7.
మోక్షం కావాలంటారు
అందరూ
మోక్షమంటే
నిర్యాణమే కాదా!
8.
అన్ని భవ బంధాల
విముక్తి కావాలి
నిర్యాణం కోసం
నిరీక్షించటమే.
9.
పేద, భాగ్యం
ఇతర జీవరాశులలో లేదు
మరి మానవులలో
ఎందుకు?
10.
ఆస్తి, సంపాదన
ఇతర జీవరాశులలో లేదు
మానవులలో
ఎందుకు?
11.
పరీక్షలు ఎప్పుడు
సులభం
చదివినవి
వచ్చినప్పుడు
12.
దేవతలు, దెయ్యాల
ఉనికి
మానవుని మానసిక
ఊహ మాత్రమే కాదా!