[dropcap]చి[/dropcap]న్నారి చిట్టి తండ్రి
నాన్న గారాల కన్నా
నీ ముద్దు మురిపాలతో
నాకు ఇంద్రధనుస్సు నే చూపావు రా కన్నా
నీ కన్నులలో సూర్య చంద్రుళ్ళనే
నే చూసాను రా నాన్న
నీ రతనాల పలుకులతో
నన్ను ఓలలాడించావురా నా చిన్నా
నీ పలుకులే అమృతపు చినుకులై
నీ ఒడిలో నన్ను లాలిస్తుంటే
మెరుపే మెరిసినా
బూచాడంటూ నన్ను వాటేసుకుంటే
నా ఒడిలో తల దూర్చి గారాలు పొతూ
నాన్నా నన్ను వదలి వెళ్లొద్దంటూ
నడి రేయి నిద్రలోను నన్నే కలవరిస్తుంటే
నాన్నగా నేను
మరుగుజ్జంతటివాడిని
మహాస్వరూపాన్నే చూపలేనా..