సంగీత సురధార-13

0
3

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 12

రాగాలు – సమస్త రోగ నివారణ – ప్రభావాలు:

రాగాలు – ప్రభావాలు:

[dropcap]ఏ[/dropcap] సంగీతం అయినా మనిషి భావయుక్తంగా ఆలపించినప్పుడు – మన శరీరంలోని రుగ్మతలు హరించుకుపోతాయి అనడంలో సందేహం లేదు. పూర్వీకులు, ప్రాచీనులు తరతరాలుగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ వారు పెట్టిన భిక్షయే ఈనాటి సంగీతానికి నాంది అని చెప్పవచ్చు.

మార్పులు సహజం. ఒకే రీతిలో కాకపోయినా విభిన్న రూపాంతరాలు చెందినా, వస్తువు ఒకటే అన్నట్లు మానవులందరూ వివిధ దైవములను కొలిచినా, అనేక మతస్థులు, అనేకానేక రూపాలలో కొలిచినా, ‘దైవం’ ఒక్కడే అందరికి అన్నట్లుగా – భిన్నత్వంలో ఏకత్వం – మన సంగీతం అని చెప్పవచ్చు.

కర్నాటక రాగాలు, హిందుస్థానీ రాగాలు, ప్రకృతితో ముడిపడి ఉన్న రాగాలు, మనిషి భావాంతరంగాలలో పెల్లుబికి వచ్చే అనంతానంత రాగాలు అపురూపమైనవి. అనన్య సామాన్యమైనవి.

కొన్ని రాగాల ప్రభావాలు:

థెరపీ రాగాలు గమనిద్దాం.

కాపిరాగం:

22 mela – ఖరహర ప్రియ లో జన్యం. భాషాంగ రాగం. చ॥రి. సాధారణ గాంధారం: అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, కైశికి మరియు  కాకలి నిషాదము – 3 భాషాంగ స్వరాలు ఈ రాగానికి అందము. శృంగార రసాన్ని సూచిస్తుంది. మంద్రస్థాయి సంచారం బాగుండదు. కర్ణాటక కాపి – హిందుస్థానీ కాపిగా చెప్పారు (దానిలో కాపి – కర్ణాటక కాపి – ఉపాంగ కాపి అని). ఇది evokes a humid, cool soothing.  deep mood ని తెలియజేస్తుంది.

Pooriya ధనశ్రీ – హంసా నంది – కామవర్ధిని:

హంసా నంది (53 Mela – గమనశ్రమ లో జన్యం. హిందూస్థానీలో సోహిని). కామవర్ధిని (51 mela). All these 3 raagas evokes sweet deep heavy cloudy stable state of mind. Acidity ని నివారిస్తాయి.

మిశ్రమాండ్:

Pleasing, refreshing light and sweet touch.

భాగేశ్వరి:

Darkness, stability, depts, calmness. డయాబెటిక్, హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది. 22 mela janya కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధ రాగం. శాంత, భక్తిరస రాగం.

దర్బారి కానడ (లేదా) దర్బారీ:

Tension relieve చేస్తుంది. తాన్‌సేన్ late night compose చేసి అక్బర్‌ tension ని relieve చేశారని అంటారు.

భూపాళి, తోడి:

High Blood Pressure ని relieve చేస్తుంది.

ఆహిర్ – భైరవ (చక్రవాకం):

Blood Pressure ని తగ్గిస్తుంది. To sustain chords.

మాల్‌కోస్, ఆసావేరి (నఠభైరవి):

Low blood pressure నివారిస్తుంది.

తిలక్ – కామోద (నళినకాంతి), హంసధ్వని, కళావతి, దుర్గ (శుద్ధ సావేరి):

Very pleasing effect on nerves.

Behag, Bahar (కానడ), కాపి, ఖమాస్:

sleeping disorders ని set చేస్తుంది.

భైరవి:

టిబి, కాన్సర్, దగ్గు, జలుబు, సైనస్, పంటి నొప్పి – నివారణ రాగం.

మల్‌హర్:

ఆస్మా, ఎండ దెబ్బని నివారిస్తుంది.

తోడి, పూర్వి, జయజయవంతి:

తలనొప్పి, జలుబు నివారిస్తుంది.

హిందోళ, మారవ:

blood purification

శివరంజని:

Useful for memory problems (జ్ఞాపక సమస్యలు)

ఖరహరప్రియ:

గుండెజబ్బులు, nervous irritability worry, distress, అన్నింటిని నివారిస్తుంది.

హిందోళ, వసంత:

వాత రోగాలు బిపి, గ్యాస్ట్రిక్ సమస్యలు నివారిస్తుంది. blood ని purify చేస్తుంది.

సారంగ:

పిత్త రోగ నివారిణి

నఠభైరవి:

మానసిక సమస్యలు, తలనొప్పి నివారిస్తుంది.

పున్నాగ వరాళి:

కోపాన్ని, హింసని తగ్గిస్తుంది.

ద్విజావంతి:

పక్షవాతాన్ని తగ్గిస్తుంది.

గానమూర్తి:

షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది

కాపి:

depression, anxiety, absent mindedness తగ్గిస్తుంది.

రంజని:

kidney disorders తగ్గిస్తుంది.

రతిపతిప్రియ:

5 స్వరాల రాగం. పేదరికాన్ని తొలగించవచ్చు. vibrations, bitter feelings, illness తగ్గిస్తుంది.

షణ్ముఖప్రియ:

ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంది.

సింధుభైరవి:

Love, happiness, peace, tranquility, gentleness – create చేస్తుంది.

హమీర్ కళ్యాణి:

బిపిని తగ్గిస్తుంది(120/80). tension relieve చేస్తుంది.

మోహన:

మైగ్రెయిన్, తలనొప్పి తగ్గిస్తుంది.

చారుకేశి, కళ్యాణి:

Known as all time raga. – శంకరాభరణం. సాయంత్రం చంద్రకౌన్స్. hearth ailments తగ్గిస్తుంది.

ఆనందభైరవి:

కడుపు నొప్పిని తగ్గిస్తుంది. స్త్రీ పురుషులలో కిడ్నీ సమస్యలు, బిపి తగ్గిస్తుంది.

అమృతవర్షిణి:

Alleviates diseases related to heat.

రీతిగౌళ:

bestows direction when one seeks it.

మధ్యమావతి:

పక్షవాతం, కళ్ళు తిరగడం, కాళ్ళల్లో నొప్పులు, చేతులలో నరాలు సమస్యలు తీరుస్తుంది. మనిషి శరీరంలో నాడులు – అస్థిర కదలికలే వ్యాధులకు మూలము.

ఇలా చెప్పుకుంటూ వ్రాసుకుంటూ ఉంటే అనేక రకాల రాగాలు ఎన్నో ఉన్నాయి. రాగాలు అనంతాలు. వ్యాధి నివారణకి రాగాలు అనంతాలు.

ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క ప్రత్యేకత, ప్రత్యేక వ్యాధులు నివారించవచ్చు. విభిన్న రాగాలు, మనిషిలోని భావోద్వేగానికి గురిచేసినప్పుడు తనలో మథనపడి పైకి చెప్పలేని అనేకానేక విషయాలు సమస్యలు ఒక్క చక్కని రాగయుక్త సంగీతానికి మాత్రమే సాధ్యం అనడంలో అతిశయోక్తి లేదేమో.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here