యాణ్ణే! ఒక పాట పాడండేఁ. ఏవన్నా మాట్టాడండేఁ.
Chapter 39
Song Kang-ho!
సాంగ్ కాంగ్-హో!
యాణ్ణో ఇన్నట్టుంది కదా ఈ పేరు?
మన కొరియానంలో ఇప్పటిదాకా ఒక subtext లాగా ఎక్కడో ఏ మూలో కాస్త కాస్త తగిలిన పేరు. నిజానికి కొరియన్ సినిమా చిరంజీవి అనుకోవచ్చు. కానీ, చిరంజీవిలా ఇతను trained actor (నటనలో శిక్షణ తీసుకున్న నటుడు) కాదు.
కొరియాలో దాదాపు ప్రతి చెప్పుకోదగ్గ నటుడూ కనీస శిక్షణ నటనలో తీసుకుంటాడు. కనీసం 365 వేర్వేరు సందర్భాలలో మన నటన ఎలా ఉండాలో గురువుల వద్ద నేర్చుకుంటారు. అక్కడే ఎవరి శైలిలో వాళ్ళు నటనను ప్రదర్శించటం మొదలుపెడతారు. తక్కువలో తక్కువ వంద సందర్భాలలో మన నటన ఎలా ఉంది అన్న అంచనా వేసుకున్నాకే ఇక ట్రయల్స్ మొదలెడతారు.
This is how any Korean actor or actress worth their salt get into the industry based on their merit, after formal training. ఆ పైన ఆడిషన్లు ఎటూ ఉంటాయి. ఎంత శిక్షణ పొందినా, ఆడిషన్లలో రాణించలేకపోతే వెనక్కే. మహా నటుడైన మన చోయ్ మి-సిక్ కూడా పాత్రకు తగిన దగ్గు సరిగా తీసుకురాలేదని ఒక అపురూపమైన పాత్రకు సెలక్ట్ కాలేదు. ఇక్కడ కూడా pretty faces, models turned actors లేదా యూట్యూబ్ ఇతర మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు కూడా సినిమాల్లోకి తీసుకోబడతారు. అవసరాన్ని బట్టీనో సందర్భాన్ని బట్టీనో. కాకపోతే మనలాగా తీసుకోబడింపబడరు. Seldom is also not the right word to describe it. Very very rare.
ఎక్కడ కొరియన్ సినిమాలను తీసుకోండి. నటీనటుల నటన బాగలేదనే మాట చాలా అరుదుగా వినబడుతుంది. అలా అని అందరూ trained అని కాదు. కానీ, ఎంతో కొంత నటన మీద అవగాహన ఉన్నవారే.
కొరియన్ సినిమాలో దర్శక త్రిమూర్తుల గురించి కాస్త వివరంగానే చెప్పుకున్నాం. ఈ చాంగ్-డాంగ్, పార్క్ చాన్-వుక్, కిమ్ కి-డుక్.
నటనలో త్రిమూర్తులుగా పరిగణించదగ్గవారు కూడా ఉన్నారు. కొరియన్ వేవ్ మొదలయ్యే సమయం నుంచీ, హాలీవుడ్‌కు ప్రత్యమ్నాయంగా కొరియన్ సినిమా నిలుస్తున్న ఈ రోజుల వరకూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో గొప్ప పాత్రలు పోషించి భవిష్యత్ తరాలకు ఒక సంపద లాగా ఇవ్వగలిగిన, ఇస్తున్న వారు. టేలెంట్ వారీగా
- మన Oldboy చోయ్ మిన్-సిక్
- సోల్ క్యుంగ్-గు
- సాంగ్ కాంగ్-హో
చోయ్… నట శిఖరం. ఏ తరంలో తీసుకున్నా ప్రపంచ టాప్ 5గురు నటులలో ఒకడిగా నిలుస్తాడు. Rugged charm and sex appeal కూడా ఉన్నాయి. ఎక్కువ artsy పాత్రలు వేస్తాడు. అయినా కమర్షియల్ హిట్లు ఇస్తూనే ఉంటాడు. ఆంగిక వాచకాల దగ్గర నుంచీ వంక పెట్టేందుకు ఏమీ ఉండదు. అలా చూస్తూ కూర్చోవటమే. ఇతరులు తన ముందు తేలిపోకుండా ఉండటానికి తన ప్రతిభలో కేవలం 50% మాత్రమే ప్రదర్శిస్తాడు. బ్రూస్ లీ వేగాన్ని మనకవగతమయ్యేలా ఉండాలని స్లో మోషన్ లో తీస్తే అది నార్మల్ frame rate కు మ్యాచ్ అయినట్లు, చోయ్ సగం ప్రతిభ చూపినా ఎంత వారలైనా అతని ముందు… అదీ సంగతి!
సోల్… Sol Kyung-gu… చోయ్ అంత versatile కాదు కానీ, సహజ నటుడు. ఎలాంటి పాత్రనైనా, ప్రత్యేకించి మెలోడ్రమటికల్ పాత్రలను బాగా చేస్తాడు. లైట్ హ్యూమర్, యాక్షన్ పాత్రలకు కూడా సూటవుతాడు.
ఇక
సాంగ్… Song Kang-ho!
ప్రస్తుతం ఇతను Face of Korean Cinema for the western audience thanks to mega blockbusters like Snowpiercer and Parasite. మహా నటుడు అని చెప్పలేము కానీ, ఈ పాత్రా ఆ పాత్రా అని తేడా లేకుండా ఏ పాత్ర అయినా కనీసం competent గా చేయగలడు. కొరియన్ సినిమాలో అధిక సంఖ్యలో బ్లాక్బస్టర్సు ఇచ్చింది కూడా ఇతనే.
విచిత్రమేమిటంటే… he’s not a trained actor.
అలా అని సహజ ప్రతిభ ఉన్నవాడు కూడా కాదు. పైగా typical Asianic face (Chinese-Japanese-Korean facial features) ఉన్న వాడు. ఏ రకంగా చూసినా lead actor గా మార్కెటబుల్ కాదు. అయినా, తనను తాను ప్రతి సినిమాతో మలచుకుంటూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాడు.
ఇప్పుడు అతని గరించే తెలుసుకుందాం.
Song Kang-ho
A Little a Monk అనే నాటికతో నటనాజీవితం మొదలు పెట్టిన సాంగ్ spontaneity, subtlety, instincts, improvisation, ad libbing వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ముప్పై ఏళ్ళు వచ్చేదాకా వెండితెర మీద కనబడని సాంగ్ అనతికాలంనోనే కొరియన్ సినిమాలో a breath of fresh air అనిపించుకున్నాడు.
Born in Gimhae, Gyeongsangnam-do, in 1967, he graduated from the Broadcasting and Entertainment department of Gyeongsang University. He started acting in plays and dramas with a Busan local troupe initially.
ఆ పైన Kee Kuk-seo పెట్టిన థియేటర్ కంపనీలో చేరాక అక్కడ spontaneous acting లో మెలకువలు నేర్చుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే home-cooked style. విషయాన్ని గ్రహించి తనదైన శైలిలో ప్రదర్శించటం తప్ప ఎక్కడా ఏదీ నేర్చుకోలేను, ఇతరులు చెప్పిన విధానాలను అలాగే నేను అనుసరించలేను అంటాడు సాంగ్.
ఇతనిలో ఉన్న నటుడిని గుర్తించింది Kim Eui-sung, అతను చేరిన థియేటర్ ట్రూప్‌లో సీనియర్.
1990లలో గొప్ప కొరియన్ సినిమాగా గుర్తింపు పొందిన కల్ట్ హిట్ The Day The Pig Fell In The Well లో ఒక చిన్న పాత్రకు రికమెండ్ చేయటమే కాకుండా దర్శకుడితో పోరి అతని సన్నివేశం ఎడిటింగ్‌లో పోకుండా చూశాడు Kim Eui-sun.
ఈ చాంగ్-డాంగ్ తొలి సినిమాలో ఒక చిన్న పాత్రకు ఎంపిక కావటంలో కూడా కిమ్ హస్తం ఉంది. ఈ సినిమా గ్రీన్ ఫిష్. దీనిలో సాంగ్.. పాన్-సు అనే పాత్రలో తన ప్రతిభ చాటాడు.
గ్రీన్ ఫిష్ అప్పటికి సూపర్ స్టార్ కాబోయే Han Suk-kyu కు తొలి స్టారింగ్ రోల్. He was the lead actor of Green Fish and took note of the big headed newcomer. హన్ యే సాంగ్ ను మెగా బ్లాక్బస్టర్ షిరీ లో తన సహచర ఆఫీసర్ పాత్రకు రికమెండ్ చేశాడు. అంత ఆకట్టుకున్నాడు సాంగ్.
కానీ, సాంగ్‌కు తాను సినిమాలకు పనికొస్తానని నమ్మకం కలిగించిన సినిమా No. 3. అది అతని మూడవ సినిమా కావటం కూడా ఒక విశేషం. సాంగ్‌ను మించి ఖ్యాతి గడించి అసలు నటుడంటే ఇలా ఉండాలి అనేంతగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన మన చోయ్ మిన్-సిక్ కు breakthrough ఇచ్చిన సినిమా కూడా ఇదే. No. 3. ఇక ఈ సినిమాలో కథానాయకుడు Han Suk-kyu.
ముగ్గురూ ముగ్గురే.
మరి అలాంటి Retrospectively Landmark film ను గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. కుందాం. అదే టైమ్ లో సోల్ క్యుంగ్-గు ఏమి చేస్తున్నాడో?
ఈలోగా, తిరుపతిలో వానలుగా ఉన్నాయి. చెన్నైలో కూడా. ఎన్న సమాచారం?
అవతార్ టికెట్ల వేట ఎంత వరకూ వచ్చిందేటి?
(సశేషం)