సంచిక – పద ప్రతిభ – 60

0
5

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దీపావళికి కాల్చేది (4)
4. హిందూ సంవత్సరాల పేర్లలో 47వ సంవత్సరము – దీంట్లో కొంచెం డేంజర్ దాగి ఉంది – జాగ్రత్తండోయ్! (4)
7. సంధానము చేయునది (5)
9. నిశ్చితార్థము (3)
11. దళసరి (సాధారణంగా బట్టల గురించి వాడుక) (3)
13. నిండిన, పూర్ణమైన (2)
14. నాగలి (3)
16. మామిడి కొమ్మ మళ్ళీ మళ్లీ పూయునులే అనే పాట ఈ సినిమాలోదే (2)
17. భూమి (3)
18. త్రికరణములలో మొదటిదానిని పిలవండి (3)
19. పాటలీపుత్రము / పట్టణము (2)
20. విశాఖపట్టణములో కునుకు శ్రీకాకుళంలో మత్తు (3)
22. ఒక ప్రసిద్ధమైన కల్పిత పక్షి- ఇది కేవలం ఎముకల్ని మాత్రమే తింటుందనీ, దీని నీడ ఎవరి తలమీద పడుతుందోవాడు రాజవుతాడని విశ్వాసం (2)
24. తోట చెదిరింది (3)
26. పచ్చి కాయ పక్వమునకు వచ్చుట (3)
27. మరదే నాకు మండేది అనే ఫేమస్ డైలాగ్ వీరిదే (5)
30. సుళువు (4)
31. వీలుకాదు అనకండి మరి – ఒక అక్షరం మార్చి ఇంకోదానికి గుణింతం సరిజేస్తే ధనుష్మంతుడు కనిపిస్తాడు కదా! (4)

నిలువు:

1. ఒకప్పటి ఆంధ్ర ప్రభ తెలుగు వీక్లీ లో వచ్చిన పిల్లలకు సంబంధించిన శీర్షిక (4)
2. పుత్రపౌత్ర పారంపర్యము (3)
3. చాపము కలవాడు – (అడ్డం 31 లో కూడా కనిపిస్తాడు) (2)
4 విత్తులతో ఉండు దూది (2)
5. అదృశ్యము (3)
6. కల్లుత్రాగెడు గిన్నె (4)
8. పెద్ద కొంగ (3)
10. మేఘము (5)
12.  ఇంద్రుడు (5)
14. అష్ట సిద్ధులలో మొదటిది (3)
15. అనేకులు చేరి చేయు సేద్యము చివర శూన్యమైంది (3)
19.. శ్రీ రాముడు  జన్మించిన  నక్షత్రము (4)
21. విక్టరీ వెంకటేష్ కు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు ప్లస్ ఫిలింఫేర్ సౌత్ అవార్డు లను తెచ్చి పెట్టిన 1998 సినిమా (3)
23. యుక్తిగా మాటలాడువాడు / సభయందు భయములేక మాటాడువాఁడు (4)
25. మొదటి సంవత్సరం చివర మొదటికొచ్చింది (3)
26. కాగడాలు (3)
28. తుది లేని మన్మథుడు (2)
29. అశ్వత్థము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 2వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 60 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మే 07 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 58 జవాబులు:

అడ్డం:   

1.ఏకవీర 4. మనసారా 7. నుజ్జు 8. జామ 9. రుమాలు 12. సందేహం 14. వుతా 15. శ్రీలంక 17. వస 18. తాత 19. క్తంరుని 21. ద్యుతి 23. పేలుచు 25. నలురు 26. రక్తి 28. మాట 29. రంజకము 30. దినమణి

నిలువు:

1.ఏకరువు 2. వీనులు 3. రజ్జు 4. మజా 5. నమసం 6. రాజహంస 10. మాతాపితలు 11. చలం 13. దేవవైద్యులు 15. శ్రీసూక్తం 16. కడాని 18. తాపేశ్వరం 20. రుతి 22. తిరుత్తణి 24. చురక 25. నటన 27. క్తిము 28. మాది

సంచిక – పద ప్రతిభ 58 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమరి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here