[dropcap]వి[/dropcap]శ్రాంతిగా ఈ సాయంత్రాన్ని చూస్తున్నాను.
నెమ్మదైన మనసుతో పక్షుల్ని వింటూ
పిట్టగోడపై నీటి పాత్రలను తడుముతూ
కుండీకెక్కించే క్రొత్త మొక్కల్ని ఆలోచిస్తూ
సరిగ్గా పుయ్యని మొక్కల్ని సుతారంగా మందలిస్తూ
ఆఁ..
ఇష్టమయ్యే చలికాలపు వణుకు, కాస్త తగ్గుతోందిప్పుడు.
చిరుచలిలో కూడా ఏదో గమ్మత్తు దాగిఉంది.
వెళ్ళిపోతోంది శీతాకాలం;
మడతపెట్టిన రజాయి నుండీ..
మూలకుపడిన కోల్డ్ క్రీం డబ్బాలనుండీ.
వేసవి దాహంకై
ఇక త్వరగా
ఒక కొత్తకుండను తెచ్చుకోవాలి.