పూ[/dropcap]ర్వం
అపూర్వం
అదొక
అనేక
అనేకనేక
కారణ రహిత స్థితి
అక్కడ..
గతి వుంది
మతి వుంది
అస్తిత్వం వుంది
నియమాలు.. సూత్రాలు
వున్నాయి..
వాటి అనుగుణంగా
నేను రూపుదిద్దు కొన్నాను
నాలో..
చలనం వుంది
శక్తి వుంది
స్థిరత్వం వుంది
పరిణామాల ఫలితంగా
కాలం నిర్జీవ కణాలతో
కాపురం చేసిన కారణంగా
నేను తల్లిని అయ్యాను
జీవజాతులకు జన్మనిచ్చాను
జరిగిందేదో జరిగింది
జరగబోయేదేదో జరుగుతుంది
అంటూ..
విశ్వంలోని నా సాటి గ్రహాలు
మేటి గ్రహ నక్షత్రాలు
నన్ను ఆశీర్వదించాయి
అనంత కోటి మహావిశ్వంలో
మాది ఒక్కటే కుటుంభం
మేము అందరం
ఒకరికోకరు అత్యవసరంగా
అవసరమైన వాళ్లం
ఇదే నా జీవన వేదం.