[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తెల్లకాకి (4) |
4. నడుముకు సమీపములో ఉండు ప్రదేశము – చదరంగా ఉండాలని రూలు లేదు (4) |
7. కంచిలోనే కాదు తిరుమలలో కూడా ఉంది (5) |
9. దక్షుని కూతుళ్లలో ఒకతె: దానవుల తల్లి (3) |
11. సూక్ష్మమైనది (3) |
13. గ్రంథి (2) |
14. దుష్టుడిని పిలవకూడదు కానీ ఓమారు కేకేయండి (3) |
16. భాద్రపదమును పొడిగా రాస్తే ఇలా ఉంటుంది (2) |
17. కండ ఉన్నా లేకున్నా గర్వమే (3) |
18. గ్రామసింహం తడబడింది (3) |
19. ఒక రకం దోసకాయ (2) |
20. కళ్ళకీ కట్టుకోవచ్చు పరుచుకుని పడుకోవచ్చు – ఏదైనా బహువచనంలో (3) |
22. అక్కమొగుడులాంటి ఒక సంవత్సరం (2) |
24. మొసలిటెక్కెముజోదు (3) |
26. కుని (3) |
27. మేఘము (5) |
30. నెమలి వెనకనించి వచ్చింది (4) |
31. ధర్మంతో మొదలయ్యే 59వ మేళకర్త రాగము – అందెల రవమిది పాట ఈ రాగంలోనే స్వరపరిచారట (4) |
నిలువు:
1. మొదటి వేదము (4) |
2. జగడము (3) |
3. హడావుడి పడకండి – ఈ యుద్ధంలో గా లేదు (2) |
4. తలక్రిందులైన దండు (2) |
5. వాసనగల మూలికావిశేషము- అటు ఇటు సరిచేస్తే ముఖం కూడా కనిపిస్తుంది (3) |
6. ముళ్ళున్న పొద/ మండ (4) |
8. తప్పెటలు (3) |
10. పలుకుబడి (5) |
12. మంచిచెడులు (5) |
14. గుఱ్ఱము (3) |
15. వర్షములు – ఏళ్ళు కాదు (3) |
19. చిలుకపలుకు సంగీత దర్శకత్వం కూడా చేస్తుందా? (4) |
21. విధము, రీతి. (3) |
23. ఎంత సొగసుగా ఉన్నావు, ఎలా ఒదిగిపోతున్నావు అన్న పాట ఈ సినిమాలోది. కొంచెం అటు ఇటుగా రాసుకోండి (4) |
25. కొమ్ము లేని పెళ్లికొడుకా లేక ముసలినక్కా? అదికూడా మళ్ళీ గజిబిజిగా! (3) |
26. రహస్యం చెల్లాచెదురైంది (3) |
28. చివర లోపించినా సంభాషణయే (2) |
29. వృత్తాంతము – పొట్టలో చుక్క లేదు కానీ వినటానికి పనికొస్తుంది (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 38 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 డిసెంబరు 04 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 36 జవాబులు:
అడ్డం:
1.బహుధాన్య 4. లురాకోచ 7. రకరకాలు 9. నిపుణం 10. పురురం 13. కరం 14. పక్షిణి 16. తుగం 17. దర్బారు 18. మధురా 19. సౌరు 20. వందర 22. గాన 24. గండుడు 26. ములుకు 27. రసాతలము 30. కందుకము 31. తక్షణము
నిలువు:
1.బదనిక 2. ధారణం 3. న్యక 4. లుకా 5. రాలుపు 6. చదరంగం 8. రక్తాక్షి 10. పురందరుడు 12. రుతురాగాలు 14. పరువం 15. ణిమర 19. సౌగంధికం 21. దక్షత 23. నకులము 25. డురక 26. ముముక్ష 28. సాము 29. లత
సంచిక – పద ప్రతిభ 36 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధసాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- ఎం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమటి సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్.మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.