సంచిక – పద ప్రతిభ – 61

0
4

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. బంగారు మేను గల స్త్రీని తలపించే ఒకరాగము (4)
4. గడచిన సంవత్సరము (4)
7. పశువు (2)
8. రాశి/సొద/ ప్రోగు (2)
9. హోమము (3)
12. ముమ్మరం (3)
14. చంద్రగుప్తుని జనని (2)
15. విజయావారి ఆస్థాన మాటల పాటల రచయిత – అక్షరమాంత్రికుని ఇంటిపేరు – (3)
17. మొదలులేని పికము (2)
18. చివరలేని ద్రాక్షపండు (2)
19. కామధేనుతనయ (3)
21. ఒక నక్షత్రము – ఈ పేరుతో ఒక ప్రసిద్ధిగాంచిన వార/మాస పత్రిక (2)
23 ఈ తప్పెటకు అంతమే లేదు (3)
25. పాలలో వేసే మజ్జిగ తోడు (3)
26. ఆ లేదంటే సంతోషం (2)
28. దాయాది (2)
29. అడుక్కునేవాడు కాదండోయ్ చాణూరుని తోటివాడు (4)
30. కొడవలి (4)

నిలువు:

1. చెవులున్న గంగాళము (4)
2. బంగారం (3)
3.కొండ (2)
4. పరిశుద్ధమైనది /అగ్ని (2)
5.అప్పటప్పటికి వికసించెడు బుద్ధిని చూడండి ఉల్టాగా (3)
6. నవతా ఆర్ట్స్ వారి ఈ సినిమాతో నటుడు రంగనాథ్ కు మంచి గుర్తింపు వచ్చింది; నటి లక్ష్మికి నంది అవార్డు దక్కింది – కాకపోతే ఈ టీచరమ్మగారు కాస్త తడబడింది (4)
10. శారదలేఖలతో చైతన్యం కల్పించిన తెలుగు రచయిత్రి (5)
11. కాశీకి పోయాను రామాహరీ —– తీర్థమ్ము తెచ్చాను రామాహరి (2)
13. తృణకంకణం రచయితగారి బిరుదు (5)
15. దూదేకువిల్లు. (3)
16. హారతిని కిందనించి పైకి చూపిస్తున్నారేమిటీ? (3)
18. ప్రయత్నము (4)
20. ఉసిరిక చెట్టు (2)
22. ముష్టి (4)
24. గజిబిజిగా కిరీటము (3)
25. చేరగరావే రయమున యమునాతీరమునకు – 1,10,6 (3)
27. సేన (2)
28. దేవుడిని క్రిందనుండి పైకి చూసినా కనిపిస్తాడు అటునుండి ఇటు వ్రాసేవారి భాషలో (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 9తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 61 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మే 14 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 59 జవాబులు:

అడ్డం:   

1.ప్రతిభాదేవిసింగ్ 7. రోకు 9. విళంబి 10. కాచే 11. జినిసీ 13. మమతా 14. కాకాక్షిన్యాయం 17. నాగరికం 19. దంపరంప 21. యుతం 23. భలా 24. జ్యం రా మ రా శ్రీ 28. కాత్యాయనీ విద్మహే

నిలువు:

2.తిరు 3. దేవళం 4. సింగి 5. సరోజినీ నాయుడు 6. సుచేతాకృపలానీ 8. కుని 10. కామ 12. సీకారి 13. మయంప 15. కాకం 16. న్యాదం 18. గతం 20. రంభ 22. కం మ నీ 24. జ్యంత్యా 25. రాయ 26. రావి 27. శ్రీద్మ

సంచిక – పద ప్రతిభ 59 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • రామలింగయ్య టి
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here