తందనాలు-3

0
3

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

21
పాశం వేసి లాగుతాడు యముడు ఆయుష్షు తీరగానే
లేశం అంత గూడా ఆలోచించడు
నశ్యం పట్టు పట్టి ప్రారంభిస్తాడు
వశం అయ్యేదాకా వదిలితేనా

22
కళయందు ఆరితేరిన వారి ప్రదర్శన సాగుతుంది
తళ తళా మెరిసి పోయింది వేదిక
భళ భళా మని చప్పట్లు మ్రోగె
భళ్ళున తెల్ల వారె

23
బాణం సంధించి వేట మొదలు పెట్టె
రణమైన జింక విల విలా కొట్టుకొనె
కణ కణంలో కాంతి పోయే
ఋణం తీరిపోయిన జింక ప్రాణాలు వదిలె

24
నఖ శిఖ పర్యంతం వర్ణించె ప్రియురాలిని
ముఖం చాటేసి పోయె
లేఖాస్త్రములు సంధించె ప్రియురాల మీద
దాఖలాలు లేక విసిగి పోయె ప్రియుడు

25
లేక లేక సంతాన ప్రాప్తితో ఆనంద హేల
చక చకా విందు ఏర్పాట్లు
మూకుమ్మడిగా అతిథులు రాక
పక పకామని నవ్వులు, హాలు దద్దరిల్లె

26
బాహ్య ప్రపంచాన్ని మేల్కొలిపె భానుడు
కుహు కుహుమని పక్షుల రొదలు
తహ తహలాడుతూ జనం సిద్ధం పనులకు
రహదారులన్నీ క్రిక్కిరిసె

27
సాయం సంధ్య సూర్యుడు నిష్క్రమించె
బయలుదేరినై పక్షులు తమ తమ గూళ్లకు
ఛాయా చిత్రాల సమయము
పయనించె జనం సినిమాలకు, ఇళ్లకు

28
శయనించే ఓ అందాల ప్రియురాలా
భయమేల నీకు నేను నీ దగ్గరుండగా
పాయసం త్రాగి పడుకో
హాయిగా నిద్రలోకి జారుకుకో, కలలు కను

29
గజ్జ కట్టి నాట్య మయూరి వేదికపై
సజ్జ మీదున్న దీప కాంతులలో
లజ్జ లేకుండా నాట్యంతో అలరించె
బొజ్జలేసుకుని ప్రేక్షకులు ఆనందించె

30
అక్షర కుక్షి
బిక్షమెత్తుకొని జీవన యానం సాగిస్తున్నాడు
లక్ష్యముతో విద్యాభాసము గావించె
లక్షల్లో సంపాదించి జీవితములో హాయిగానుండె

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here