10.
మనసున్నంత వరకే
మాటల సందడి
ఊపిరి ఆగితే
అన్ని మాయమే
11.
ఆడవారి మనసు
అంతులేని నిగూఢం
నిగ్గు తేల్చే
ఘనుడేడి?
12.
మంగళ ప్రదంగా
పని ఆరంభించాలి
జయప్రదంగా
పని సాధించాలి
13.
అంతులేని
రహస్యాలెనెన్నో శూన్యంలో
శోధించుట
ఎవరికి సాధ్యం?
14.
జీవరాశుల
కాల వ్యవధి
దేనికెంత అని
ఎవరు చెప్పగలరు?
15.
ఉచ్ఛ్వాస
నిశ్వాసలే ప్రాణం
శ్వాస ఆగితే
అంతే సంగతులు