[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]
శిఖరం
[dropcap]అ[/dropcap]తడి నవ్వు చేసిన శబ్దానికి కోయిలలు సిగ్గు పడ్డాయి. తమ స్వరం కన్నా ఆ పిల్లడి హాసం మిన్నగా ఉన్నదని. ఆ పర్వత శిఖరానికి పట్టరాని ఉత్తేజం కలిగింది. వెంటనే చరియలో ఉన్న రాయి ఎగిరి పడింది ఆ క్రింద ఉన్న సరస్సులో.
ఉత్తేజంతో నిండిన ఆ రాతి పాటుకు సరస్సులో నీరు ఉప్పొంగి పోయింది.
తరంగాల రూపంలో తన హర్షం వ్యక్తం చేసింది. తొలకరి వర్షపు సవ్వడిలా గాలి అతని కర్ణపుటాలను తాకింది. ఎర్రటి అతని జుత్తు చూసి ఆశ్చర్యంతో అటు వైపు పాకింది. గాలివాటుకు అతని శిరోజాలు రెపరెపలాడుతుండగా అతని మోము మన దృష్టికి వస్తుంది.
ఒక rugged charm. సూటిగా మన హృదయాలను పరీక్షగా చూసే లేజర్ కిరణాల లాంటి దృక్కులు. ఇది నేను సాధించాను. లేదా సాధించగలను అని సూచనగా విల్లులా ఒంపు తిరిగిన కనుబొమ్మలు. అతడిని చూసిన వారికి నచ్చడు. కారణం అతని presence మన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది. అతని నవ్వు సామాన్య ప్రజల చేతకానితనాన్ని అపహాస్యం చేస్తున్నట్లు భ్రమ కలిగిస్తుంది. అతని చేతి కదలికలు మన procrastination ను అడ్డు తొలగమని హెచ్చరిస్తున్నట్లు అగుపిస్తాయి. నడకలో వేగం తనకు ప్రపంచంలో వేరేదీ పట్టని నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది.
కానీ, అతని నవ్వు స్వచ్ఛత చూసి పాలసంద్రపు తరంగాలు చిన్నవోతాయి. సూటైన దృక్కులకు రామ బాణమే సమాధానం. అతని కనుబొమ్మల ఒంపును సవాలు చేయగలిగేది ఎక్కు పెట్టిన అర్జునుడి గాండీవమే. నికార్సయిన మనుషులు మాత్రమే అతని అస్తిత్వాన్ని తట్టుకోగలరు. Pretenders cannot stand his presence. అతని చేతుల కదలికల సొగసును మించేది వెదురు మురళి పై కదలాడే కన్నయ్య చేతి వ్రేళ్ళ హొయలు మాత్రమే. ఆ నడకలో purposefulness కు పోటీ హనుమ సాగరం మీద చేసిన లంఘనమే.
ఎవరతను?
శ్రీరాముడు కాక చరిత్రలో సృష్టించబడ్డ మరొక పరిపూర్ణ మానవుడు. ఆధునిక యుగానికి తగిన నాయకుడు. మనిషన్నవాడు ఎలా ఉండాలో చెప్పేందుకు ఏకైక ఉదాహరణ.
అతడే హోవర్డ్ రోవర్క్.
ఆ నవ్వు చూస్తే హృదయాలు పులకించి పోతాయి. ఆ చిలిపితనం సవ్వడి విన్న వారికి బుగ్గలు పుణకాలని అనిపిస్తుంది. ఒక మహోన్నతమైన కళాకారుని ధర్మపత్నికి అతన్ని ప్రేమగా హృదయానికి హత్తుకుని తల్లిలా లాలించాలని ఆశ పుడుతుంది. కన్నవారికి అతనొక వరం. స్నేహితులకు అతనొక కమ్మని తాయిలం. గురువులకు గర్వాన్నిచ్చే ఒక precious possession. వెరసి ఒక కల లాంటి బాల్యాన్ని దాటుతున్న పిల్లడు.
గంగాధరం.
అతనికి అవగతం కాని స్వరం లేదు. సలాము చేయని రాగం కనపడదు. అతని గాన మాధుర్యాన్ని ఆస్వాదించని హృదయం ఉండదు.
NO!
There’s one soul which hated the presence of Gangadharam. There’s one man who wanted to erase the presence of the kid from the existence. There’s a human being who envied the dream like life of the young kid who conquered the highest of the heights in music without even knowing it.
The Fountainhead లో ఒకానొక సన్నివేశం వస్తుంది. అది రాక తప్పని సందర్భం. రాస్తున్న రచయిత్రి ఎంతగానో ఎదురు చూసిన సందర్భం.
హోవర్డ్ రోవర్క్, ఎల్స్వర్త్ మాంక్టన్ టూయీ ఎదురుపడతారు.
The Fountainhead ఒక సినిమా అయితే అది perfect interval bang.
కష్టం సుఖం, గెలుపూ ఓటమీ, కలిమీ లేమీ అన్న తేడా లేకుండా.. దేన్నీ లక్ష్యపెట్టకుండా రోవర్క్ తన పని తాను చేసుకు పోతున్నాడు. Hopton Stoddard పెట్టిన కేసు వల్ల కోల్పోయిన భౌతిక సంపద కనీసం అతని మనసు అంచును కూడా తాకలేకపోయింది.
తనను తాను శిక్షించుకునేందుకు అతని ప్రియురాలు డామినిక్ ఫ్రాంకన్ పీటర్ కీటింగ్‌ను (most despicable of all creatures) పెళ్ళిచేసుకోవటం కూడా అతని స్థైర్యాన్ని దెబ్బతీయలేదు. దూరంగా గోడ మీద వాలిన పురుగు, అలికిడికి బెదిరి ఎగిరిపోతే మనం ఎంత లక్ష్య పెడతామో రోవర్క్‌కు కూడా అంతే చీకాకు కలిగించింది.
NULL. EFFECT.
తాను సృష్టించిన స్టోడార్డ్ దేవళాన్ని కోర్టు అనుమతితో ఇతర ఆర్కిటెక్టులు ఎలా ఛిద్రం చేసి, వారి వారి చేతకానితనాన్ని ప్రదర్శనకు పెట్టారో చోద్యం చూద్దామని వెళతాడు రోవర్క్. దూరంగా నిలబడి నిర్వికారంగా చూస్తుంటాడు.
ఎప్పటికైనా రోవర్క్ రాకపోతాడా, నాకు ఎదురవకపోతాడా అన్న ఆశతో టూయీ అక్కడే రోజూ తచ్చాడుతున్నాడు.
తన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తను అల్లిన ఉచ్చులో పడి సర్వం కోల్పోయి, ప్రజల చేత ఛీ! అనిపించుకుంటున్న రోవర్క్ మొహంలో బాధను, విషాదాన్ని చూడాలని అతని తపన.
He was the second person on the earth who intensely hated Howard Roark and wanted him badly to fail at each and every step of life.
The first one was Peter Keating.
Dominique thought that her apparent hatred towards Howard Roark could shield him from the likes of the Peter Keatings and the Ellsworth Tooheys of the world. But she was wrong in her thinking. The man who everyone thinks would despise Roark’s presence on earth hadn’t met him yet. That was and is for another day.
అందుకే కొన్ని రోజులుగా అక్కడే తచ్చాడుతున్నాడు టూయీ. ఎదురు చూస్తున్నాడు.
సృష్టిలోకెల్లా తుచ్ఛమైన జీవి టూయీ. ఇంతకు మించిన దరిద్రం జిమ్ టేగార్ట్ వల్ల కూడా కాదు అంటుంది ఐన్ అమ్మమ్మ తను రాసిన కొన్ని లేఖలలో.
టూయీ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది.
(కలుద్దాం)