కొరియానం – A Journey Through Korean Cinema-59

1
3

కొరియన్ సావిత్రి

Chapter 53, Part 1

[dropcap]కొ[/dropcap]రియానం గురించి మామూలుగా డిస్కషన్లు జరుగుతుంటాయి స్నేహితులతో. అప్పుడప్పుడూ వేరే వాళ్ళ మెసేజులూ వస్తుంటాయి. బాగుందనీ, బాగలేదనీ, నీకు తెలుగు రాదనీ (నా ప్రొఫైల్లో చూడు సామీ/అక్కా. నేనూ అదే చెప్తున్నా. ఎవరూ నమ్మటం లేదు), ఇంగ్లీషెక్కువ అవుతోందనీ.. అలా. వాటిలో కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి. Law of averages catch up అయింది. That’s for another day.

విషయం ఏంటంటే ఈమధ్య ఒక మెసేజ్ వచ్చింది. అదేలెండి. అలా అప్పుడప్పుడూ రచయితలు రాస్తుంటారు కదా. నాకు ఫోన్లొచ్చాయి (ఏ మోడల్ అన్నా/అక్కా?), మెసేజులొచ్చాయి (వాట్సపా? ఐమెసేజా), ఉత్తరాలొచ్చాయి ఇలా. అందుకే అలా రాయటం సాంప్రదాయం కాబోలు అని రాస్తున్నా. వచ్చిందో లేదో మీరు నమ్మినా నమ్మకపోయినా doesn’t matter. ఇంతకీ విషయమేమిటంటే..

కొరియానం పాత ఎపిసోడ్లలో superstar Krishna ప్రధాన పాత్రలో ఈ చాంగ్-డాంగ్ సినిమా పోయెట్రీ తెలుగు రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అని రాశాను. తీస్తే బాగుండేది. ఒక superstar కు పరిశ్రమ ఇచ్చిన ట్రిబ్యూట్ గా మిగిలిపోయేది అని అభిలషించాను.

టైమ్ ఆగదు కదా.. రీసెంటుగా In Our Prime గురించి గుర్తు చేస్తూ ఈ సినిమాను తెలుగులో ఎవరితో తీయవచ్చు అని ఆ మెసేజ్ సారాంశం. నేనొక స్మైలీ పెట్టి ఊరుకున్నా. Communication విషయంలో నేను (కొనా కాదు. భవదీయుడు గీతాచార్య లేదా ఉస్తాద్ గీతాచార్య – Pawan fans be damned) వీక్.

ఈసారి ఫోన్ వచ్చింది. సోషల్ మీడియాల్లో తెలిసిన వ్యక్తే కనుక సమాధానం చెప్పాను. తెలుగులో అయితే చోయ్ పాత్ర చిరంజీవికి నప్పుతుంది. అంత intensity తీసుకురాలేక పోవచ్చు కానీ, పాత్రకు సూట్ అవుతాడు. తమిళ్‌లో కమల్ హాసన్. కాకపోతే తనదైన శైలిలో సినిమాను కాస్త దారిమళ్ళిస్తాడు.

నిజానికి ఈ విషయాన్ని గురించి నేను రాద్దామని అనుకున్నాను. కానీ, వేరే ఐడియాలు exciting గా అనిపించటంతో అటు మళ్ళాను. పైగా 60% of కొరియానం is from my old notes.

చిరంజీవి అంటే వచ్చే కష్టాలు కూడా ఉంటాయి. బర్డెన్ల రూపంలో. చోయ్ మిన్-సిక్ చేసిన ఈ హాక్-స్యుంగ్ పాత్రకు భార్య, కొడుకు పూర్వాశ్రమంలో ఉన్నట్లు చూపారు. ఆ భార్య పాత్రను హీరోయిన్‌గా చేసి, నార్త్ కొరియా ఎపిసోడ్ (మన తెలుగులో ఎక్కడి నుంచీ వచ్చినట్లు చూపాలి?) లో ఒక ఐటమ్ సాంగ్ పడాలి. చోయ్ చేసిన శాంత గంభీర పాత్ర కాస్తా కొరియా కేశవ రెడ్డిగా మార్చేస్తారు. రివ్యూలు బాగా వస్తాయి (M. Raja లాంటి వాళ్ళు తగిలితే. లేకపోతే ఆచార్య సీక్వెల్‌గా మిగిలిపోతుంది). సినిమా మటుకూ ఓ ముప్పైయ్యో నలభయ్యో కోట్లు నష్టాలు చూపిస్తుంది బాక్సాఫీసు దగ్గర. చూశారా నేను మంచి సినిమా తీస్తే ఆడలేదు కాబట్టి మరోసారి సిగరెట్ తాగటం, మందు కొట్టటం హైలైట్ చేస్తూ ఇంకో క్రింజ్ సినిమా వదులుతా అంటాడు చిరు.

ఇప్పుడర్థమయ్యిందా? ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావించనిది. పాపం అవతల వ్యక్తి చేతిలో ఫోన్ కింద పడ్డ శబ్దం వచ్చింది.

అదుగో ఎవరో రాళ్ళు పట్టుకు వస్తున్నారు నా మీదకు. టాపిక్కముమ్ ఇక్కడికి వదిలేద్దాం.

Chapter 54

నాతో పాటూ చెప్పండి.

అదే మన మాతృభాషలో చెప్పాలంటే Repeat After Me.

హే జాంగమ్

హే జాంగమ్

హే జాంగమ్

ఆఁ! మూడు సార్లూ చెప్పారా?

గుర్తొచ్చిందా? 2007 ఆ టైమ్ లో హిందీలో घर का चिराग़ అనే సీరియల్ వచ్చేది. రాత్రి పూట.

అందులో హీరోయిన్ ఉంది కదా..! అప్పట్లో ఒక వర్గం వారికి మాంఛి అభిమాన నటి.

పేరు ఈ యూంగ్-ఏ. Lee Young-ae. హిస్టారికల్ డ్రామా అయిన అ సీరియల్ ఆసియా వ్యాప్తంగా బాగా సక్సెస్ అయింది. ఎంత పెద్ద సక్సెస్ అంటే ఆ సీరియల్‌ను కొరియాలో 70% జనాలు ప్రతి లైవ్ ఎపిసోడ్ చూశారు. తైవాన్‌లో ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు.

హునాన్ టీవీ వాళ్ళు ఎపిసోడ్ ప్రసారమొక్కింటికి $10,000 పెట్టి కొనుక్కున్నారు. చైనాలో ప్రసారం చేస్తే తక్కువలో తక్కువ 500 మిలియన్లకు తక్కువ కాకుండా చూసేవాళ్ళు.

మన టీవీల్లో దురద.. సారీ దూరదర్శనం కాలంలో రామాయణ్, మహాభారత్ లు ఎగబడి చూసినట్లు చూశారు. అసలు ఈ సీరియల్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేందుకు వీలుగా తర్వాత కాలంలో 3:4 రేషియోలో LG వాళ్ళు మొబైల్ ఫోన్లు రిలీజ్ చేశారు.

కొరియా దేశపు లక్స్ – సినీ తారలు వాడే సోప్ – కు ఈమెను బ్రాండ్ మోడల్ గా పెట్టుకోవాలనుకున్నారు కూడా. కాకపోతే అక్కడ లక్స్ సబ్బు లేదు కాబట్టి ఆ సంఘటన జరుగలేదు. But the serial inspired many girls to take culinary work as an art and did cooking courses just like the protagonist in the film.

మగ పిలకాయలు చేసుకుంటే జాంగమ్ లాంటి అమ్మాయినే చేసుకోవాలి అనుకున్నారు. అంత ప్రభావం చూపించింది ఆ సీరియల్.

కొరియా జూంగాంగ్ డైలీ లో రాసినట్లు Dae Jang-geum (హే జాంగమ్) first aired on MBC from 15 September 2003 to 23 March 2004. It was the top program with an average viewership rating of up to 65%. Produced on a hefty budget for a Korean series – US$15 million – it was later exported to 91 countries and has earned $103.4 million worldwide in profits to the makers. It was later hailed as one of the primary proponents of the Korean Wave by heightening the spread of Korean culture abroad.

దీన్ని శ్రీలంకలో రూపవాహిని టెలివిజన్ సింహళ భాషలో సుజాత దియానీ (ధీర పుత్రిక) అనే పేరుతో broadcast చేస్తే అక్కడ కూడా సూపర్ సక్సెస్. ఈ సీరియల్ వల్ల ఒక సమస్య మాత్రం వచ్చిపడింది.

కొరియన్ వేవ్ ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా పాకిందో, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కొరియా యువత మీద పడింది. Asianic features ఉన్న అమ్మాయిలంతా cosmopolitan faces కోసం ప్లాస్టిక్ సర్జరీలకు దిగారు. దాదాపు 30% కొరియన్ యువతులు తమ కొరియా ప్రత్యేకమైన ఫీచర్లను అసహ్యించుకుని కాస్మపాలిటన్ లుక్ కోసం ప్రయత్నించటంతో అక్కడ westernised beauty culture ప్రబలింది. ఎందరో యువతులు ఈ వ్యవహారంలో తమ శరీరాలను పాడు చేసుకుని ఇంచక్కా అనారోగ్యాల పాలయ్యారు. Super progress కదా. మనదైన ఇదిని వదిలేసి పరాయి అది పట్టుకుని వేలాడటం అన్ని చోట్లా అంతే అనుకుంటా.

దీనికి కారణం హే జంగుమ్ హీరోయిన్ ఈ యూంగ్-ఏ చాలా అందంగా ఉండటం. ఆమె సహజ సౌందర్య రాశి.

 ఆ పాత్ర లాగా బాగా వంట చేయాలనికోవటం ఒకటి! అందుకోసం అలాంటి అందం ఉంటేనే వండగలరా? అట్లుంటది వేలంవెర్రితోని.

హీరో స్వాగ్ అంటే సిగరెట్ కాల్చే స్టైల్, మందు కొట్టే విధానం, లేదా రకరకాల ఆయుధాలతో జనాల తలకాయలను తెగగొట్టటం కదా మన యువతకు. By the way, SSMB28 first look చూశారా? అభిమానులు బాగా satisfied ట. హీరోగారు సిగరెట్ తాగటం వల్ల.

ఈ యూంగ్-ఏ మొట్టమొదట తెర మీద కనిపించింది 1993లో. అది కూడా అందరు కొరియన్ superstars మాదిరిగానే తొలుత చిన్న తెర మీద. 1995 వరకు ఆమె అనేక టీవీ డ్రామాలలో నటించడం ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.

ఆమె 1990ల మధ్య కాలంలో కొరియన్ బుల్లితెరను ఏలింది. బిజినెస్‌మాన్ లో మహేశ్ బాబు ముంబైను ఏలినట్లు. వివిధ టెలివిజన్ అవార్డులను గెలుచుకుంది. 1996లో విడుదలైన Insyalla అనే సినిమాతో పెద్ద తెర మీద తొలిసారి కనిపించింది. ఈ యూంగ్-ఏ బాగా చేసినా సినిమా ఆడకపోవటంతో తిరిగి back home అన్నట్లు టెలివిజన్ కెరియర్‌ను కొనసాగించింది.

కానీ ప్రతిభ ఉన్న వారిని ఆపటం విధికి కూడా సాధ్యం కాదు. అలా ఆమె ఒకరోజు మన పార్క్‌ను కలిసింది. అప్పటికి అతను సినిమా ఆశలను బోషాణంలో దాచి ఫిల్మ క్రిటిక్‌గా చేస్తున్నాడు.

ఆ టైమ్ లో కొరియన్ దేశాల ఐక్యత గురించి బాగా మాట్లాడుతున్నారు జనాలు. ఆ విషయమే వారి మధ్యా వచ్చింది. ఆమె చెప్పిన విషయాలు, ఆ మాట్లాడిన తీరు మన పార్క్‌కు నచ్చాయి.

మూడేళ్ళకు పార్క్ Joint Security Area తీసే అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఆ సినిమా ఉత్తర దక్షిణ కొరియాల మధ్య సంబంధాల గురించే. అందుకే ఈ యూంగ్-ఏ ను ఏరి కోరి మరీ సెలక్ట్ చేశాడు ప్రధాన పాత్రలో. ఆ పాత్రకు అప్పటికి superstar గా వెలుగొందుతున్న Han Suk-kyu ని తీసుకోమని స్టూడియో ఒత్తిడి చేసింది. ఎందుకంటే మహిళను ప్రధాన పాత్రలో చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సరిగ్గా ఆడవని నమ్మకం.

ప్రాజక్ట్ మానుకుని వెళ్తా కానీ, యూంగ్-ఏ కాకుండా వేరే ఎవరిని తెచ్చినా తాను ఒప్పుకోనని చెప్పాడు. He was so audacious and confident about his selection that he went to Han Suk-kyu directly and asked him to help his case. హన్ సుక్-క్యు కథ విని దానికి యూంగ్-ఏ నే తగిన నటి అని అన్నాడు. స్త్రీ దృక్కోణంలో చెప్తేనే సినిమాలో విషయం సరిగ్గా జనాలకు చేరుతుందని తన మాటగా చెప్పాడు. పైగా ఇది దేశాల గురించి కనుక స్త్రీ ప్రధానంగా తీస్తేనే మంచిదని చెప్పాడు.

స్టూడియోకు ఈ విషయమే చెప్పమని పార్క్ అడిగాడు. దానికి ఒక కండిషన్ పెట్టాడు హన్. సాంగ్ కాంగ్-హో ను ఒక ప్రధాన పాత్రకు తీసుకోవాలి. భేషుగ్గా తీసుకుంటాను అని చెప్పి మొత్తానికి తనకు కావలసిన నటినే సినిమాలో పెట్టుకున్నాడు.

ఎందుకు ఈ యూంగ్-ఏ కోసం అంత సాహసం చేశాడు? హన్ లాంటి superstar కూడా ఆమె అయితేనే సినిమాకు నిండుతనం వస్తుందని స్టూడియోకే చెప్పాడు? అది కూడా తన స్టార్డమ్ పీక్ లో ఉండగా?

కొరియన్ సావిత్రి!

నటులలో చోయ్ మిన్-సిక్ ఎంత గొప్పవాడో, ప్రతిభావంతుడో, నటీమణులలో ఈ యూంగ్-ఏ అంత ప్రతిభావంతురాలు.

We can say… She’s Korean Savitri.

జాయింట్ సెక్యూరిటీ ఏరియా షిరీ రికార్డులను బ్రేక్ చేసి ఆ కాలంలో అతి పెద్ద హిట్‌గా కొరియాలో నిలిచింది. విమర్శకులు ఆమెను కొరియా దేశంతో పోల్చారు. ఇందిరా గాంధీ ఆ పాత్రలో ఈ యూంగ్-ఏ పోస్టర్ చూసి దణ్ణం కూడా పెట్టింది.

ఆ సమయంలో ఇది విదేశాలలో కూడా అత్యధికంగా అమ్ముడైన కొరియన్ చిత్రంగా నిలిచింది. దెబ్బకు ఈ యూంగ్-ఏ కొరియాలో తిరుగులేని Lady Superstar అయింది.

అస్సరే కానీ, మీకో సర్ప్రైజు. In Our Prime ని Mammootty, Mathew Thomas లను పెట్టి తీస్తే నా సామి రంగా!

కే విశ్వనాథ్ తీసిన స్వాతి కిరణం తరువాత The Guru Quadrulogy కి epilogue గా బ్రహ్మాండంగా ఉంటుంది.

ఈలోగా ఎండాకాలం వచ్చేసింది కదా, హైదరబాద్ వర్సెస్ బెంగళూరు అని తగూలు పడరాదూ? మామూలు గొడవలతో విసుగొచ్చేసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here