ఆర్జీవీ ఆదేశించాడు, రిషభ్ శెట్టి పాటించాడు – కాంతారా క్లైమాక్స్

4
3

[dropcap]కాం[/dropcap]తారా! కాంతారా!

ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే. దాని కలక్షన్లు గురించే. దాని కథా కథనాల గురించే. సాంస్కృతిక మూలాలను మరువని దాని filmmaker గురించే. అందులో వరాహ రూపం పాట గురించే.

దాని మీద వచ్చిన వివాదం సినిమా ప్రభను తగ్గించలేదు. ఓటీటీలో పాటను మార్చి చూపిన సంగతి నెటిజన్లు ఎత్తి చూపుతున్నా, సినిమాలో అసలు ఏముందని ఒక వర్గం ప్రేక్షకులు వెక్కిరిస్తున్నా, తమకు కనిపించిన గొప్పతనం ఇతరులకు ఎందుకు కనిపించలేదని నచ్చిన వాళ్ళ ఆశ్చర్యపోతున్నా..

All it adds to the myth of the film’s success. It’s a great film. It deserves the hype. అంతేనా?

మనవాళ్ళు ఇలాంటి సినిమా తీయలేరా ఇలాంటి క్లైమాక్సు సృష్టించలేరా? అంత ఒరిజినాలిటీ మన దగ్గర దొరకదా?

ఆటలో పోక లాగా ఒక చిన్న వివరం.

“అది నిజమైనా అబద్ధమైనా (ఊహ అయినా) నీకేదైనా అయితే నేను తట్టుకోలేను సమీరా,” అన్న మహేశ్ బాబు డైలాగ్ నుంచీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ నుంచీ, 1:నేనొక్కడినే లాంటి ఇంటర్వల్ బ్లాక్ మొత్తం ఒక అద్భుతం కాదా?

చెప్పకుండా చచ్చిపోయాడు సమీరా వీడు. చెప్పలేదు సమీరా వీడు. చచ్చిపోయాడు సమీరా వీడు.

మహేశ్ చూపిన intense grief.

సరే! కాంతారా దగ్గరకు వద్దాము. శివ బోర్లా‌ పడి ఉంటాడు. దొర మనిషి పట్టిన ఉడుము పట్టుకు మెడ నరాలు తెగిపోయే ఉంటాయప్పటికే. ఎముకలూ విరిగే ఉంటాయి. ప్రాణాలు అనంత వాయువులో కలిసే ఉంటాయి.

నిశ్శబ్దం. అనంతమైన నిశ్శబ్దం. అచేతన. గాలి స్తంభించింది. అందరి ఆశలూ అడుగంటాయి.

అప్పుడు జరుగుతుందో అద్భుతం. వరాహరూపుడు వస్తాడు. కేక వేస్తాడు శివ చెవి దగ్గర!

మిగతాదంతా మనం వెండి తెర మీద చూశాం. దైవం చూస్తూ ఉంటుంది. మానవ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దైవం కల్పించుకోదు.

మానవ ప్రయత్నం ఇక జరిగే అవకాశాలు అంతరించాయి అనుకున్నప్పుడు దైవం మానుష రూపేణ అన్నట్లు దైవ శక్తి అర్హులైన వారిని వాహకంగా చేసుకుని, లేదా అర్హమైన దేహాన్ని వాహకంగా మార్చుకుని వస్తుంది.

ధర్మ సంస్థాపన చేస్తుంది. వెళ్ళిపోతుంది.

ఎక్కడా ఇంతకన్నా గొప్పగా చూడలేదా?

1994!

గోవిందా గోవిందా!

An utter disappointment in the career of both Nagarjuna and Ram Gopal Varma.

అందులో మాంత్రికుడి బారి నుంచీ పిల్లవాడిని కాపాడేందుకు నవీన తన ప్రాణాలు ఒడ్డుతుంది. శీను దుఃఖంతోనే అంతిమ పోరాటానికి సిద్ధమవుతాడు. బాబు (ఆ పిల్లవాడు) తీవ్రమైన యోగ బలంతో దైవీశక్తి ఆగమనానికి మార్గం సుగమం చేసే పనిలో ఉంటాడు.

మాంత్రికుడి మీదకు శీను లంఘిస్తాడు. ఫలితం శూన్యం. మాంత్రికుడు శీనుని క్షణాలలో చిత్తు చేస్తాడు. శీను శక్తి నశిస్తుంది.

పోరాటానికి సిద్ధంగా ఉన్నా తనువు సహకరించదు. నాస్తికుడైన శీను మనసు అక్కడ స్థానం కోల్పోతుంది. అతని senses ను శూన్యత ఆవరించుకుంటుంది.

లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె, తనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్॥,

అదీ అతని పరిస్థితి. అంతా శూన్యం. కానీ, బాబు భగవంతుని ఆగమనానికి వేసిన బాటలు ఫలించి దైవమే దిగి వస్తుంది. ఇంతోటి మాంత్రికుని కోసం దేవాదిదేవుడా? ఆయన చేయి చేసుకోవాలా?

అందుకే చక్ర రూపం దూరంగా పడుతుంది. శీనుకు కాస్త జవసత్వాలు వస్తాయి.

ఈశ్వరుడు వచ్చాడు! వరదుడు కాచాడు! భద్రాత్మకుడు సంరక్షించాడు తన రాకతో.

కానీ, ఇంకా మానవ ప్రయత్నానికి కొద్ది ఆస్కారముంది కనుక చక్ర రూపును చేబూనిన శీను ఆ మాంత్రికుడిని వధిస్తాడు.

దైవ దర్శనం.

శిష్ట రక్షణ.

దుష్ట శిక్షణ.

గజేంద్రమోక్షంలో కూడా మొదట గజేంద్రుని రక్షించాకే, మకరుడిని శిక్షిస్తాడు శ్రియఃపతి.

ఇక్కడా అదే ఆర్డర్. దేవుడు వచ్చాక దుష్ట శక్తి ఆటలు సాగవు. చేష్టలుడిగి నిలుచుండి పోవటమే. అదే జరిగింది.

తీసింది..

రామ్ గోపాల్ వర్మ!

దైవ దర్శనం.

శిష్ట రక్షణ.

దుష్ట శిక్షణ.

ఆ పైన అంతా శుభమే!

కాంతారా కన్నా 28 సంవత్సరాల మునుపు. ఇదంతా జరిగింది. సెంటిమెంట్లు, మనోభావాలు, ఇగోలు పక్కన పెడదాం.

దేవుడు వచ్చాక ఇక ఏమీ మిగలదు. అంతా జరిగే పోతుంది. కేవలం execution మాత్రమే మిగిలి ఉంటుంది.

దాన్నే కాంతారాలో ఒక రకంగా, గోవిందా గోవిందాలో మరింత effective గా చెప్పారు.

దేవుడు-గ్రాఫిక్స్ సినిమాలంటూ దుష్ట శిక్షణ చేయలేక ఆ సమయం ఇంకా రాలేదని సెంటిమెంట్లు పోతూ దాక్కోవటం, మేము ఏమీ చేయలేమని దేవాదిదేవుడే చేతులెత్తేసేలా మెలోడ్రామాలు పోవటం చూపించిన తెలుగు సినిమాల కాలంలో..

మానవ ప్రయత్నం ఎలా జరుగుతుంది? ఎలా జరగాలి? ఆ పైన దైవం ఎలా తోడ్పడుతుంది? ఎలా చేరాల్సిన వారిలో ఆ శక్తి చేరుతుంది? ఆ పైన ఏమి జరుగుతుంది అన్న దానిని, ఏ హైప్ లేకుండా రామ్ గోపాల్ వర్మ గోవిందా గోవిందాలో ఎప్పుడో చూపాడు. మన వాళ్ళకే సినిమా చూడటం రాక ఫ్లాప్ చేశారు.

How God operates? అన్న దానిని modern Telugu సినిమాలో ఇంత effective గా చూపటం… న భూతో! శాస్త్ర వాక్యానికి అణుగుణమైన చిత్రీకరణ.

I was just 7 when I watched the film. But the climax captivated me. Like it happened yesterday.

కాంతారా క్లైమాక్స్ ఇదేగా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here