క్రమం

0
2

[dropcap]నే[/dropcap]ను నిన్ను కనుగొనాలనే చూస్తాను.
ఆటుపోట్లెదురైనా, ఈ తీరంపై
నువ్వైన నిలకడ ధ్వనితో వేచేఉంటాను.
ఈ కల్లోల కాంతికి అర్థమేమిటని అడగను.

విశ్వాంతరాళాలలో మనదైన రహస్యమేదో ఉండేఉంటుంది.
చిటికెనవేలు పుచ్చుకుని మనఃసంద్రాలలో
అడుగులు వేయిస్తునే ఉంటుంది.
రూపంకోసం పురాగాధని ఎలా తడమనూ!?

అందుకే ఊహిస్తాను ఇలా నిన్ను-

నీలో మేల్కొంటాను.
నిన్ను మేల్కొలుపుతాను.
కొంత వెలుతురును దిద్దుకుంటాను.
కొత్త వెలుగై సాగుతాను.

ప్రభూ, ఇలా నిన్ను కొన్ని అక్షరాల్లో దాస్తాను.
కొంత కనుగొన్నానని అనుకుంటాను.
ఏది అమాయకత్వమో మరి ఏది తెలివో నాకిప్పుడెందుకూ!?..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here