[dropcap]వై[/dropcap]శాఖ పూర్ణిమ (మే 6, 2023) తాళ్ళపాక అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని ‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.
అన్నమయ్య ఆధ్యాత్మిక, శృంగార సంకీర్తనలకు పలువురు కవి పండితులు వ్యాఖ్యలు వెలువరించారు. ఎవరి ధోరణి వారిది. అన్నమయ్య 600వ జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు తాళ్ళపాకలో నిర్వహించినప్పుడు వేదికపై సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను అధికారులు పద్మనాభరావుకు అప్పగించారు.
శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్‍గా దాదాపు వెయ్యి కీర్తనలను 2005-2008 మధ్య కాలంలో ధ్వనిముద్రణను చేయించారు పద్మనాభరావు.
తనదైన శైలిలో వారు అందిస్తున్న భావజాలం ‘అన్నమయ్య పద శృంగారం’.
వచ్చే వారం నుంచీ సంచికలో ధారావాహికంగా..
చదవండి.. చదివించండి.