[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రానికి ఆధారమైన ఇంగ్లీషు చిత్రం ఏది?
- నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా నటించిన ‘క్రిమినల్’ చిత్రానికి దర్శకుడు మహేష్ భట్. ఈ చిత్రానికి మాతృక అయిన ఇంగ్లీషు చిత్రం ఏది?
- ‘Theertha Karaiyinile’ అనే తమిళ చిత్రం మణివన్నన్ దర్శకత్వంలో రాగా, దీన్ని దర్శకులు మోహన్ గాంధి, వెంకటేశ్, సుహాసినిలతో తెలుగులో రీమేక్ చేశారు. ఆ సినిమా పేరు?
- ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి గార్లతో ‘పల్లెటూరి బావ’ చిత్రాన్ని తమిళ చిత్రం ‘పట్టిక్కాడ పట్టనామా’ ఆధారంగా రీమేక్ చేశారు. తమిళ చిత్రంలో నాయికా నాయకులు ఎవరు?
- 1982లో వచ్చిన మలయాళ చిత్రం ‘పోస్టుమార్టం’ ఆధారంగా తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శ్రీదేవి లతో వి.బి. రాజేంద్ర ప్రసాద్ తన జగపతి బ్యానర్ పై తీసిన చిత్రం ఏది?
- చంద్రమోహన్, సులక్షణ నటించిన కె.విశ్వనాథ్ గారి చిత్రం ‘శుభోదయం’ ఏ పేరున హిందీలో రాకేష్ రోషన్, జయప్రదలతో తీశారు?
- విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, భానుప్రియ నటించిన ఏ చిత్రం – తమిళ చిత్రం ‘అమ్మన్ కోవిల్ కలకలె’కు కాపీ. ఇందులో విజయ్‍కాంత్, రాధ నటించారు.
- నాగార్జున, కార్తీ, తమన్నాలు నటించిన ‘ఊపిరి’ సినిమాకి ఏ ఫ్రెంచ్ చిత్రం ఆధారం?
- ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన ‘మర్యాద రామన్న’ (2010)కి ఏ ఇంగ్లీషు చిత్రం అధారం?
- 1966లో కన్నడంలో ‘ఎమ్మె తమ్మణ్ణ’ చిత్రంలో రాజ్‍కుమార్ హీరో. ఈ చిత్రాన్ని అక్కినేని నాగేశ్వరరావు, రాజశ్రీ, భారతిలతో దర్శకుడు సి.ఎస్. రావు రీమేక్ చేశారు. తెలుగు చిత్రం పేరేమిటి?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఫిబ్రవరి 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 22 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఫిబ్రవరి 12 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 20 జవాబులు:
1.కాంచన 2. శివాజీ గణేశన్ 3. ప్రేమ లేఖలు 4. మా ఇంటికి రండి 5. నిర్దోషి 6. టి. ప్రకాశరావు 7. సలీల్ చౌదరి 8. ఎం.ఎస్. విశ్వనాథన్ 9. ఎల్. వి. ప్రసాద్ 10. సి. రామచంద్ర
సినిమా క్విజ్ 20 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- మణి నాగేంద్రరావు బి
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శ్రేయ ఎస్. క్షీరసాగర్
- శంభర వెంకట రామ జోగారావు
- సునీతా ప్రకాష్
- వనమాల రామలింగాచారి
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- భరత్. టి
- నాగరాజు. బి
- హేమలత. డి
- సౌఖ్యశ్రీ. బి
- రేవతి. టి
- శ్రీమయి డి
- మల్లేష్ డి
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]