డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్‌ గారికి రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం

0
5

[dropcap]పా[/dropcap]లమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్‌ గారికి సంస్కార భారతి వారి శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం లభించింది. ఏప్రిల్ 5 న తెలంగాణ సినిమా, టీ.వీ మరియు రంగస్థల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సహకారంతో సంస్కార భారతి ఆధ్వర్యంలో షాద్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు వై.అంజయ్య యాదవ్ ఉగాది పురస్కారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దేశభక్తిని, సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఏర్పడిన సంస్కార భారతి రాష్ట్ర స్థాయి కవులకు, కళాకారులకు అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు.

సంస్కార భారతి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె.రంగనాథం సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమి మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, సంస్కార భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ ఫిలిమ్ సెన్సార్ బోర్డ్ సభ్యులు డాక్టర్ వాడ్రేవు శివాజీ, సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఫిలిమ్ సెన్సార్ బోర్డ్ సభ్యులు టీ.వీ.రంగయ్య, నంది అవార్డు గ్రహీత నారాయణాచారి, షాద్ నగర్ మునిసిపల్ చైర్మన్  కె.నరేందర్, మాజీ చైర్మన్ అగ్గనూరి విశ్వం, హాజిపల్లి మాజీ సర్పంచ్ సింగారం శ్రీనివాస్, వి.హెచ్.పి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంస్కార భారతి గౌరవ సలహాదారులు బండారు రమేశ్, బి.జె.పి. సీనియర్ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, సామాజికవేత్త బెజుగం రమేష్, ఘంటసాల సంగీత కళాశాల కార్యదర్శి కె.లక్ష్మణ్, మర్రిచెట్టు సినిమా దర్శకులు డాక్టర్ దాసరి రంగ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here