1.
ప్రకృతి జీవాన్ని
పుట్టిస్తుంది
మనుగడ నిస్తుంది
ఎంత కాలం?
2.
ఆ పైవాడు
అన్నీ చూస్తుంటాడు
కానీ ఎవరికి ఏమి
సాయం చేయడు.
3.
పంచ భూతాల్లోని గాలి
జీవనాధారం
కానీ దాన్ని కలుషితం
చేయకుంటే
4.
గంగానది జలం
పవిత్రం
కానీ దాన్ని కలుషితం
చేయనంత వరకే.
5.
పనియందు శ్రద్ధ
నైపుణ్య ముండాలి
వాటంతట ఆవే
నెరవేరుతాయి
6.
సహజీవనం
కోర్కెలు తీర్చుకొనుటకు
పెళ్లి కాకుండా
సమంజసమా?