[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]
అధ్యాయం 17 – మూడవ భాగం
రాగ విభాగము:
(A) సారంగదేవుని రాగములు
సారంగదేవుడు తన సంగీత రత్నాకర గ్రంథములో రెండు రాగములను పేర్కొనెను. అవి (1) మార్గ రాగములు (2) దేశ్య రాగములు.
మార్గ రాగములు ఆరు. అవి (1) గ్రామ రాగము (2) ఉప రాగము (3) శుద్ధ రాగము (4) భాష రాగము (5) విభాష రాగము (6) అంతర్భాష రాగము (ఈ రాగములు గంధర్వ లోకమునకు మాత్రమే వర్తించును).
దేశ్య రాగములు నాలుగు. అవి (1) రాగాంగ రాగము (2) ఉపాంగ రాగము (3) భాషాంగ రాగము (4) క్రియాంగ రాగము.
1. రాగాంగ రాగము:
సంపూర్ణము, వక్రము లేనట్టి, ఒకే స్వరములు ఆరోహణ, అవరోహణలో నుండుట. జన్యరాగములకు జనక స్థానము. దీనినే జనకరాగ, మేళ రాగ, కర్త రాగ, ప్రధాన రాగ, రూట్ రాగ, primary అని అందురు.
2. ఉపాంగ రాగము :
రాగాంగ రాగమున జనించి, తన జనకరాగ స్వరూపమును మాత్రమే కల్గియుండుట. ఉదా: హంసధ్వని, మలహరి.
3. భాషాంగ రాగము:
రాగాంగ రాగమున జనించి, తన జనక రాగ స్వరూపమును కల్గి, రంజకము కొరకు అన్య జనక రాగములందు గల శుద్ధ, వికృతి స్వరములలో 1, 2, (లేక) 3 స్వరములు ప్రయోగించుట. ఉదా: బిలహరి, కాంభోజి, భైరవి, బేగడ.
4. క్రియాంగ రాగము
ఇంద్రియములకు ఉత్సాహము కల్గించునది. దేవతా స్తుతి. ఉత్సాహ, శోక, వీర, పరాక్రమ, యుద్ధ సమయములందు ఉపయోగించునట్టి రాగములు.
అంతర మార్గ రాగము:
భాషాంగము వాడుకలో లేని కాలములో అన్య రాగచ్ఛాయలను కలిగి యుండు రాగములు. అవియే కాలక్రమేణా భాషాంగము అయినవి.
(B) పూర్వాచార్యులు రాగములు
పూర్వాచార్యుల రాగములు మూడు విధములు. అవి
1. ఘన రాగము:
గంభీరముగా ఉండు రాగము. ఉదా: నాట, గౌళ, అరభి, శ్రీ వరాళి.
త్యాగరాజు ధాతు, మాతు కవితా విశిష్టతను ఈ రాగములోనే వ్యక్తపరిచెను.
మరియొక ఉప ఘన రాగ పంచకము కూడా కలదు. (1) కేదార (2) నారాయణ గౌళ (3) రీతి గౌళ (4) సారంగ నాట (5) భౌళి – మొత్తం 10 ఘన రాగములుగా చెప్పవచ్చు.
2. రక్తి:
వినువారి చిత్తమును రంజింపచేయుట. దీనినే నయ, మార్గ రాగము అని కూడా చెప్పుదురు. ఉదా: తోడి, భైరవి, శంకరాభరణం, కళ్యాణి మొదలగునవి.
3. దేశ్య రాగము:
ఉత్తర దేశము నుంచి స్వీకరింపబడినట్టియు, కొన్ని యితర రాగ కళలతో స్ఫురించునట్టి రాగములు. వీటినే దేశీయ రాగములు అని కూడా చెప్పుదురు. ఉదా: ఖమాసు, బేహాగ్, కాపి.
(C) పూర్వీకుల లక్షణకారుల రాగములు
పూర్వీకుల లక్షణకారుల రాగములు మూడు. అవి
1. పంచమాత్య రాగము:
ఒక రాగములో హెచ్చుగా నున్నట్టి స్వరము మధ్యస్థాయిలో పంచమముగ ఉండుట.
ఉదా: నవరోజు (29 జన్య)
ప ద ని స రి గ మ ప
ప మ గ రి స న ద ప
2. దైవతాంత రాగము:
హెచ్చుగా యుండు స్వరము మధ్యస్థాయి దైవతముగా యుండును.
ఉదా: కురంజి (29 మే॥)
స ని స రి గ మ ప ద
ద ప మ గ రి స ని స
3. నిషాదాంత్య రాగము:
మధ్యస్థాయి నిషాదముగా యుండుట.
ఉదా: నాద నామ క్రియ (15 మే॥)
స రి గ మ ప ద ని
ని ద ప మ గ రి స ని
జన్య రాగములు:
1. జౌడవ రాగము:
జౌడవ – సంపూర్ణ – శుద్ధ జౌడవ
జౌడవ – షాడవ – సంకీర్ణ జౌడవ
జౌడవ – జౌడవ – వక్ర జౌడవ
2. షాడవ రాగము:
షాడవ – సంపూర్ణ – శుద్ధ షాడవ
షాడవ – షాడవ – సంకీర్ణ షాడవ
షాడవ – జౌడవ – వక్ర షాడవ
3. సంపూర్ణ రాగము:
సంపూర్ణ – సంపూర్ణ – శుద్ధ సంపూర్ణ
సంపూర్ణ – షాడవ – సంకీర్ణ సంపూర్ణ
సంపూర్ణ – జౌడవ – వక్ర సంపూర్ణ
వక్ర రాగ విభాగము:
- వక్ర సంపూర్ణ – ఆరోహణ – ఏక స్వర
- వక్ర షాడవ – అవరోహణ – ఏక వర్జ్య
- వక్ర జౌడవ – ఉభయ వక్ర – ఏక భాషాంగ
- క్రమ సంపూర్ణ
- క్రమ షాడవ
- క్రమ జౌడవ
నారదుని విభాగము:
- సూర్యోదయ – ఉదా: భూపాలము (15)
- సూర్యాస్తమయ – ఉదా నాట (36)
ముక్తాంగ విభజన:
- కంపిత – సర్వ స్వర గమక, వరిక – ఉదా: భైరవి
- అర్ధకంపిత- ఖరహరప్రియ
- కంప విహీన – కదనకుతూహలము
~
- ఉదయ రాగము: ప్రాతఃకాలమున పాడు రాగము. ఉదా: బిలహరి, మలహరి, ముఖారి, భైరవి
- మధ్యాహ్న రాగము: ఉదా: శ్రీరాగము, మధ్యమావతి, నీలాంబరి, కళ్యాణి, శంకరాభరణం, మోహన, వసంత మొదలగునవి
- సాయంకాల రాగము: ఉదా: తోడి, సౌరాష్ట్ర, పంతువరాళి, మాళి, హుసేని, మాళవి, హిందోళ, లలిత మొదలగునవి.
~
నారదుని
- సూర్యాంశ
- చంద్రాంశ
పురుష రాగములు – భైరవి, భూపాలము
స్త్రీ రాగము – కురంజి, ఆంధాళి
నపుంసక రాగము – పై రెండికీ చెందనివి.
రామామాత్యుని విభజన:
- ఉత్తమ రాగములు: రచనలకు, ఆలాపనకు పనికి వచ్చునట్టివి.
- మధ్యమ రాగములు: కొన్ని భాగములను మాత్రమే పాడదగినట్టివి
- అధమ రాగములు: రచనలకు ఎంత మాత్రము పనికిరాని రాగములు.
సోమనాథుడు ఈ విభజనను మెచ్చుకొనెను.
మతంగుని విభజన:
1. శుద్ధము:
శాస్త్రముల నందు చెప్పినట్లు ఒకే రాగ కళను స్ఫురింపజేయునది. ఉదా: శంకరాభరణం, శ్రీరంజని, మోహన
2. సాలగము:
అన్య రాగచ్ఛాయలను పొంది, జన మనోరంజకమైన రాగము. ఉదా: భైరవి, రీతిగౌళ, సారంగ మొదలగునవి.
3. సంకీర్ణము:
శుద్ధము, సాలగములకు చెందిన అనేక రాగచ్ఛాయలను పొందుట. ఉదా: దేశ్య కాపి, ఆహిరి, సౌరాష్ట్రము, భైరవము, ద్విజావంతి మొదలగునవి.
పార్శ్వదేవుని రాగములు:
1. రాగాంగ సంపూర్ణములు:
రాగాంగ షాడవ
రాగాంగ జౌడవ
2. ఉపాంగ సంపూర్ణములు:
ఉపాంగ షాడవ
ఉపాంగ జౌడవ
3. భాషాంగ సంపూర్ణములు:
భాషాంగ షాడవ
భాషాంగ జౌడవ
4. క్రియాంగ సంపూర్ణములు:
క్రియాంగ షాడవ
క్రియాంగ జౌడవ
పురాతన తమిళ సంగీత విభజన:
పురాతన తమిళ సంప్రదాయములో పణ్, తిరమ్ అని రెండు విభజనలు కలవు.
పణ్ విభాగములు మూడు. 1. ఎహల్ పణ్ 2. ఇరవు పణ్ 3. పాదు ప్పణ్
హిందుస్థానీ సంగీత విభజన:
- రాగ (పురుష) – 6 రాగములు.
- రాగిణి (స్త్రీ) – ప్రతి పురుషునకు 5 గురు భార్యలు. 6 x 5 = 30
- పరివార (పుత్రులు, వారి భార్యలు) – ప్రతి పురుషునకు 8 మంది పుత్రులు. 6 x 8 =48. ప్రతి పుత్రునికి ఒక భార్య. 48 x 1 =48
మొత్తంగా
48+48=96
6+30+96=132
మిత్రరాగము:
నామభేదములచే వ్యవహరింపబడు రాగములు.
భైరవి – ఆనంద భైరవి – వసంత భైరవి
వరాళి – సాగ వరాళి – పున్నాగ వరాళి – శోక వరాళి – పంతువరాళి
కాంభోజి – గుమ్మ కాంభోజి – గోడికా కాంభోజి – చెంచు కాంభోజి – నంది కాంభోజి – యదుకుల కాంభోజి
నాట – ఛాయ నాట – గంభీర నాట – సారంగ నాట – ప్రతాప నాట
గౌళ – రీతిగౌళ – నారాయణ గౌళ – కేదార గౌళ – ఛాయ గౌళ
మల్లారు – సామంత మల్లారు – గౌడ మల్లారు – చెంచు మల్లారు
ఉభయ సంగీత ఏక నామ రాగములు:
(కర్నాటక, హిందుస్థానీ)
కళ్యాణి, యమన్ కళ్యాణి, కానడ్, అరాణా, ఖమాసు, బేహాగ్
ఉభయ సంగీత ఏక రాగములు:
- తోడి – భైరవి
- మాయా మాళవ గౌళ – భైరవ
- సావేరి – జానియ
- అభేరి – భీమపలాస్
- హిందోళ – మాల్‌కోస్
- ఖరహరప్రియ – కాపి
- శ్రీరంజని – బాగేశ్వరి
- శుద్ధ సావేరి – దుర్గా
- నాటకురంజి – మాల్కంజి
- ద్విజావంతి – జయజయవంత్
- శంకరాభరణం – బిలావల్
- మోహన – భూప్
- నాటకురంజి – తిలాంగ్
- శుభ పంతు వరాళి – తోడి
- పూర్వీ కళ్యాణి – పూర్వి
- హంసానంది – సోహనీ
(ఇంకా ఉంది)