[dropcap]ఉ[/dropcap]న్నది త్యాగం చెయ్యి, ఏమీ ఆశించకు!
అంటుంది ఆధ్యాత్మిక వాదం
ఏదీ ఎక్కడికీ పోదు చోటు మాత్రమే మారుతుంది
అంటుంది భౌతిక వాదం
నీ తరువాతే ఎవరైనా
అంటోంది పదార్థ వాదం
నీతో సహా అంతా నాలో లీనం కావడానికే
అంటుంది భూ భౌతిక వాదం
సూక్తుల సంగతి అలా ఉంచినా –
అవసరాలు తీరాలి కాదనలేం
సమృద్ధి కావాలనిపించడాన్నీ తప్పు పట్టలేం
భవిష్యనిధి కార్యక్రమాన్నీ కాదనలేం
‘అబండన్స్’ లోనైనా నీతో బాటు మరికొందరికి
ఉపయోగపడని వనరులు ఎందుకు?