నూతన పదసంచిక-61

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ధర్మం రెండుపాదాలపై నడిచే యుగానికి శీర్షంలేదు. (5)
4. బామ్మర్దిని భరించే దక్షిణాది పాన్ కేక్ (3,2)
7. పరావర్తనం చెందిన కాంతి (3)
8. పంటను పాడుచెసే పురుగు. ఏరివేయాలి కదా? (5)
9. అడ్డం 19 వంటిదే. అసహనానికి ఈ జాతీయం ఉపయోగిస్తారు. (2,3,2)
11. వశిష్ట, విశ్వామిత్ర కశ్యపాదులు ఒక వరుసలో లేరు. (3)
12. ముసలి నక్క తిరగబడింది. (3)
14. బాహుసంధితో ప్రారంభమయ్యే బాగా కలపబడిన ఒక అలంకారం. (3)
17.  వానలు కురిపించే దేవత (3)
19 . అడ్డం 9 వంటిదే. అతిగా ఆగడం చేసే వ్యక్తిని సంబోధిస్తారు. (2,3,2)
22. మొదటిలో దీర్ఘమై మధ్యలో హ్రస్వంగా మారిన కరుణానిధియేనా? (5)
23. శస్త్రచికిత్స చివరలో లభించే పరిమితమైన అన్న సామాగ్రి (3)
24. ఎ ఫెదర్ ఇన్ ద క్యాప్ (5)
25. తిరుమలలో ఒక దర్శనీయ ప్రదేశం (5)

నిలువు:

1. సర్వసాధారణంగా శుభకార్యాలలో దర్శనమిచ్చే స్త్రీల ఉడుపులు. (5)
2. యుగానికో మొనగాడు (6)
3.  డ్రైనేజీ (3,3)
4. రుద్రమదేవి సినిమాలో హంసానందిని నటించిన పాత్రను పిలవండి. (4)
5. ‘సన్నబడిన’కు క్వైట్ ఆపోజిట్ (4)
6. బుడ్డకాకర(5)
10. కొలిపాకలో ఈశ్వరుడు తలక్రిందలుగా ఉంటాడా? (3)
13. ది యాక్సిడెంటల్ ప్రైమ్మినిష్టర్ సినిమాలో శివరాజ్ పాటిల్ పాత్రను ధరించిన నటుడు. (3)
14. సాధారణంగా ప్రతియేటా జనవరి రెండవ వారంలో కొన్ని తెలుగు సినిమాలు విడుదలవుతాయి ఈ పండగ గిఫ్టుగా. (3,3)
15. నవ్వులేని మరిది లక్ష్మణుడు శీర్షాసనం వేశాడు. (6)
16.  ఒడి మధ్యలో శివుడు; దాది (5)
18.  అధరపానము (5)
20. దేవదాసు దీనికి ఒక ఉదాహరణ. (4)
21. మిడ్ నైట్ (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 9 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 61 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 మే 14 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 59 జవాబులు:

అడ్డం:   

1.వాద పటిమ 4. భిన్న సినిమా 7. రవన్న 8. ములమాసుక 9. అతిథి దేవో భవ 11. లక్షాధికారి 13. కశ 15. రావి 17. తుహిన కర 20. దోర్నాదుల సుబ్బమ్మ 22. జిడ్డు కడలి 23. నలుగు 24. యడాగమము 25. రుత్మడుఆవీ/రుఆడుత్మవీ

నిలువు:

1.వా ఆ ము ల ల/ వా ల ము ఆ ల (ఆలవాలము) 2. పరమావధి 3. మ ర క అ రి 4. భిన్న గ్రంథిక 5. సిరిమావో 6. మాతృ దేవత 10. దేశద్రోహి 12. కాకరాల 14. బందోపాధ్యాయ 16. విసుమానము 17. తుమ్మ జిగురు 18. నమ్మకస్థుడు 19. రబ్బిలిబొవీ 21. దుగతిగ ‌‌

‌‌నూతన పదసంచిక 59 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here