[dropcap]ప్ర[/dropcap]జాస్వామ్య వృక్షానికి
ఎన్నికలప్పుడు కాసే
అన్నం క్యాంటీన్లు
కూరగాయ సరఫరాలు
అధికారం విచ్చేసాక
అంతర్ధానమే..
ఇదో ఎత్తుగడే..
అన్న సంతర్పణ
అధికార దాహానికి గాక
ఖాళీ కడుపుల్లో దహనం
చల్లార్చడానికా..
వాళ్ళు అదే పాట పాడతారు
భ్రమలకు పాడే కట్టేదాకా
అక్షరమై కదులుతున్నా
ప్రజాస్వామ్య వృక్షానికి పట్టిన
వేరు పురుగు పీకడానికి
మీరొస్తున్నారా..?