సినిమా క్విజ్-34

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో సంగీత దర్శకుడు ఎ. ఎం. రాజా స్వరాలందించగా, ఎన్.టి.ఆర్. హీరోగా, అంజలీదేవి హీరోయిన్‍గా 1958లో విడుదలైన చిత్రం ఏది?
  2. సి.వి. శ్రీధర్ 1959లో తమిళంలో ‘కళ్యాణ పరిసు’, 1960లో ‘పెళ్ళి కానుక’ చిత్రం తీశారు. తెలుగు చిత్రంలొ బి. సరోజా దేవిని జగ్గయ్య వివాహం చేసుకుంటే, తమిళ సినిమాలో ఆమెను ఎవరు వివాహం చేసుకుంటారు?
  3. విజయా వారు శోభన్ బాబు, కృష్ణ, వాణిశ్రీ లతో ‘గంగ మంగ’ చిత్రం నిర్మించారు. దాని హిందీ మాతృక ఏ పేరుతో వచ్చింది?
  4. కన్నడంలో కల్పన (ద్విపాత్రాభినయం), రాజేష్ లతో ఎస్.ఆర్. పుట్టన్న కంగల్ తీసిన చిత్రం ‘కప్పు బిళుపు’ను తెలుగులో ఏ పేరుతో రీమేక్ చేశారు? ఇతని దర్శకత్వంలోనే ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ (ద్విపాత్రాభినయం) నటించారు.
  5. 1966లో కన్నడ చిత్ర దర్శకనిర్మాత బి. ఆర్. పంతులు గారు ‘దుడ్డే దొడ్డప్ప’ చిత్రాన్ని ఒక ముఖ్యపాత్రలో తాను, ఎం. వి. రాజమ్మలతో తీశారు. దీన్నే తెలుగులో 1968లో అంజలీదేవి, ఎస్.వి. రంగారావు ప్రధానపాత్రలుగా వి. మధుసూదనరావు గారి దర్శకత్వంలో తీశారు. ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అన్న ఘంటసాల పాట ఉన్న ఈ చిత్రం పేరేమిటి?
  6. తాతినేని రామారావు దర్శకత్వంలో కృష్ణ, శోభన్ బాబు, విజయనిర్మల నటించిన చిత్రం ‘మంచి మిత్రులు’. ఇదే కథతో షమ్మీకపూర్, సంజీవ్ కుమార్, సాధనలు నటించగా హిందీ వచ్చిన చిత్రం ఏది?
  7. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అని ప్రసిద్ధి పొందిన నటుడు ఎవరు?
  8. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయసుధలు నటించిన ‘అమరదీపం’ చిత్రానికి ఏ తమిళ చిత్రం ఆధారం? ఇందులో శివాజీ గణేశన్, సుజాత, విజయ్ కుమార్ (నటి మంజుల భర్త) నటించారు.
  9. విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘అగ్గిబరాటా’ (ఎన్.టి.ఆర్., రాజశ్రీ) చిత్రంలో భంభం బసవయ్య పాత్రధారి ఎవరు?
  10. హిందీలో బి.ఆర్. ఫిలింస్ వారు యష్ చోప్రా దర్శకత్వంలో సునీల్ దత్, రాజ్ కుమార్, శశి కపూర్, సాధన, షర్మిలా టాగోర్ లతో ‘వక్త్’ (1965) చిత్రం నిర్మించగా, ఈ చిత్రాన్ని కృష్ణ, కృష్ణంరాజు, రామ్మోహన్‍లతో కె.ఆర్. విజయ, గీతాంజలి నటించగా పేకేటి శివరామ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా పేరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 మే 2వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 34 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 మే 07 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 32 జవాబులు:

1.ఆకలి రాజ్యం 2. రేచుక్క పగటిచుక్క 3. ఇంటిగుట్టు 4. పెంపుడు కూతురు 5. మంచి చెడు 6. కె. ప్రసాదరావు 7. రమణారెడ్డి 8. నాగరత్న 9. నహల్ బిల్డింగ్స్ 10. విశ్వరూపం

సినిమా క్విజ్ 32 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • మణి నాగేంద్రరావు. బి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • కొన్నె ప్రశాంత్
  • జి. స్వప్న కుమారి
  • డి. ఎం. కనకరాజి
  • టి. రేవతి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here