[dropcap]న[/dropcap]డుస్తున్న ఆకాశంలో
కనిపించని అడుగులు
మారిన కాలంలో
ఓ దృశ్యం
కనుల ముందర నిలిచింది
శ్రమ రూపమై అందంగా
ఎప్పుడైనా ఎక్కడైనా
శ్రమకు గుర్తింపు చిహ్నం
దేహం కురిసిన వర్షమేగా
స్వేదం చేసే సంతకం అద్వితీయం
మనిషి తపనంతా
చేసే ప్రయాణంలో స్వేచ్ఛ కోసమే
మానవత్వపు చెట్టును
బతికించే దారిలో మలుపులు ఎన్నో
ఏవి మారినా
స్వేదం, రుధిరం రెండూ మారవెప్పుడూ
మన పద చిత్రమే మనకు ఊపిరి
అదే బతుకు అసలైన అస్తిత్వం