తందనాలు-4

0
3

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

31
అంధత్వములో పాపము పసివాడు
భాంధవ్యములో సహాయ నిరాకరణ
ఆ ధనం లేకనే వైద్య సదుపాయం లేదు
అంధత్వంతోనే శేష జీవితము

32
కవి సమ్మేళన సభ ప్రారంభమయ్యె
కవులందరూ ఉత్సహముతో పాల్గొనిరి
కవయిత్రులకు ప్రవేశము లేని కారణం?
చేవ లేదనే భావనా?

33
వంశోద్ధారకులంటే పుత్రులే?
సంశయం లేదు పుత్రుడే పున్నామ నరకం నుండి రక్షించేవాడు
లేశమంతైనా సందేహం లేదు
దేశోద్ధారకులూ ఔతారు

34
కానమే మంచి లక్షణాలు దుర్గుణినందు
చానా మంచి లక్షణాలే సద్గుణినందు
అన్యులందు రెండు లక్షణాలు
కాన మంచి చెడులు నిర్ణయించ లేము

35
కానలోని జంతువులన్నీ క్రూర జంతువులు కావు
కొన్నిటికి ఇతర జంతువులే ఆహారం
వనాలలోవి సాధువులే
కనుక జంతువులు మిశ్రమం

36
మట్టి కుండలో నీళ్లు అతి చల్లన
చట్టి పిడతతో కూరలు చాలా ఆరోగ్యం
గట్టి ఆరోగ్యం పై రెండింటితో
వొట్టి మాటలెందుకు రెండూ వాడితే సరి

37
మండపంలో మంత్రి గారు విచ్చేసియున్నారు
కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు
దండలు వేసి సత్కరించిరి నిజాయితీకి
కొండంత ఆశతో జనం

38
రసకందాయంగా సభ సాగుచున్నది
నస పెట్టకుండా వివరించలేక పోయాడు వక్త
గుస గుసలు మొదలైనవి ప్రేక్షకులలో
పస లేదని

39
కసి కసిగా కావ్యం వ్రాశాడు
వ్రాసి వ్రాసి అవలోకనం చేసుకున్నాడు
పసి కట్టగలరు గదా పస లేదని
రసికులు మెచ్చునాయనే చింతలో

40
తగినన్ని సమిధలు వేసి భోగి మంటలు
రాగి సమిధలు కూడా జోడించి
భోగి మంటల్లో చలి కాచుకున్న జనం
కాగి కాగి ఆనందించిరి జనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here