[dropcap]క[/dropcap]ళ్ళున్న కబోదులెందరో!
బద్ధకస్తులు కొందరు
సోమరులెందరో!
సమాజానికి బరువు అందరు
పుట్టుగుడ్డి ధృతరాష్ట్ర ప్రేమ
కురువంశ వినాశనం..
ఆగర్భఅంధుడు
సంజీవరాయుని ప్రజ్ఞ
గణిత మేధో నిలయం..
మిల్టన్ నేత్రహీనుడే!
ఆయన సృజన అజరామరమే!
హెలెన్ కెల్లర్ నయనహీనయే!
ఆమె రచనలు అమరమే!
చాలామంది గ్రుడ్డివారు చుక్కలు చూడలేని వారే!
ఉబ్బెత్తు చుక్కల వేళ్ళతో తడిమి తరించినవారే!
గ్రంథ పఠనంతో
జ్ఞానులయినవారే!
వేలాది గ్రంథాల సృజనకారులు వారే!
చుక్కల లిపిని సృష్టించి
జ్ఞానచక్షువులందించిన..
అంధులవిద్యాబ్రహ్మ
లూయీబ్రెయిలీ దేవుడే!