[dropcap]ప్ర[/dropcap]సిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.
***
అనగనగా ఒక బ్యాంక్ ఆఫీసర్. నిజాయితీ పరుడు, మంచివాడు. అప్పటికే వెన్నుపోటు వల్ల దుఃఖంతో బాధపడుతున్న అతనికి భార్య చేసిన ద్రోహం ఏమిటి? దాన్ని అతను తట్టుకోగలిగాడా? దానివల్ల ఆ కుటుంబం ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవలసి వచ్చింది?
అనగనగా ఒక చంద్రముఖి. చప్పుళ్ళు వినబడితే ఆమెకు పూనకం వస్తుంది. వంద ఏనుగుల బలంతో ఆ చప్పుడు చేసిన వాళ్ళని చితకబాదుతుంది. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోంది? ఆమె వల్ల హాని తప్ప మేలు జరగదా?
అనగనగా ఒక అడ్వకేట్. అతను అప్పుడప్పుడు నవలలో ప్రత్యక్షమవుతుంటాడు. అతను ఎలాంటివాడు? ఈ మనుషులతో అతనికున్న సంబంధమేమిటి?
అనగనగా ఒక కుర్ర ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. జీవితంలో కావాలనుకున్న విలాసాలు చిటికెలో కొనుక్కోగలడు. తను జీవించే ‘సాధారణమైన’ రోజువారీ జీవితం ఎంతో మందికి జీవితాశయం. అటువంటి వాడు ఉన్నట్టుండి ఉద్యోగం మానేశాడు! మానేసి, ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటి?
వీళ్ళందరూ ఒకరినొకరు ఎరుగుదురా? జీవితం వీళ్ళందరినీ పావులుగా చేసి ఎయే దారుల్లో ఎలాగ నడిపించింది… మరి ఈ నవల గమనంలో వీళ్ళు పాఠకులని యే దారిలో నడిపిస్తారో తెలియాలంటే, తప్పక ‘మార్పు మన(సు)తోనే మొదలు’ చదవాల్సిందే!
***
ఈ సరికొత్త ధారావాహిక.. సంచికలో.. వచ్చే వారం నుంచి.