దేశ విభజన విషవృక్షం-23

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]మ[/dropcap]హమ్మద్‌ ఘోరీ పుణ్యమా అని భారతదేశాన్ని బానిసలు సైతం చిత్తం వచ్చినట్టు ఏలుకొన్నారు. ఈ బానిసలు తమ మీద వాళ్ల బాసులు ప్రయోగించిన దారుణాలన్నింటినీ హిందువుల మీద చిత్ర విచిత్రంగా ప్రయోగించారు. ఇలాంటి బానిసల్లో ఒక బానిస జియాసుద్దీన్‌ బాల్బన్‌. వీడి రాజరికపు పేరు ఆల్ఖాఖనుల్‌ మౌజమ్‌ బహౌల్‌ హక్‌ వావుద్దీన్‌ ఉలగ్‌ఖాన్‌ బాల్బనస్‌ సుల్తానీ.. మన దేశం ఇరవై ఏండ్లు వీడి కబంధహస్తాల్లో నలిగిపోయింది. మానవ రూపంలో ఉన్న రాక్షసుడు. వీడి పైశాచిక ప్రవృత్తిని వివరించడానికి పదాలు దొరకవు. రాక్షసత్వానికి పరాకాష్ట ఏదైనా ఉంటే అది బాల్బన్‌ వ్యక్తిత్వమనే చెప్పాలి. భారతదేశంలో అత్యంత భయంకరంగా మనుషులను చిత్రహింసలు పెట్టి సామూహిక హననం చేసినవాడు. మహిళలను ఏ అంగానికి ఆ అంగం కోసుకొని వండుకొని తినే పదార్థాలుగా ట్రీట్‌ చేసిన పిశాచి. మహారాష్ట్రియా జ్ఞాన్‌కోశ్‌ లోని 12వ భాగంలోని జీ191 వ పేజీలో (1922 ఎడిషన్‌) బాల్బన్‌ అరాచకాలను గురించి వివరించారు.

“Balban’s life was one of turmoil and (continuous) warfare. He was extremely cruel and a man slaughterer. In suppressing interminable revolts around Delhi in massacred 100000 human beings which cause rivers of blood flow all along. Mangled dead bodies piled up in every town and the whole region emitted an unbearable stench.”

బాల్బన్‌.. టర్కిస్తాన్‌లోని అల్బరీలోని కఖాన్‌ తెగకు చెందిన వాడు. బాల్బన్‌ చిన్నతనంలోనే టర్కిస్తాన్‌ను ఆక్రమించుకొన్న మంగోలులు ఇతడిని బానిసగా చేసుకొని వెళ్లిపోయారు. అతడికి బానిసగా ఎలా ఉండాలి.. ఎలా వ్యవహరించాలి.. యజమానికి విధేయంగా ఎలా ఉండాలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ బాల్బన్‌కు తరువాతి కాలంలో బాగా కలిసివచ్చింది. మనుషులను ఊచకోత చేయడానికి బాగా పనికొచ్చింది. కొద్దిరోజులకు బాల్బన్‌ను ఘజ్‌నీ ఖ్వాజా జమాలుద్దీన్‌కు బానిసగా అమ్మేశారు. జమాలుద్దీన్‌ అనేవాడు హోల్‌సేల్‌ బానిసల వ్యాపారి. ముస్లిం రాజుల కాలంలో బానిసల వ్యాపారం అనేది చాలా లాభసాటిగా మారింది. అల్లాను నమ్మని వాళ్లను పట్టుకొచ్చి బానిసలుగా చేసి అమ్మేవారు. బాజాప్తా బజార్లో పందుల వ్యాపారం చేసినట్టే బానిసలను కూడా నిలబెట్టి వేలం వేసేవారు. బానిస అంగ సౌష్టవాలను, బలాబలాలను వర్ణిస్తూ వేలం వేసేవారు. ఇదొక భయంకరమైన వ్యాపారం. భారతదేశంలో ముస్లింల కాలంలో అత్యంత హీనంగా హిందువులను వేలం వేసేవారు. వీళ్లను ముస్లిం రాజులు, సంపన్నులు వేలంలో పోటీపడి కొనేవారు. ఈ బానిసలను తమ పనుల కోసం చిల్లర వ్యవహారాల కోసం, లైంగిక కోరికలు తీర్చుకోవడం కోసం విచ్చలవిడిగా వాడుకొనేవారు. వీరికి ఆయుధ శిక్షణ ఇచ్చి బందిపోట్లుగా తయారుచేసి.. ఊళ్లమీదకు, దేశాల మీదకు ఉసిగొల్పేవారు. సంపద దోపిడీకి, సామూహిక మానవ హననానికి వీళ్లను వాడుకొనేవారు. తమకు ముందు రక్షణగా అంటే ఇవాల్టి బౌన్సర్లుగా వీరిని వినియోగించుకొనేవారు. బానిసల వ్యాపారం అనేది అత్యంత పెద్ద వ్యాపారం. మహిళలను అమ్మడం అంటే.. వారిని లైంగిక అవసరాలకు వాడుకోవడం కోసమే. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఈ విధంగానే బానిసల అమ్మకాల వ్యాపారం కొనసాగుతున్నది. ఇస్లాం పాలకుల భయంకరమైన రాచరికం ఎలా ఉంటుందో మధ్య యుగాల నుంచి తాలిబన్ల దాకా మనకు కనిపిస్తూనే ఉన్నది. అయినప్పటికీ, భారత్‌లో మాత్రం మనవాళ్లు ముస్లిం రాజులను నెత్తిన పెట్టుకొని పూజిస్తుంటారు.

1232 సంవత్సరంలో బాల్బన్‌ యజమాని బాల్బన్‌తోపాటు మరికొందరు బానిసలను ఢిల్లీకి తీసుకొచ్చి వేలంలో అమ్మేశారు. అక్కడ అంతకుముందు బానిస రాజైన అల్త్‌మష్‌ ఈ బాల్బన్‌ను కొన్నాడు. అల్త్‌మష్‌ గురించి మనం ఇంతకుముందే తెలుసుకొన్నాం. అప్పటికే అల్త్‌మష్‌ దేశాన్ని ఏలాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాడు. అందులో భాగంగా తనకు భయంకరంగా వ్యవహరించే ఒక గ్యాంగ్‌ కావాల్సి వచ్చింది. అందుకోసం బాల్బన్‌తో పాటు మరికొందరు బానిసలను అల్త్‌మష్‌ కొన్నాడు. ఆ కాలంలో బానిసల వ్యాపారం పెద్ద ఎత్తున జరిగింది. జమాలుద్దీన్‌ లాంటి వ్యాపారులు చాలా మంది ఉండేవారు. పశ్చిమాసియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి బానిసలు, గ్యాంగ్‌స్టర్‌లను ఇంపోర్ట్‌ చేసి భారత్‌లో రాజులకు, వ్యాపారులకు అమ్మేవారు.

బాల్బన్‌ను కొనుక్కొన్న అల్త్‌మష్‌.. అతడిని పర్సనల్‌ అసిస్టెంట్‌గా పెట్టుకొన్నాడు. ఇతడికి కొంత సైన్యాన్ని అప్పజెప్పి ఇస్లాం పేరుమీద చుట్టుపక్కల ఉన్న హిందూ దేశాల మీదకు దోపిడీకి పంపించాడు. బాల్బన్‌ తన ముఠాతో వివిధ ప్రాంతాలపై దాడులు చేసి వేలమందిని చంపేశాడు. టన్నుల కొద్దీ సంపదను దోచుకొన్నాడు. పలుచోట్ల హిందూ రాజులు అతడిని బందీచేశారు. ఆ సమయంలో అతడు వాళ్లను క్షమాభిక్ష కోరి.. తాను ఇకపై మంచిగా ఉంటానని అంగీకరించి బయటపడేవారు. మన రాజుల ఔదార్యం వాడిని మరింత రెచ్చిపోయేలా చేసింది. వాడు బయటపడి.. మళ్లీ విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు. ఇలా అనేక చోట్ల బందీ కావడం.. ఏదో ఒక వంకచెప్పి.. క్షమాపణ కోరి బయటపడటం బాల్బన్‌కు అలవాటుగా మారింది.

అల్త్‌మష్‌ తరువాత అతని కూతురు రజియా రాజ్యంలోకి వచ్చింది. రజియాకు బాల్బన్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌గా పనిచేశాడు. రజియా బలహీనతలను అవకాశంగా మలచుకొని బాల్బన్‌ ఆమెను లైంగికంగా వాడుకొన్నాడు. వాడి వ్యవహారశైలితో జంతువుల శాలకు చీఫ్‌గా నియమించారు.

బాల్బన్‌ క్రమంగా తన వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. రజియాను తప్పించడానికి ఎత్తుగడ వేశాడు. ఆస్థానంలో ఒక్కొక్కరినీ జమకూర్చాడు. రజియా సోదరుడు బెహ్రమ్‌ షా.. బాల్బన్‌కు ఒక ప్రాంతాన్ని పాలించుకోవడానికి అప్పజెప్పాడు. అప్పటినుంచి బాల్బన్‌ అరాచకాలు పెచ్చుమీరాయి. కొద్దికాలానికి రజియాను దారుణంగా చంపేశాడు. ఆ తరువాత కొన్నాళ్లకు బెహ్రమ్‌షాను కూడా చంపేశాడు. ఢిల్లీ సుల్తాన్‌ పీఠం పైనే బాల్బన్‌ కన్ను పడింది. బాల్బన్‌ పగ, ప్రతీకారేచ్ఛ, పైశాచికత్వం చూసి రాజరికపు పెద్దల మద్దతు లేకుండాపోయింది. దీంతో ఢిల్లీ సుల్తాన్‌ పీఠం కలగానే మిగిలిపోయింది. బెహ్రమ్‌ షా తరువాత అల్త్‌మష్‌ మనవడు అల్లావుద్దీన్‌ మసూద్‌ షా రాజ్యంలోకి వచ్చాడు. కానీ రాజ్యాధికారం స్వీకరించడమే అతడి పాలిట శాపంగా   మారిపోయింది. అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లకే మసూద్‌షాను హతమార్చారు. తరువాత మరోసారి ఢిల్లీ సింహాసనం మీద కూర్చోవడానికి చాలా ప్రయత్నించాడు బాల్బన్‌. కానీ.. ఈ సారి కూడా విఫలమయ్యాడు. తరువాత అల్త్‌మష్‌ మరో కొడుకు నసీరుద్దీన్‌ షా రాజ్యంలోకి వచ్చాడు. నసీరుద్దీన్‌ షా దాదాపు ఇరవై ఏండ్లపాటు పరిపాలించాడు. నసీరుద్దీన్‌ అధికారంలో ఉన్నంత కాలం అతడి సైన్యానికి చీఫ్‌గా, సైనికాధికారిగా కమాండర్‌గా బాల్బన్‌ వ్యవహరించాడు. పైశాచిక మనస్తత్వం ఉన్నవాడికి.. ఆకాంక్ష అత్యంత బలంగా ఉంటుందట. బాల్బన్‌ కూడా అలాంటివాడే. రాజ్యంమీద అధికారం కోసం ఎన్ని ఏండ్లయినా వేచిచూశాడు. చాలా కాలం తరువాత నసీరుద్దీన్‌పై విష ప్రయోగం చేసి  చంపేశాడు. నసీరుద్దీన్‌ ఇష్టమైన భార్య ద్వారా అతడికి విషం ఇప్పించారు. నసీరుద్దీన్‌ చనిపోయిన తరువాత ఆమెను కూడా వెన్నుపోటు పొడిచి చంపేశాడు.

నసీరుద్దీన్‌కు కొడుకులు లేకపోవడంతో అల్త్‌మష్‌ వంశం అంతరించిపోయింది. ఇక బాల్బన్‌కు అడ్డులేకుండా పోయింది. అతడు సుల్తాన్‌గా ఢిల్లీ గద్దెనెక్కాడు. బాల్బన్‌ దాదాపు 20 ఏండ్లు పరిపాలించాడు. బాల్బన్‌ పరిపాలన కాలం ముస్లిం రాజులందరిలోనూ అత్యంత భయంకరమైనదిగా చెప్పుకోవచ్చు. ఇతడి కాలంలో గొప్ప గొప్ప నగరాలు, పట్టణాలు అన్నీ కూడా మనుషుల శవాలతో దిబ్బలుగా మారిపోయాయి. రక్తపుటేరులు పారాయి. బతకడమే కష్టంగా మారిపోయింది. హిందువుగా జీవించడం దుర్భరంగా తయారైంది. అయితే మతం మారడమో.. లేకపోతే బానిసగా బతుకు వెళ్లమార్చడమో, లేక చచ్చిపోవడమో తప్ప మార్గాంతరం లేకుండా పోయింది. కానీ చరిత్రకారులు మాత్రం ఇతడిని చాలా గొప్పవాడుగా చిత్రించారు. ఆశిర్‌ బడీలాల్‌ శ్రీవాస్తవ రాసిన ఢిల్లీ సుల్తానేట్‌ (1959 హిందీ ఎడిషన్‌)లో ఇతడిని మహానుభావుడిగా కీర్తించారు. ఇంకా చెప్పాలంటే మహాత్మాగాంధీ కంటే గొప్పవాడని చెప్పుకొంటూ వచ్చారు.

అల్త్‌మష్‌ తరువాత బాల్బన్‌ చాలా శక్తిమంతుడిగా మారిపోయాడు. మొదట్లో టర్కిష్‌ రాజులు ఢిల్లీ బానిసలను తమ అవసరాలకు బాగా వాడుకొనే వారు. ఈదేశంలో సంపదను దోచుకోవడానికి, మనుషుల అమ్మకాలు, కొనుగోళ్లు జరపడానికి మహిళలను ఎత్తుకుపోవడానికి వాడుకొనేవారు. కానీ అల్త్‌మష్‌ కొనుక్కొన్న 40 మంది బానిసలు శక్తిమంతులయ్యారు. వీరిలో బాల్బన్‌ కూడా ఒకరు. టర్కిష్‌ రాజుల వెన్నువిరిచారు. తమపై వాళ్ల పట్టు లేకుండా చేసుకొన్నారు. సొంతంగా సార్వభౌమాధికారాన్ని సాధించుకొన్నారు. బాల్బన్‌ వీళ్లందరిలోనూ బలపడ్డాడు. ఢిల్లీ పీఠంపై పట్టు రావడంతో మిగతా నలభై మందిని కూడా దెబ్బతీయడానికి బాల్బన్‌ ప్రయత్నించాడు. తక్కువజాతికి చెందిన తురకలకు కొన్ని ప్రాంతాలను అప్పగించి రాజ్యం చేసుకొమ్మన్నాడు. దీంతో అధికార కేంద్రాలు ఎక్కువై తిరుగుబాట్లు, అనిశ్చితికి కారణమయ్యాయి. ఈ 40 మందిలో ఒకడైన మాలిక్‌ బక్‌బక్‌ (బదాయూన్‌ గవర్నర్‌)ను చిల్లర కారణాలు చెప్పి రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు. మాలిక్‌ బక్‌బక్‌ దగ్గర పెట్టిన బాల్బన్‌ గూఢచారి ఒకడు మాలిక్‌కు వ్యతిరేకంగా చెప్పలేక పోవడంతో అతడిని చిత్రహింసలు పెట్టి చంపారు. తరువాత అయోధ్య గవర్నర్‌ హైబత్‌ ఖాన్‌పై 500 కొరడా దెబ్బలు కొట్టించాడు. ఆ తరువాత హైబత్‌ఖాన్‌ తాగి మత్తులో చంపిన ఒక ముస్లిం భార్యకు బానిసగా పంపించాడు. గతిలేని హైబత్‌ఖాన్‌ హిందువుల నుంచి 20 వేల టంకాలను దోపిడీ చేసి ఆమెకు అప్పజెప్పి బానిసత్వం నుంచి విడుదలయ్యాడు. వాడు బయటకు వచ్చినప్పటికీ.. జరిగిన అవమానాన్ని తట్టుకోలేక జీవితాంతం ఇంటికే పరిమితమైపోయాడు. తరువాత మరో గవర్నర్‌ అమీన్‌ ఖాన్‌ను చంపేసి అతడి శవాన్ని అయోధ్య గేట్‌ ముందు జండాలాగా ఎత్తైన స్తంభానికి వేలాడదీశాడు బాల్బన్‌. తరువాత భటిండా, భాట్నర్‌, సమానా, సునమ్‌ ప్రాంతాలకు గవర్నర్‌గా ఉన్న షేర్‌ఖాన్‌పై విషప్రయోగం చేసి చంపించాడు. ఇతడు అమీన్‌ఖాన్‌కు కజిన్‌. చాలా బలవంతుడు. బలమైన ఆకాంక్షలు ఉన్నవాడు. ఇతడితో తనకు ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించిన బాల్బన్‌ ఇతడిని కూడా ఎలిమినేట్‌ చేశాడు. దీంతో బాల్బన్‌కు ఎదురులేకుండా పోయింది. మిగతా  బానిసలు బాల్బన్ వల్ల తమకు ఉన్న ప్రమాదాన్ని  గ్రహించి జాగ్రత్తపడ్డారు. ఎక్కడికక్కడ గూఢచారులను ఏర్పాటుచేసుకొన్నాడు. బలమైన నెట్‌వర్క్‌ను వ్యవస్థీకృతం చేసుకొన్నాడు. తాను దోచుకొన్నదాంట్లో కొంత శాతం మిగతా బానిసలకు పంచిపెట్టేవాడు. హిమాదుల్‌ ముల్క్‌ను తన కమాండర్‌గా నియమించుకొన్నాడు. ముస్లిం రాజులు తమ ఉద్యోగులకు జీతాలు, భత్యాలు ఎన్నడూ కూడా ఇవ్వలేదు. ఎవరికి తోచినంత వారు దోచుకోవడానికి స్వేచ్ఛను మాత్రం కల్పించారు. ఉద్యోగులు వాళ్ల వాళ్ల శక్తి సామర్థ్యాలను బట్టి హిందువుల ఇండ్లపై పడి దోచుకొనేవారు. తిండిగింజల దగ్గరనుంచి సమస్తం దోచుకొనిపోయేవారు. బాల్బన్‌ ఎంత భీకరంగా ప్రవర్తించాడో.. హిందువుల ప్రతిఘటనలు కూడా అంతే తీవ్రంగా జరిగాయి. బానిస సుల్తాన్‌ల మీద పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. వాళ్లను నిరోధించడానికి హిందువులు బలంగా ప్రయత్నించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడంలోనే బాల్బన్‌ తలమునకలైపోయాడు. ఎప్పటికప్పుడు తిరుగుబాట్లను అణచివేయడంలోనే బాల్బన్‌  కాలమంతా గడిచిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here