[dropcap]పం[/dropcap]డు!!!!
మానవిని నేను మానవుడివి నీవు
నీ కళ్ళ పైన ఒక ముద్ర
చూపుడు వేలుని నా పెదవులపై ముంచి
నీ పెదవులకద్దిన ఒక తేనె చుక్కలా..
శోదిస్తూ నీ విశాల బాహూవుల బిగువు
నన్ను నేను నిలుపుకోనీ స్వామి
ఆశలతో ఆకాశం నుండి భువి వరకు
పండు!!!!
మధురం ఒక స్వప్నం
అతి మధురం నీవు నేను
అందరూ అంటున్నారు అనాగరికం
నీ నా కలయిక అని
భువనాన వసంతం నీకోసమే..
నేను చేరవలసినదే నీ హృదయాన్ని!!
పండు!!!!
కోలాహాలంగా కోలాటం ఆడదామంటే
కయ్యానికి పిలుస్తావేం?
నా జబ్బ పట్టుకొనీ మరి
నా కళ్ళలోకి చూస్తూ
సయ్యాటకు పిలుస్తావేం!!!
రాగసుధామృతంతో
రాగాలాపనకి నా తోడై
నర్తించమని నే నిన్ను పిలిస్తే.. నీవేమో రాగాలహరిని కాదని
ప్రేమాలహరిని ఆలపిస్తానంటే
ఆత్మతో హృదయం ఎలా సంగమించేది?