సంచిక స్వాధ్యాయ – సాహితీ సమావేశం – ఆహ్వానం

5
3

[dropcap]సం[/dropcap]చిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న సాహితీ సమావేశం.

రచయితల సమావేశం

తేదీ: 23 ఏప్రిల్ 2023. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 13.00 గంటల వరకు

వేదిక:

Telangana State SC Study Circle,

Beside Basava Tharakam Cancer Hospital,

Road No 14,

Banjara Hills

Hyderabad.

ఈ సమావేశంలో చర్చించే అంశాలు:

  1. సంచికకు మరింత పాఠకాదరణ సాధించటం
  2. సంచిక రచయితల పుస్తక ప్రచురణ, విక్రయ సాధకబాధకాలు
  3. సంచిక సాహిత్య అకాడమీ ఏర్పాటుకు సంబంధించిన చర్చ

ఈ సమావేశానికి అందరికీ ఆహ్వానం.

సమావేశం పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం ఏర్పాటు ఉంటుంది.

ఏర్పాట్లు సక్రమంగా చేసేందుకు వీలుగా సమావేశంలో పాల్గొనేవారు ముందుగానే 9849617392 నెంబరులో వాట్సప్, మెసేజ్, కాల్ ద్వారా సూచించమని ప్రార్థన.

సంచిక – స్వాధ్యాయ సమావేశాలు సరయిన సమయానికే ఠంచనుగా ఆరంభమవుతాయి. కాబట్టి 10 గంటల కన్నా కొన్ని నిముషాల ముదు సభాస్థలికి చేరుకుంటే ఇతరులకు ఇబ్బంది కలిగించని వారవుతారు.

ముఖ్య సూచన:

23 ఏప్రిల్ లోగా ‘రామకథాసుధ’ కథల సంకలనం అందుబాటులోకి వస్తే, ఆ రోజు ఆ సంకలనంలో కథలున్న రచయితలకు పుస్తక ప్రదానం ఉంటుంది. సంచిక సమావేశంలో పాల్గొన్న వారికి పుస్తకం తక్కువ ధరకు లభ్యమవుతుంది.

పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొని, రచయితలు ఉత్తమ సాహిత్యానికి ప్రోత్సాహమివ్వగలరని ప్రార్థన.

సంచిక టీమ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here