[ది 20 డిసెంబరు 2022న మృతి చెందిన ప్రముఖ రచయిత శ్రీ చావా శివకోటి గారికి నివాళి అర్పిస్తోంది సంచిక.]
~ ~
ప్రముఖ రచయిత, కవి, శ్రీ చావా శివకోటి 20 డిసెంబరు 2022న అనారోగ్య కారణాలతో పరమపదించారు.
కథకుడిగా ప్రసిద్ధులు, విశిష్టమైన నవలలూ రాశారు.
ముఖ్యంగా వీరి ‘అసురగణం’ నవల సంచలనం సృష్టించింది.
సంచిక వెబ్ మ్యాగజైన్‍లో కథలు, కవితాలు రాశారు.
వీరివి – బతుకాట, గాంధీ మార్గం, గుంటూరు టు హైదరాబద్, ఇది వృత్తయింది, కలనైనా, కల్లుపాక కథలు, లచ్చి, నామాలయ్యా నువ్వు, నిర్భయ నిర్ణయం, ఓ చిన్న పొరపాటు, పదార్థం అందని స్వార్థం, ప్రశ్నార్థకం, వీడ్కోలు సభ, ఆడ-మగ, అకాల మేఘం, ఎప్పటాటే, ఇలా – అనే కథలు సంచికలో ప్రచురితమయ్యాయి.
సంచికలో ‘అనుబంధ బంధాలు’, ‘గతించని గతం’ అనే వీరి నవలలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ‘నియో రిచ్’ అనే నవల ధారావాహికంగా కొనసాగుతోంది.
సంచిక వారికి అంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది.
వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థిస్తోంది.
సంచిక టీమ్