[dropcap]ఎ[/dropcap]వడు..
వేలు పెడితే
నీరు నిప్పు అవుతుందో..
ఎవడు..
కాలు పెడితే
ఉప్పు పప్పు అవుతుందో..
ఎవడు..
చెయ్యి ఊపితే
మూఢభక్తి ఉద్భవిస్తుందో
ఎవడి..
ఆశీర్వచనం కోసం
దేశాధినేతలు
అధికార గణం
న్యాయకో విధులు
క్యూ కడతారో
వాడే రా వాడే రా
గారడీ బాబా..