[dropcap]రో[/dropcap]గాలు దైవాలై
రోడ్లెక్కిన దేశంలో
రోగకారకాల గురించి
ఊహ చేసే భక్తుడు ఎవరు?
శాస్త్రజ్ఞాన సంపదను
అనుభవిస్తూ ఆనందిస్తూ
వాటి విజయాలను ఒప్పుకోని
వివేకవంతుల వేదం వేషం
వేసిన వేదాంతులను ఏమనాలి?
అబద్ధానికి అస్తిత్వం అంటగట్టి సత్యాన్ని సమాధి చేసి
మూఢ భక్తిని పెంపొందించి
తాము దేవుళ్ళమని తిరిగే నరకకూపాలు ఎంతమంది?
కొత్తను ఆమోదించక
పాతకి కొత్తను ఆమోదిస్తూ
పాత సీసాలకు కొత్త రంగులు రాస్తూ..
రాటుతేలుతున్న పోటుగాళ్లు ఎవరు?
ఎవరు ఎవరనేది
ఎవరికి తెలుసు
ఎందరికి తెలుసు..