[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ‘అనుకున్నదొకటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్‍బుల్ పిట్ట’ పాటను ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో ‘మంచి మనసుకు మంచి రోజులు’ అనే సినిమాలో (ఎన్.టి.ఆర్., రాజసులోచన తారాగణం) పాడారు. దీనికి మూలమైన తమిళ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
- హాస్యనటుడు సునీల్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘అందాల రాముడు’. దీనికి మాతృక అయిన తమిళ సినిమా ఏది?
- బెంగాలీ చిత్రం ‘సాత్ పాకే బాంధా’ ఆధారంగా తెలుగులో ఎన్.టి.ఆర్., భానుమతి నటించిన చిత్రం ఏది?
- బెంగాలీ చిత్రం ‘బంగా గోరా’ ఆధారంగా హిందీలో వచ్చిన ‘భాబి’ అనే చిత్రం ఏ పేరుతో తెలుగులో రీమేక్ అయ్యింది? (అంజలీదేవి, గుమ్మడి తారాగణం)
- బెంగాలీ చిత్రం ‘జీబన్ సైకతే’ (1972) తెలుగులో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో – కృష్ణంరాజు, జయసుధ, జయప్రద నటించగా ఏ పేరుతో రీమేక్ అయింది?
- బెంగాలీ చిత్రం ‘ప్రతీకార్’ (1987) ఆధారంగా తెలుగులో వెంకటేష్, అమల నటించగా, బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఏది?
- అమెరికన్ చిత్రం ‘కం టు అమెరికా’ (1988) తో ప్రేరణ పొంది రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి, అమల నటించిన తెలుగు చిత్రం ఏది?
- ఇంగ్లీషు సినిమా ‘టు ఛేస్ ఏ క్రూక్‍డ్ షాడో’ ఆధారంగా హిందీలో రిషీకపూర్, నసీరుద్దీన్ షా నటించిన ‘ఖోజ్’ చిత్రం – తెలుగులో నరేష్, రంజని, మోహన్‍లు నటించగా ఏ పేరుతో వచ్చింది?
- అక్కినేని నాగేశ్వరరావు ఆడవేషం వేసిన ఈ సినిమాలో ఎన్.టి.రామారావు, భానుమతి, జమున నటించారు. చిత్రం పేరు?
- పినిశెట్టి శ్రీరామమూర్తి నవల ఆధారంగా – టి. ప్రకాశరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన చిత్రం ఏది (ఎన్.టి.ఆర్.ది నెగటివ్ రోల్)?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 మార్చి 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 27 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 మార్చి 19 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 25 జవాబులు:
1.కల కానిది విలువైనది 2. కారకుడి అరుణాచలం 3. కోన ప్రభాకర రావు 4. సాలూరి రాజేశ్వర రావు 5. మనుషులంతా ఒక్కటే 6. పుట్టినిల్లు మెట్టినిల్లు 7. తూర్పు పడమర 8. బంట్రోతు భార్య 9. కావాలి తోడు కావాలి 10. మధురావాణి పాత్రధారి సావిత్రి
సినిమా క్విజ్ 25 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- జానకి సుభద్ర పెయ్యేటి
- మత్స్యరాజ విజయ
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సునీతా ప్రకాష్
- శ్రేయ ఎస్. క్షీరసాగర్
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]