కొరియానం – A Journey Through Korean Cinema-56

2
2

Pauper కానీ फरवा இல்லை

Chapter 49

[dropcap]ఆ[/dropcap]స్కార్లొచ్చేసినై.

మీరు ఇది చదవబోయే సమయానికి ఏ ఏ సినిమాలకు ఏ ఏ ఆస్కార్లు ఇవ్వాలో నిర్ణయమైపోయి ఉంటుంది. అవతార్ 2 కు కచ్చితంగా ఉత్తమ చిత్రం రాదు కనుక నేను ముందుగానే డిజపాయింట్ అయిపోతున్నా.

లేదా మీరు కాస్తాలస్యంగా చదివేట్టయితే ఆ ఎకాడమీ అవార్డులు పంచివేయబడి కూడా ఉండవచ్చు (not that punch).

మరి మన కొరియన్ సినిమాకు నాలుగు ఆస్కార్లు తెచ్చిపెట్టిన పారాసైట్ గురించి ఆదామూ అవ్వా మాట్లాడుకోరా?

కోరు.

ఎందుకంటే ఇప్పటికే ఆ సినిమా గురించి గిగా బైట్ల కొద్దీ రాసేశారు. పైగా నిజానికది ఆస్కారింపబడేంత గొప్ప సినిమా కాదు. అలా అని తీసి పడేయాల్సిన సినిమా కూడా కాదు. కానీ, కొన్ని ఆస్కార్ parameters ను satisfy చేసింది కనుక దానికా గౌరవం దక్కింది. ఆ సమయమలా కలిసొచ్చిందంతే.

It was to be the culmination of Korean Wave. Korean cinema should have moved to the next level after this.

కానీ, కరోనా పేండమిక్ కాటేసింది ఆ ఊపును. తరువాత ఏమయ్యిందో చూశాము కూడా. చివరికి రాంగ్జాంగ్ లేదా The Medium ఎలా జనాలను థియేటర్లకు రప్పించిందో కూడా చెప్పుకున్నాం. ఈ సంవత్సరం అంటే 2022 లో విడుదలైన సినిమాలకు సంబంధించి మన పార్క్ తీసిన డెసిషన్ టు లీవ్ ఉత్తమ చిత్రంగా నామినేషన్ అయినా పొందాల్సింది. ఇతర కారణాల వల్ల ఆ అవకాశం పొందలేదు.

అవతార్ 2 నిజానికి సినిమా అనే ప్రక్రియను (as James Cameron himself defined: Cinema is the art and science of visual storytelling) కనీసం ఒక రెండు దశాబ్దాలు ముందుకు తీసుకుని వెళ్ళింది.

ఒక technological/scientific and artistic achievement which wasn’t seen before. కానీ, జనాలకు అందులో అవార్డుల కళ కనబడలేదు. అలాగే కామరాన్ తరహాలో టెక్నాలాజికల్ మార్వెల్ కాకపోయినా, కథా కథనాల పరంగా, మేకింగ్ పరంగా, వేరేరకంగా చూసినా పార్క్ తీసిన డెసిషన్ టు లీవ్ అత్యున్నతమైన చిత్రం.

కొరియా దేశంలో అతి ఎక్కువ మంది చూసిన కొరియన్ సినిమాలు మొదటి ఐదూ వరుసగా..

  1. The Admiral Roaring Currents
  2. Extreme Job
  3. Along with the Gods
  4. Ode To My Father
  5. The Roundup

Extreme job is a wickedly hilarious crime comedy thriller.

నార్కోటిక్స్ డిపార్టుమెంట్‌లో పని చేసే కొందరు డిటెక్టివ్‌లు డ్రగ్స్ అమ్మకాలను నిరోధించటంలో విఫలమవుతారు. దాంతో కొన్నాళ్ళు వాళ్ళను పక్కన పెడతారు. చివరికి ఒక ఆఖరి అవకాశంగా అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా డ్రగ్స్‌ను సప్లై చేసే ముఠాలను పట్టుకోమని చాన్స్ ఇస్తారు. వారి ఆపరేషన్‌కు బేస్‌గా ఒక హోటల్‌ను ఎంచుకుంటారు. అక్కడి నుంచే సమాచార సేకరణ చేస్తూ పనిలో కాస్త ప్రోగ్రస్ చూపుతారు.

ఇంతలో ఆ హోటల్ వ్యాపార పరంగా బాగా నష్టాలలో ఉండటంతో దాన్ని అమ్మేయాలని అనుకుంటారు యాజమాన్యం. తమ పనికి బాగా ఉపయోగ పడుతోంది అన్న కారణంగా దాన్ని కాస్తా కొనేస్తారు. అక్కడ ఒక రెస్టరెంట్ తెరుస్తారు. దాన్ని సహజంగా ఉండేలా చూసేందుకు అక్కడ వ్యాపార కార్యక్రమాలు మామూలుగానే చేస్తుంటారు.

ఒక సందర్భంలో రెస్టరెంట్ నడవాలంటే ఫుడ్ వియయంలో ఒక ట్రంప్ కార్డు ఉండాల్సిందే అనుకుని కొత్తరకం వెరైటీని తయారు చేస్తారు. అది కాస్తా బాగా హిట్ అయ్యి రెస్టరెంట్ బిజినెస్ బాగా పెరుగుతుంది. అలా ఎంతలా పెరుగుతుంది అంటే అసలు ఉద్యోగాలు మానేసి హాయిగా ఈ రెస్టరెంటే నడుపుకుంటే సరిపోతుంది అని అనుకునేంతగా.

కానీ వీరు పోలీస్ డిపార్టుమెంటు కనుక, వీరికున్న పవర్స్ వల్ల రెస్టరెంట్‌కు రక్షణ వచ్చింది కానీ, మాఫియాల తాకిడి ఎక్కువే ఉండేది మామూలు రెస్టరెంట్ అయితే. దాంతో వారికి ఆ డ్రగ్ బస్టింగ్ పనీ, ఈ రెస్టరెంట్ నడపాల్సిన పనీ కలిసిపోయి ఒళ్ళు పులిసిపోతుంది.

ఈ డిటెక్టివ్‌ల పెద్ద, గో పాత్ర వేసిన Ryu Seung-ryong నటన వర్ణనాతీతం. పోలీసాఫీసర్లలో పెద్ద పాపర్‌గా ముద్ర పడతాడు. కానీ, కమిట్మెంట్ విషయంలో ప్రశ్నించాల్సిన పని లేదు. పాపం ఆ విషయంలో ప్రాణం పోయినా రాజీ పడడు.

Ryu Seung-ryong is currently one of the top crowd-pulling actors of the current generation. He has the distinction of acting in 4 movies that have been watched by more than 10 million unique audience. థియేటర్ నుంచీ వచ్చిన ఇతను చోయ్ మిన్-సిక్‌కు సరైన వారసుడిగా పరిగణించబడుతున్నాడు. వివిధ జాన్రాలలో ఇతను హిట్ సినిమాల్లో నటించాడు.

  1. Miracle in the Cell No. 7 (feel good drama) – Mentally challenged father of a little girl
  2. War of the Arrows (historical action thriller) – Ruthless military general
  3. All About My Wife (Romantic Dramedy) – Casanova
  4. The Quiz Show Scandal (satirical crime comedy) – a hen-pecked criminal minded person
  5. The Piper (Horror-thriller) – as Pied Piper from the Germanic legend

Extreme Job కొరియన్ సినిమా చరిత్రలో అత్యధిక మొత్తం సంపాదించిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది. టికెట్ అమ్మకాల పరంగా The Admiral తరువాత రెండవ స్థానంలో.

ఒక వెబ్ టూన్ ఆధారంగా వచ్చిన Along with the Gods ఫేంటసీ సినిమా. బాహుబలి, కేజీఎఫ్ తరహాలో ఒకే కథను రెండు ముక్కలుగా చేసి విడుదల చేశారు. 2017, 2018 సంవత్సరాలలో. సినిమాగా పెద్ద గొప్పదేం కాదు.

Ode To My Father మటుకూ కొరియన్లకు అత్యంత ఇష్టమైన సినిమాలలో ఒకటిగా నిలిచింది. Taegukgi తరువాత అలా కుటుంబ అనుబంధాల విషైకంగా వచ్చిన ఈ సినిమా కాస్త Forrest Gump తరహా అనిపించినా కూడా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా నిర్మించారు. దీన్నే హిందీలో సల్మాన్ ఖాన్ భారత్ అనే పేరుతో రీమేక్ చేశాడు.

ఒరిజినల్ కొరియన్ సినిమా టికెట్ల అమ్మకాలలో నాలుగో స్థానంలో నిలిచింది. తరువాత తరువాత ఊహ తెలిసిన ప్రతి కొరియన్ కనీసం ఒక్కసారైనా చూసిన సినిమాగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా పొంది క్లాసిక్‌గా గుర్తింపు పొందింది.

Family oriented సినిమాలను ఎక్కువ ఇష్టపడే సల్మాన్ ఖాన్‌కు ఈ సినిమా చాలా నచ్చింది. ప్రత్యేక షోలు వేయించుకుని మరీ చూశాడు. తన నటజీవితంలో గొప్ప పాత్రలలో ఒకటిగా నిలిచే భారత్‌ను చాలా గొప్పగా పోషించాడు.

తన నిజ జీవితపు చెల్లెలు అంటే అమితమైన ప్రేమ ఉన్న భాయ్, ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ సీన్లను బాగా రక్తి కట్టించాడు. అనుకున్న స్థాయిలో ఆడకపోయినా మంచి లాభాలను సంపాదించిందీ సినిమా. మొదటి వారంలోనే పెట్టిందంతా రాబట్టినా, తరువాత క్రమంగా సినిమా ఆడలేదు. కారణం సినిమా బాగోక పోవటం కాదు.

రివ్యూలను, ఆన్లైన్ మేధావుల ట్రోలింగ్ టాక్‌ను తట్టుకుని బాగానే ఆడుతున్నా, తక్కువ టైమ్‌లో కబీర్ సింగ్ విడుదల కావటం ఈ సినిమాను బాగా దెబ్బ తీసింది. థియేటర్లు కోల్పోవటం తద్వారా కలక్షన్లు తగ్గటం జరిగింది. అయినా కూడా 200 కోట్ల క్లబ్‌లో అత్యధిక సినిమాలు ఉన్న సల్మాన్‌కు ఈ సినిమా మరోసారి ఆ క్లబ్‌లో స్థానం దొరికేలా చేసింది.

అటు Ode To My Father అయినా, ఇటు Bharat అయినా రెండూ చూడదగ్గ సినిమాలే. దేశ విభజన సమయంలో తప్పిపోయిన తండ్రి, సోదరి ల కోసం అన్వేషణ సాగించే వ్యక్తి కథ (Partition of India and Partition of Korea). తండ్రికిచ్చిన మాట నిలుపుకోవటం కోసం తపన పడే హీరోలుగా – Hwang Jung-min, Salman Khan – నటించిన ఇద్దరు నటుల వారి నిజజీవితాల అనుభవాలను యాదిలో పెట్టుకుని మరీ పాత్రలకు వన్నె తెచ్చారు.

ఇక్కడ టాప్ 5 లో నిలిచిన సినిమాలలో ఒక్క Along with the Gods తప్పిస్తే, మిగిలిన నాలుగు సినిమాలు అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల మన్ననలు అందుకుని గొప్ప చిత్రాలని పేరు పొందాయి.

Coming back to Extreme Job, the climax of this madcap comedy thriller film has an extremely violent climactic action sequence.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు, ఏ జాన్రా సినిమా అయినా కాస్తో కూస్తో రక్త తర్పణం చేయందే కొరియన్లకు నిద్రపట్టదనుకుంటా.

ఈ రకంగా చూస్తే In Our Prime చాలా sedate సినిమా.

రామ్ గోపాల్ వర్మ వీధి కుక్కలను వదిలేసినట్లున్నాడు. జనానికి ఇతర విషయాలు దొరికాయి సోషల్ మీడియాలో రాసుకునేందుకు. వైజాగ్ సమిట్ పాతబడింది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వస్తుంది కదా. ఇక దాని మీద పడి ఏడుద్దాం.

కమల్ హాసన్ స్వరంలో: ఇక మొదలెడదామా?

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here