[బాలబాలికలకు కాకతీయుల చరిత్ర, రామప్ప దేవాలయం గురించి కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.]
రామప్ప దేవాలయం
[dropcap]ప[/dropcap]దవ తరగతి స్టూడెంట్స్ టీచర్స్‌తో కలిసి వరంగల్, హన్మకొండ, రామప్ప విజ్ఞాన యాత్రకు వెళ్లివచ్చారు. తప్పక చూడాల్సిన ప్రదేశాలను చూసి, ఫ్రెండ్స్‌తో సెల్ఫీలు, ఫోటోలు దిగి ఎడతెగని కబుర్లు చెప్పుకుని అలసిపోయారు. వెళ్ళింది కాకతీయ చరిత్ర, కట్టడాలు, విశేషాలు తెలుసుకోవాలని, కానీ ‘చరిత్ర అడక్కు చెప్పింది చెయ్యి!’ అనే సినిమా డైలాగులా చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు.
లాస్ట ఇయర్ అఫ్ స్కూల్, పోనిలే! పాపం! ఎంజాయ్ చెయ్యనీ అనుకుని టీచర్స్ వారిని ఇబ్బంది పెట్టలేదు.
ఇంటికి వచ్చిన రవిని అమ్మ ట్రిప్ ఎలా జరిగిందని అడిగింది.
“అమ్మా! మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇట్స్ గుడ్.”
“నైస్. కాకతీయుల గురించి ముఖ్యంగా రామప్ప గురించి ఏమి తెలుసుకున్నారు?”
“అబ్బా! అలసిపోయాను. నన్ను వదిలెయ్యి. తరువాత చెబుతా. ప్లీజ్!”
“ఓకే. ఫ్రెష్ అయి రా! డిన్నర్ చేద్దువుగాని.”
“వద్దు. ఆకలిగా లేదు. నిద్ర వస్తోంది. పడుకుంటా” అని బెడ్ రూమ్ లోకి వెళ్తూ “అమ్మా! అమ్మా!” అని పిలిచాడు రవి.
“రవి ఏమిటి? వేడి పాలు తాగుతావా?”
“వద్దు. నన్ను పొద్దున్నే నిద్ర లేపకు. రేపు హాలిడే ఇచ్చారు.”
“సరే. పడుకో!”
రవికి వెంటనే నిద్రపట్టేసింది. కానీ పడుకునే ముందు ‘అమ్మ అడిగిన ప్రశ్న కాకతీయులు, రామప్ప గుడి గురించి ఏమి తెలీదు నాకు. రేపు అమ్మ అడిగితే ఎలా? రామప్ప గుడి మీద ఉన్న మదనికలు బొమ్మలు భలే ఉన్నాయి. వాటి గురించి సోషల్ టీచర్‌ని అడిగాను. రవి వెళ్లి నీ ఫ్రెండ్స్‌తో తిరిగి చూడు టెంపుల్ అంటూ ఇంగ్లీష్ టీచర్‌తో మాటల్లో పడిపోయింది. ఇప్పుడెలా? ఎవర్ని అడగాలి? చరిత్ర తెలుసుకుంటానని అమ్మకి ప్రామిస్ చేసి స్కూల్ ట్రిప్‌కి వెళ్ళాను. ఎలా?’ అని ఆలోచిస్తూ నిద్రపోయాడు.
***
చల్లని గాలి తగిలిన రవి వణుకుతూ నిద్రలోనే దుప్పటి వెతుక్కుని ఫుల్‍గా కప్పుకుని పడుకున్నాడు. ఆ గాలిలో గమ్మతైనా సువాసన హాయిగా అనిపించింది. ఇంతలో కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు. వెలుగులోనుండి తన వైపు చిరునవ్వుతో నడచి వస్తున్న రామప్ప గుడిలోని మదనిక కనిపించింది.
‘రామప్ప మదనిక! Surprise! కలా? నిజమా?’ అని గిల్లి చూసుకున్నాడు రవి. ఆహ్! నిజం లానే ఉంది.
అది చూసి నవ్విన మదనిక “రవి! కష్టపడింది చాల్లే. పద!” అంది.
“ఎక్కడికి?”
“రామప్పకి.”
“రామప్ప! At this middle of night? No way!” అని తిరిగి దుప్పటి లోకి వెళ్ళాడు.
“Way gee! నాకు తెలీదు. పద పద” అంటూ రవి చెయ్యి పట్టుకుని గాల్లోకి లేచింది మదనిక. భయంతో కళ్ళు మూసుకున్న రవి కళ్ళు తెరిచేటప్పటికి రామప్ప గుడి ప్రకారం బైట ఉన్నారు. రవి ఆశ్చర్యంతో నిలబడి పోయాడు.
“పద రవి! లోపలి వెల్దాము.”
“నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావు?”
“ఎందుకంటే మీ అమ్మ రామప్ప గుడి,చరిత్ర అడిగింది కదా? నీకు చెప్పటానికి” అంది మదనిక.
“మీ హైదరాబాద్ నుండి 157 km వరంగల్ నుండి 77 km దూరంలో ఉన్న రామప్ప దేవాలయానికి వచ్చావు కదా.”
“అవును.”
“ఇప్పుడు పౌర్ణమి వెన్నెల్లో రామప్ప అందాలు చూడు.”
“Full moon night బ్రైట్ మూన్ లైట్‍లో రామప్ప టెంపుల్, surroundings looking beautiful” అన్నాడు రవి.
గుడి ప్రహరీ గోడకి ఉన్న ద్వారం అదే wall కి ఉన్న door లోంచి లోపలి వెళ్ళాడు.
అతని వెంట ఉన్న మాదనిక “రవి, పూర్వం ఇక్కడ ఈ ద్వారం ముందు ఒక పిల్ల కాలువ రామప్ప చెరువు నుండి పారుతుండేది. మా మదనికలు అందరం వెన్నెల వెలుగులో ఆ నీటిలో కాళ్ళు పెట్టి నీటిలో తేలియాడే చేపలను ఆడించేవాళ్లము. లెక్కకు మించిన ఊసులు/కబుర్లు చెప్పుకునే వారము” అంది.
“వాటర్‍లో ఆడటం చాలా ఫన్” అన్నాడు రవి.
వెన్నెల వెలుతురు లో చెట్ల పైకి క్రిందకు తిరుగుతున్న ఉడతలు, పచ్చ గడ్డి తింటున్న కుందేళ్ళను చూసి పరుగెత్తాడు. అవి అబ్రక దబ్రా అని మాయం అయ్యాయి.
“రవి! రా!” అని పిలిచిన మాదనిక దగ్గరకు వచ్చాడు.
“రవి! కాకతీయుల పాలన సమయంలో కట్టిన అద్భుతమైన దేవాలయాల్లో 800 సంవత్సరాల పురాతమైనది ఈ రామప్ప గుడి.”
“800 సంవత్సరాలా?” అన్నాడు రవి.
“అవును. కాలపు /టైం ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది.”
“అంటే?”
“నీకు అర్థం అయ్యేలా చెప్పాలంటే ఆఁ, centuries changing time లో ఈ గుడి తుఫాన్లు, వరదలు, భూకంపాలు, యుద్ధాలు, కరువులు, తరిగి పోయిన అడవులు, పెరిగిన వేడి, వాతావరణ మార్పులు అనేక ఘటనలకి సాక్షిగా నిలిచింది” అంది విచారంగా.
“చరిత్రకు చిహ్నంగా ఉన్న రామప్పను కాపాడాల్సిన బాధ్యత మీదే. మీ లాంటి సందర్శకులను చూస్తే మాకు ఎంత ఆనందమో చెప్పలేను” అంది చిన్న పిల్లలా.
“రవి, లోపలి వెళ్దాము పద. ఇటు చూడు అటు చూడు. ఎటు చూసిన అందమైన శిల్పాలు.”
“అవును. Black stone లో beautiful గా ఉన్నాయి” అన్నాడు రవి
“ప్రతి స్తంభం, శిల్పం నీకు తెలియని ఎన్నో పురాణ కధలు చెబుతాయి. జాగ్రత్తగా చూస్తే, వింటే.”
“మదనికా, అసలు నువ్వు చెబుతున్న కాకతీయులు ఎవరు?” అని అడిగాడు రవి
“పశ్చిమ చాళుక్యుల దగ్గర కాకతీయులు పాలెగాళ్ళుగా పనిచేసారు.”
“పాలెగాళ్ళు అంటే? “
“అంటే రాజు యుద్ధంలో తనకు విజయానికి కారకుడైన, లేదా సమర్థుడైన ఒక యోధుడిని తాను గెలిచినా ప్రాంతాన్ని తన తరఫున పాలించమని నియమించేవారు. వాళ్ళు రాజుకి అవసరమైనప్పుడు సైన్యాన్ని; సామాన్య రోజుల్లో పంటలు, ప్రజల నుండి పన్నులు వసూలు చేసి ఇచ్చేవారు” అని వివరించింది.
“కాకతీయ రాజులు ఎవరు?”
“రెండవ బేత రాజును మొదటి పాలకుడంటారు. రెండవ ప్రోలరాజు కాలంలో చాళుక్య రాజ్యం ముక్కలు అయింది. అదను చూసి కాకతీయులు స్వతంత్రులుగా ప్రకటించుకుని పరిపాలించారు. వారి పాలనాకాలం దక్కనులో స్వర్ణయుగమని అంటారట. గణపతి దేవుడు రాజు అయ్యేసరికి కాకతీయులు బలమైన రాజ్యంగా ఉన్నారు. వరంగల్ నుండి ఆంధ్ర ప్రాంతం లోని తీరప్రాంతాలకు అధీనం లోకి వచ్చిందని విన్నాను. రాజ్య నిర్మాణంతో పాటుగా కాకతీయులు సాహిత్యం, నృత్యం, సంగీతం, శిల్ప కళలు, కట్టడాలను ప్రోత్సహించారు. అందుకు నిదర్శనం నువ్వు చూస్తున్న రామప్ప గుడి, రామప్ప చెరువు” అంది మదనిక.
“రామప్ప దేవాలయాన్ని నక్షత్రం ఆకారంలో కట్టారు. రాజులు శైవాన్ని ఆచరించారు. అందుకే శివ ఆలయాలు కనిపిస్తాయి. రుద్రేశ్వర స్వామిగా పిలుస్తారు. గణపతి దేవుని సైన్యాధిపతి రేచర్ల రుద్ర రామప్ప గుడిని కట్టాడు” అంది.
“రేచర్ల రుద్ర అని ఇందాక కూడా అన్నావు. అతని గురించి ఇంకా చెప్పు” అని అడిగాడు రవి.
“చెబుతాను. కొద్దిగా ఓపికపట్టు”
“సరే. వింటున్నా, చెప్పు నీ కథ”
“అదిగో అక్కడ చూడు. శివుని పిలుపు కోసం ఎదురుచూస్తున్న నంది విగ్రహం. దానిపై చెక్కిన అద్భుతమైన నగిషీలు. మేడలో గంటలు, కాలి మువ్వలు, ఇతర designs.”
నంది దగ్గరకు వెళ్లి చుట్టూ తిరిగి చూసివచ్చిన రవి “అవును! ఎంత బాగా చెక్కారో!” అన్నాడు.
“ఇటురా! ఇటు ఇటు! ఇక్కడ చూడు! ఇక్కడ! ఈ నల్లరాతి స్తంభం మీద చెక్కిన నృత్య ప్రతిమలు చూడు” అని పిలిచింది మదనిక.
దగ్గరగా వచ్చి పరిశీలనగా చూసిన రవి “అవును మదనికా, ఈ బొమ్మలు నిజమైనవిగా భ్రమలా ఉన్నాయి. బ్యూటిఫుల్.” అన్నాడు.
“యువకా! అటు చూడు. ఇటు చూడు. ఎటు చూసిన అందమైన శిల్పాలతో, నల్లరాతి నిగనిగలతో కనిపించే నా శిల్పాచార్యుని, మిత్రుని గొప్పతనం చూడు. గుడి కప్పు పైన ఉన్న శివ కళ్యాణం, మనుషులు, జంతువులూ పక్షులు, పద్మాలు” అంది.
పైకి తలెత్తి అన్నింటిని చూసిన రవి “అమేజింగ్ బ్యూటిఫుల్!” అని, “అబ్బా! మెడ నొప్పి” అన్నాడు.
మదానిక పక పక నవ్వింది. “ఈ మాత్రంకే?” అని, మళ్లీ చెప్పసాగింది.
“రామప్ప ఎవరు కట్టారు? అనే ప్రశ్నకి సమాధానం గుడి లోని ఒక శాసనంలో ఉంది. 1213లో రేచర్ల రుద్ర నిర్మించాడు అని. రేచర్ల ఫ్యామిలీకి కాకతీయులకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. రేచర్ల రాజ్య పాలకులు అంటే కాకతీయ పాలకులకు సామంతులు. వారిలో ఫేమస్ రేచర్ల రుద్రా సేనాని. ఇతని తల్లిదండ్రులు కటాచామూపతి, బెజ్జమాంబ. సోదరుడు మచ్చ సేనాని. తండ్రి, అన్న తరువాత రుద్ర సేనాని ఎలకుర్తి రాజ్యాన్ని పాలించాడు. గొప్ప సేనాని. కళాపోషకుడు. కాకతీయ రాజులు రుద్ర దేవుడు, మహ దేవుడు యాదవరాజు చేతిలో యుద్ధంలో చనిపోయారు. గణపతి దేవుని బందీగా చేసారు. అలాంటి అశాంతి సమయంలో రేచర్ల రుద్ర సేనాని కాకతీయ రాజ్యాన్ని కాపాడాలని అనుకున్నాడు. యాదవులు, చాళుక్యులతో యుద్ధం చేసి కాకతీయ రాజ్యాన్ని బలంగా చేసి గణపతి దేవుని విడిపించాడు. అంతేకాదు కాకతీయ రాజ్యాన్ని గణపతి దేవుడికి ఇచ్చాడు.”
“వావ్! రేచర్ల రుద్ర freed గణపతి దేవా! Gave back his kingdom. Very good man!” అన్నాడు రవి.
“సరే విను. గణపతి దేవుడు అతనికి కాకతి రాజ్య స్థాపనాచార్య అని బిరుదు ఇచ్చాడు. రేచర్ల రుద్ర కాకతీయ చాళుక్య శిల్ప రీతిలో ఈ గుడిని కట్టించాడు.”
“కాకతీయ శిలా శైలి ఏమిటీ? You mean style?” అన్నాడు రవి.
“కాకతీయ సంప్రదాయంలో మూడు గుడులని ఒక చోట కట్టేవారు. వాటిని త్రికూటం అనేవారు. కానీ రామప్ప ఆలయం ఏక కూటం. రామప్ప నక్షత్ర ఆకారంలో కట్టారు.”
“You mean star shaped? Really?” అన్నాడు రవి
“అవును. గర్భగుడి మీద విమాన లేక పిరమిడ్ లాంటి కట్టడంతో ఉంటుంది. సభ మండపం ముందు వైపున ఉన్న ఈ అద్భుతమైన జంతువుల బొమ్మలు, ప్రవేశ ద్వారం వద్ద అందమైన నృత్య భంగిమల్లో ఉన్న యువతులను మదనికలంటారు.”
“నువ్వు మదనికవేగా?” అన్నాడు రవి.
“అవును. రవి అటు చూడు పౌర్ణమి వెలుగులో మా మహిళలు పేర్చిన దీపతోరణాలు. మీ విద్యుత్ దీపాల కన్నా మా దీపాలు ఎంత బాగున్నాయో! ఇటు చూడు దేవుని ముందు సంగీతం పాడుతున్న యువకుడు. రవి ఇక్కడ చూడు, నృత్యం చేస్తున్న నా సహచరులు మదనికలు.”
“బాగుంది.”
“రవి మీ కన్నా ముందే మేము ఎత్తు మడమల చెప్పులు వేసుకున్నాము. చూడిక్కడ” అని చూపించింది.
“ఇంకో మదనిక కొంగు లాగుతున్న కోతి. ఇక్కడ మీరు కొనే టెంపుల్ జ్యువలరీ లాంటి నగలు మాత్రమే వేసుకున్న యువతిని చూడు. ఇక్కడ ఉన్న మదనిక చక్కని కేశ శైలి అదే మీ భాషలో హెయిర్ స్టైల్” అంది నవ్వుతూ.
“ఈమెని చూడు చక్కని గ్రామీణ వేషధారణలో ఉంది. ట్రైబల్ వుమన్. ఈమె నాగ కన్య. పాములను ఎంత అలవోకగా ఈజీగా పెట్టుకుందో చూడు.” అంది.
“అవును మదనికా, నాకో డౌట్? ఈ గుడిని కట్టటానికి ఎంత టైం పట్టింది?” అన్నాడు రవి
ఒక్క నిముషం ఆలోచించిన మదనిక “ఆ! నా నేస్తం శిల్పి చెప్పిన లెక్క ప్రకారం 40 ఏళ్ళు పట్టిందిట” అంది. “ఆలయ నిర్మాణంలో వాడిన నల్ల రాయి దక్కన్ పీఠ భూమిలో దొరికే బ్లాక్ బసాల్ట్ స్టోన్‌ని వరంగల్ ప్రాంతపు గనుల్లో నుండి తెచ్చారట. రవి! నీకో అద్భుతం తెలుసా?” అడిగింది.
“అద్భుతమా. ఏమిటది?”
“ఈ దేవాలయానికి వాడిన ఇటుకలు నీటిలో తేలుతాయిట” అంది మదనిక.
“ఇదో! ఈ ఇటుక ముక్కని నీటిలో వేసి చూడు. నమ్ముతావు” అని ఒక చిన్న ముక్క ఇచ్చింది.
దగ్గర్లో ఉన్న నీటిలో ఆ ముక్కని వేసాడు రవి. ఆశ్చర్యం, అది నీటిలో మునగ లేదు.
“హే! మా అమ్మమ్మ చెప్పింది చిన్నప్పుడు, ఇక్కడకు వచ్చి పిల్లలు అందరు బ్రిక్స్ వాటర్‍లో వేసి అవి ఫ్లోట్ అయితే మళ్ళీ మళ్ళీ వేసేవారు. Wow. నేను వేసాను. నౌ ఐ బిలీవ్ అమ్మమ్మ స్టోరీ” అని ఆనందంగా చప్పట్లు కొట్టాడు.
“రవి దేవాలయం గోడలపై నువ్వు చూసావా? 526 ఏనుగులు బొమ్మలు చెక్కారు.”
“అవును. అన్ని ఏనుగులు ఎందుకు చెక్కారు?”
“ఎందుకంటే అప్పట్లో మాకు మీలా machines లేవు. బరువులు లాగటం లాంటి బరువు పనులు ఏనుగులతో చేయించేవారు. అందుకని ధన్యవాదాలు చెప్పి వాటి శ్రమని మీకు చెప్పటానికి, మనకి సాయం చేసిన వారిని మర్చిపోరాదు.” అంది.
“అమ్మ కూడా అదే చెప్పింది.” అన్నాడు రవి.
“అక్కడ చూడు. కాకతీయుల రాజా చిహ్నం ఉంది. గజకేసరి. ఏనుగు సింహం. గుడి లోపలి స్తంభాల మీద ఉన్న చిన్న మదానికల నృత్య భంగిమల ఆధారంగా 1983 లో ప్రముఖ నృత్య కళాకారుడు నటరాజ రామకృష్ణ కాకతీయ పేరిణి నృత్యాన్ని మళ్లీ బతికించారు. ఆ నృత్యంలో శివ తాండవం అద్భుతంగా ఉంటుంది” అంది మదనిక.
“1321-1325 సంవత్సరాల్లో చిన్న చిన్న యుద్ధ విజయాలు వచ్చిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని మరణం తరువాత రాజ్యం బలహీనపడి ముస్లింల అదుపులోకి వెళ్ళింది. యుద్ధాల వాళ్ళ వాళ్ళు కట్టిన అనేక కట్టడాలు నేలకూలాయి. కొన్ని శిధిలాలు మాత్రమే.. అంటే రూయిన్స్ మిగిలాయి” అంది బాధగా.
“మీలాంటి సందర్శకులు/టూరిస్ట్ ఏదైనా చారిత్రక ప్రదేశానికి/historical places కి వచ్చేముందు చరిత్రలో దాని గొప్పతనం/ its place in history విశేషాలు తెలుసుకుని వస్తే బాగుంటుంది. లేదా అక్కడే దొరికే లోకల్ టూరిస్ట్ గైడ్‌ని డబ్బుకి ఆలోచించక పెట్టుకుంటే ఎన్నో విషయాలు, ప్రాంతీయ కథలు తెలుస్తాయి. అప్పుడే మీ విజిట్ కి ఒక మీనింగ్, అర్థం.. మాకు ఈ శిధిలాల వెనుక ఉన్న విజయ గాథలు చెప్పాలని, మమ్మల్ని ముందు తరాల కోసం కాపాడమని అడగాలని ఉంటుంది. మీరు మాత్రం ఏదో వచ్చాము, అటు ఇటు తిరిగి చూసాం, తిన్నాము, ఇంటికి వెళ్ళాము అన్నట్టుగా ఉంటారు, అంతే” అంది మదనిక కోపంగా.
“సారీ మదనికా. నువ్వు చెప్పింది నిజమే. అందుకే అమ్మ రామప్ప చరిత్ర అడిగితే తప్పించుకున్నాను” అన్నాడు రవి
“అరెరే! పొద్దు పొడుస్తోంది. నువ్వు ఇంటికి వెళ్ళాలి. పద పద” అని తొందరపెట్టిన మదనిక రవిని ఇంట్లో వదిలి వెళ్ళబోయింది.
వెళ్తున్న మదనికతో రవి “నాకు కాకతీయుల గురించి పూర్తిగా చెప్పవా? ప్లీజ్” అన్నాడు.
“తప్పక. రేపటి రోజు కలుద్దాము” అని మాయం అయిపోయింది.
***
“ఓకే బై బై!” అని చెబుతున్న రవిని అమ్మ, “రవీ! రవీ! ఎవరికీ బై చెబుతున్నావు? లే” అంటూ లేపింది.
రవి ఉలిక్కిపడి లేచాడు.