[dropcap]చె[/dropcap]న్నై తెలుగు వెలుగు సంక్షేమ సంఘం వారు ఉగాది సందర్భంగా 12 మార్చి 2023న ఏడుగురు బాల సాహితీవేత్తలకు తెలుగువెలుగు పురస్కారాలు అందించారు.
పురస్కారాలు అందుకున్నవారిలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు (తిరుపతి), డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ (నెల్లూరు), బెహరా ఉమామహేశ్వర రావు (పార్వతీపురం), సంగనభట్ల చిన్న రామకిష్టయ్య (ధర్మపురి), దార్ల బుజ్జిబాబు (చిలకలూరిపేట), యు.విజయశేఖర్ రెడ్డి (ప్రొద్దుటూరు), చెన్నూరి సుదర్శన్ (హుజురాబాద్)లు ఉన్నారు.
సంఘ అధ్యక్షుడు అల్లిగం రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు, సాహితీ ప్రియులు గుడిమెట్ల చెన్నయ్య, పసుమర్తి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.