[dropcap]అ[/dropcap]ద్భుతాలకు అనుకూలమేది
నిత్యం ఒకే పాట, ఒకే రాగం బతుకులో
ఆనందాలకు అవకాశమేది
ముళ్ళ గాయాలే రేగే మళ్లీ మళ్లీ మనసులో
నిరాశా, నిస్సృహల్లోనే దొర్లిపోయే రోజులు
ఉన్నట్టుండి బరువెక్కిపోయే జీవితం
నీకంటూ ఎవరూ లేని
నీదంటూ ఏదీ లేని నిస్సార జీవితంలో
నిశీధి ప్రయాణికుడవై
సాగిపోతూ ఒంటరిగా నువ్వు
బతుకొక బదులు దొరకని ప్రశ్నే
ఏ క్షణమైనా అది దొరకొచ్చు
నలుదిక్కులు మారిపోనీ
నమ్మకాలు వీగిపోనీ
నీ శ్వాస ఆడినంతవరకు
నీ ధ్యాస మారనివ్వకు
నీ మాట పలికినంత కాలం
నీ ఆట ఆగనివ్వకు
మరుజన్మ ఏదైతేనేం
ఈ జన్మ గెలవనప్పుడు!