[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. సిద్ధ శ్రేష్ఠుడు (5) |
4. కాంతిని కాటుకని తనలో దాచుకున్న సుడిగాలి (5) |
7. మత్స్య యంత్రాన్ని ఛేదించి కృష్ణుడు పెండ్లాడిన రాజకుమార్తె (3) |
8. మొదట్లో కురచనయ్యాడు గాని వామనుడు కాడు – శ్రీహరియే (5) |
9. వెండికొండ (5) |
10. మొదలులేని ఖటిక (3) |
12. ఆచారములు (4) |
14. శివుడు (4) |
15. ——–పిడకలవేట (5) |
16.సరస్వతీదేవి తడబడింది (4) |
18. బ్రహ్మ (4) |
21. ద లేని ఏరండ తైలము – కుడినించి ఎడమకి (3) |
23. చివర కొమ్ములేని హాస్య, భీభత్స, కరుణ శృంగారాదులన్నీ అట్నుంచి బయలుదేరాయి (5) |
24. నిత్యహారతులు షోడశోపచార పూజావిధానం జరిగే దేవాలయాలలో ఇది తప్పనిసరిగా కనిపిస్తుంది (5) |
25. సేవ (3) |
26. బయటకి కనిపించే అందం రివర్సులో (5) |
27. ఎక్కువ నష్టము, నీచము (5) |
నిలువు:
1. సీత (5) |
2. శుభము (5) |
3. రాలుటయందగు ధ్వన్యనుకరణము (4) |
4. ఓంకారము (4) |
5. ఒక విధమైన సంగీత వాద్యము చెల్లాచెదురైంది (5) |
6. వేడుకలు చివర లావత్తు కోల్పోయాయి (5) |
11. దేవాలయము (5) |
13. క్రిందినించి పైకి వెళుతుంటే ఉత్సవాలకు మొదలు తప్పిపోయింది (3) |
14. మధ్యలోకం (3) |
16. దీనిని గంధర్వులే తీర్చారని భీముడి వెటకారం (5) |
17. జంటకవులుగా ప్రసిద్ధులైన పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావులు తెలుగులో వ్రాసిన అత్యుత్తమ పద్యకావ్యము – తిరగబడింది (5) |
19. ఈ విద్య ప్రభావంతో ఎంతసేపయినా నీటిలో ఉండగలగవచ్చు (5) |
20. మునిమాపు (5) |
21. వంటపాత్రము – ఇది కూడా బోర్లాపడింది (4) |
22. పర్యవేక్షణము (4) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 06 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 39 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 డిసెంబరు 11 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 37 జవాబులు:
అడ్డం:
1.పావని 4. అలుసు 6. పకపకలు 9. పధాముడు 11. ధగధగ 13. తంతు 14. పేరోల 15. వళి 16. సంవకై 17. కాహళ 18. ప్రభ 19. లాభమ 20. గిలి 22. గవంముస 24. రాచరికం 26. కముపిజుట్ట 28. ముదనా 29. ముల్లంగి
నిలువు:
1.పాశుపతం 2. నిపము 3. పాప 4. అలుగ 5. సుమంగళి 7. కడుపే కైలాసము 8. కధలకామరాజు 10. ధాతుసంభవం 12. ధవళగిరి 18. ప్రగల్భము 21. లికంఇంగి 23. ముకనా 25. చట్టము 27. పికం
సంచిక – పద ప్రతిభ 37 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధసాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమటి సుబ్బలక్ష్మి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.