సినిమా క్విజ్-21

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. పెండ్యాల నాగాంజనేయులు దర్శకత్వంలో, సత్యం సంగీత దర్శకత్వంలో చలం, విజయలత, విజయ నిర్మల నటించిన ‘బుల్లెమ్మ బుల్లోడు’ చిత్రానికి ఏ కన్నడ చిత్రం ఆధారం? రాజ్‍కుమార్, భారటి నటించగా, వై. ఆర్. స్వామి దర్శకత్వంలో 1970లో వచ్చింది కన్నడ చిత్రం.
  2. చిరంజీవి, శ్రీదేవి నటించిన ‘S.P. పరశురాం’ చిత్రానికి తమిళ చిత్రం ఆధారం. ఇందులో సత్యరాజ్, సుకన్యలు ప్రధాన పాత్రలు పోషించగా, పి. వాసు దర్శకత్వం వహించారు. చిత్రం పేరు?
  3. తమిళ దర్శకులు కె. బాలచందర్ గారు జెమిని గణేశన్, బి. సరోజ దేవితో (1968) ‘తామరై నెంజం’ తీశారు. తెలుగులో జి రామినీడు దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. హీరోయిన్ వాణిశ్రీ ఎదగటానికి ‘మరపురాని కథ’ చిత్రం ఆధారం. నిర్మాతలు సుందరలాల్ నహతా, డూండీలు. దర్శకులు వి. రామచంద్ర రావు. కృష్ణ హీరో. శివాజీ గణేషన్, సావిత్రి, కె. ఆర్. విజయలు నటించిగా, కె. ఎస్. గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన ఏ తమిళ చిత్రం ఈ తెలుగు సినిమాకి మాతృక? (హిందీలో ఈ సినిమా ‘ప్యార్ కీ కహానీ’గా వచ్చింది).
  5. హిందీలో సంజీవ్ కుమార్, అమితాబ్ బచ్చన్, శశి కపూర్‍లతో ‘త్రిశూల్’ చిత్రం యష్ చోప్రా దర్శకత్వంలో వచ్చింది. తెలుగులో ఈ సినిమాని రీమేక్‍గా శోభన్ బాబు, సుహాసిని, శారద, చరణ్ రాజ్ లతో తీశారు. తెలుగు సినిమా పేరేమిటి?
  6. 1957లో తమిళ చిత్రం ‘మర్మవీరన్’‍కు అనువాదమైన తెలుగు చిత్రం పేరేమిటి? ఇందులో శ్రీరామ్, వైజయంతి మాల నటించగా అతిథి పాత్రల్లో ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, జెమినీ గణేశన్, ఆర్. నాగేశ్వరరావు (ఒక పాటలో) కన్పిస్తారు. చిత్ర దర్శకుడు టి. ఆర్. రఘునాథ్.
  7. తమిళంలో సంగీత దర్శకుడు ఇళయరాజా పరిచయమైన చిత్రం ఏది?
  8. కొమ్మూరి సాంబశివరావు వ్రాసిన డిటెక్టివ్ నవల ‘పట్టుకుంటే లక్ష’ ఇదే పేరున సినిమాగా వచ్చింది. ఇందులో యుగంధర్ పాత్రధారి ఎవరు?
  9. చిరంజీవి నటించిన ‘అంజి’ చిత్రానికి ఏ ఇంగ్లీషు చిత్రం ఆధారం?
  10. చిరంజీవి నటించిన ‘మృగరాజు’ చిత్రానికి ఏ ఇంగ్లీషు చిత్రం ఆధారం?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జనవరి 31వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 21 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఫిబ్రవరి 05 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 19 జవాబులు:

1.మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ 2. చిన్నయ్య మండ్రయార్ గణేశ మూర్తి 3. రామస్వామి గణేశన్ 4. కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు 5. రాజబాబు 6. పుణ్యమూర్తుల అప్పలరాజు 7. వసుంధర దేవి 8. కమలకుమారి 9. రత్నకుమారి 10. లలితారాణి 11. సుజాత

సినిమా క్విజ్ 19 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • ఎస్. లక్ష్మీ ప్రసన్న
  • శ్రేయ ఎస్. క్షీరసాగర్
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • భరత్
  • నాగరాజు
  • హేమలత
  • సౌఖ్యశ్రీ
  • రేవతి
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here