భద్రత?

0
3

[dropcap]మి[/dropcap]శ్రమ ఫలితాలే అయినప్పటికీ
హరిత విప్లవంతో ఆకలి బాధలు
చాలా వరకు తగ్గిన మాట నిజం
అక్కడక్కడ ఉన్నప్పటికీ
అభిమానం ఆచ్ఛాదనగా ఉండేది.
ఆహార భద్రత పేరుతో – ఆకలిని –
అనాచ్ఛాదితంగా ఊరేగిస్తున్నారు.
ఆహార భద్రతకు కావలసినవి
బిల్లులూ, దానాలూ కానేకావు
సురక్షితమైన ఆహారం, దాని లభ్యత, ప్రజల కొనుగోలు శక్తి
ఈ సూక్ష్మం –
ఆర్థిక నిపుణునికి తెలియదనుకోవాలా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here