[dropcap]ఎ[/dropcap]క్కే రైలు, దిగే బస్సు
సాగే నడక
అంతా నీ కోసం
నా ఆరాటం..
నీ స్నేహం ఎంతో
మాధుర్యమైనదని
అది నా హృదయాన్ని నింపినదని
నీకు తెలియనిది ఏమి!!
మనము మిత్రులమో కానివారమో
నాకెరుక లేకపోయనేమి!!
నిన్ను చూస్తే
కంటికెదురుగా వర్షాన్నే చూసినట్లు
మాసిన గాయం మళ్ళీ రేగెనేమి!!
ఎంత జీవితం చూసానేమి
నాకంత విశాల హృదయం ఉండటానికి?
మరుపెంత కావాలి నీ కళ్ళు
చూడకుండా ఉండటానికి!!
కనుసన్నలలో నుండి నీ మోము
నే చూచాను, హృదయం లోని
గాయం కరుగగ వర్షించేను మేఘమై