[dropcap]భా[/dropcap]రతీయత ఆత్మగ
దేశభక్తి ఊపిరిగ
ఉక్కు పిడికిలి బిగించి
ఉరుమై ఉరిమి
యుద్ధ మేఘమై గర్జించి
అగ్నిలా మారి శత్రువును
దహిస్తుంటే..
నీ వీర విహారం చూసి
శత్రుమూకల గుండెలు పగిలి
మంచుకొండ ముద్దలు పిగిలి
భారతమాత పాదాలు తడుముతుంటే
వీరతిలకమై వెలిగినావు
***
ఎండలోనూ వానలోనూ
మబ్బు లోనూ మరక లోణూ
కులమతాల కుమ్ములాట
సమత మమత సాధించి
మంచి కోసం మనిషి కోసం
మనసున మల్లెలు పూయిస్తూ
మునుముందుకు సాగిపోతూ
నేల తల్లి సేవలో తరించి
పరవశించిన వీరుడా!
ఓ వీరుడా..
వందనాలు అభివందనాలు
***
తొలి పొద్దు ఎరుపు
మలి పొద్దు ఎరుపు
మనిషి మనిషిన పొంగు
రక్తపు రంగు ఎరుపు
రంగులు వేరని రగులుతున్న
శత్రుమూకల నరుకు
వాడి రక్తం రంగు ఏదని
అడిగి మరీ నరుకు
నరుకు నరుకు నా దేశ పటం
చుట్టూరా నే కంచెలా
కాచుకూచున్నానని చెప్పి మరీ నరుకు
సైనికా ఓ సైనికా
వీరుడా ఓ వీరుడా..