సైకోసిస్ – నివారణోపాయాలు

0
2

[box type=’note’ fontsize=’16’] సైకోసిస్ అంటే ఏమిటో, ఆ రుగ్మత బారినపడ్డవారు కుటుంబాలలో గాని ఉద్యోగాలలో గాని ఎలా ప్రవర్తిస్తారో వివరిస్తున్నారు సత్య గౌతమి. సైకోసిస్ బాధితులకు నివారణోపాయాలు సూచిస్తున్నారు సైకోసిస్ – నివారణోపాయాలు వ్యాసంలో. [/box]

[dropcap]ఉ[/dropcap]న్నది లేనట్లుగానూ, లేనిదానిని ఉన్నట్లుగానూ భావించి కుటుంబసభ్యులను, తమ చుట్టూవుండే ఇతరులను బాధించేవారిని “సైకోసిస్” అనే మానసిక రుగ్మతతో వున్నవారిగా పరిగణిస్తారు. ఇతర కుటుంబ సభ్యులకు వీరి ఆగడాలు భరించడం అలవాటయిపోవడం వల్ల వారికిది మానసిక రోగమంటే మింగుడు పడదు, కనీసం వారిని వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలని కూడా అనిపించదు. అదీ మనిషి యొక్క ఒక సామాన్య, సహజ బుద్ధి అని అనుకోవడం దురదృష్ఠం. తీరా ఇటువంటి వారివల్ల ఎవరికయినా తీవ్రాపాయం కలిగినా ఏమీ చెయ్యలేరు. ఇలా సైకోసిస్ తో బాధపడుతున్నవాళ్ళకు ఆలోచనలు విచక్షణారహితంగా ఉంటుంది. అందువల్ల వారి పనులు కూడా విచక్షణారహితంగా వుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, అందరూ అపాయంలో వున్నట్లే.

దేశవిదేశాల్లో అది ఎటువంటి సమాజమయినే ఈ సైకోసిస్ రుగ్మతకు గురయ్యే వాళ్ళు కోకొల్లలు. అది పుట్టుకతో లోపం కావచ్చు, లేదంటే వివిధకారణాలవల్ల మారి కూడా వుండవచ్చు. ఏది ఏమయినా దీని మూలం జన్యులోపాలే, దానికి వివిధ కారణాలచేత అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వారిలో ఆ రుగ్మత ప్రభలమవుతుంది. అయితే ఇదేమీ ఎవరూ గుర్తు పట్టలేనంత అంతుపట్టని వ్యాధేమీ కాదు. వివేకాన్ని కోల్పోయి, విచక్షణారహితంగా ప్రవర్తించడాన్ని వాడుకలో సైకోలు అని అందరూ అంటారు, వారినీ బాగుచేయించాలనీ ఎవరూ పూనుకోరు పోనీ దాన్ని తాము బాగుపడాలని తమకు తాము కూడా కోరుకోరు, అసలు గుర్తించరు. ఎందుకంటే తాము చేసేవన్నీ కరక్టే అని వీరు అనుకోవడం, ఆ… ఎలాగూ బతుకుతారులెద్దూ, నలుగురితో నారాయణా…ఎవరికి పట్టిందిలే అంత డబ్బు ఖర్చుపెట్టి డాక్టర్ల చుట్టూ తిప్పడానికి అనేటటువంటి నిర్లక్ష్య భావన. ఈ నిర్లక్ష్యభావన ఈ మానసిక రుగ్మతలయందు ఉండడంవల్ల ఈ సమస్యలతో బాధపడే వారికి ఎటువంటి సహాయమూ పదుగురినుండి అందదు. కొన్నాళ్ళకు తాను మునిగిందే గంగ, తను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అన్నటువంటి ధోరణి వాళ్ళలో బాగ బలంగా పాతుకొని పోయి చుట్టూ వున్నవారిపై రకరకాల భ్రమలతో, భ్రాంతులతో బాధిస్తుంటారు. విచక్షణారహితమైన వ్యామోహాలకు గురవుతుంటారు.

ఇది కేవలం సామాన్యులలోనే కాదు, బాగా చదువుకున్నావారిలోకూడా వుంటుంది. అయినా వారు చదవగలిగారు, పదుగురిలోతిరుగుతున్నారు అంటే గల కారణం? వారి చదువు, పదవి మాత్రమే వారిని సంఘంలో నిలబెడుతుంది కానీ వీరికి మంచి స్నేహితులుండరు, కుటుంబ సభ్యులు కూడా చూసీ చూడనట్లుగా వదిలేసి వ్యవహరిస్తుంటారు, దానితో మరింత వంటరితనంతో… వారి విచఖణా రహితమైన ఆలోచనలకు అడ్డూ, అదుపూ లేకుండా ముందుకు సాగిపోతుంటారు. వీరిగురించి తెలిసినవాళ్ళు అంతంతమాత్రంలోనే వుంటూ తానొవ్వక నొప్పించక అన్నట్లు గా వ్యవహరిస్తుంటారు. సమాజ ధోరణి ఇలావుండడంవల్ల ఈ సైకోసిస్ రుగ్మతలు గలవాళ్ళు ఏ విధంగానూ అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చెయ్యగలిగే పరిస్థితిలో కూడా వుండరు. కాబట్టి ఇది పూర్తిగా ఇంటివారి బాధ్యత లేదా తాము స్వయంగా తీసుకోవలసిన బాధ్యత.

సైకోసిస్ తో బాధపడేవాళ్ళు ఉద్యోగాలు చేసే చోట ఎదురయినప్పుడు పరిస్థితి చాలా కష్టంగావుంటుంది. ఉద్యోగాలు చేసే చోట అందరూ పోటీదారులే వుంటారు లేదా ఎవరి పని వాళ్ళు చేసుకొనిపోతూ టార్గెట్స్ ని రీచ్ అయ్యే బిజీలో వుంటారే తప్పా … మానసికరుగ్మతలు  గలవాళ్ళకు వారి టార్గెట్స్ గురించి ఆలోచిస్తూ వారికి సహాయసహకారాలు అందిస్తూ వుండగలిగే పరిస్థితిలో వుండరు. అప్పుడు ఈ రుగ్మత గలవాళ్ళకు మానసిక వత్తిడి మరింతపెరిగీ, ప్రక్కవారిని సామాన్య ధోరణిలో సహాయమడిగి పని పూర్తిచేసుకోవాలనే ఇంగితాన్ని పాటించరు. అలా పాటించగలిగితే వాళ్ళు సహజంగావున్నట్లే లెక్కా. అలాకాకుండా వాళ్ళ రుగ్మతకు అనుగుణంగానే విచక్షణ కోల్పోయి కష్ఠపడి పని పూర్తి చేసుకోగలిగే వాళ్ళమీద భ్రమలను రుద్ది వారిపై అనవసరమైన కంప్లైంట్లను అధికారులకు ఇవ్వడమూ, వాటిని అధికారులు నమ్మేలాగ దొంగ సాక్ష్యాలను, రుజువులను ఏర్పాటు చెయ్యడము, వారి పని పాడుచేసి వారు టార్గెట్స్ రీచ్ కాకుండా ఆపడము తద్వారా తాము ఏదో సాధించినట్లుగా ఆనందించడమూ … వారిపై దొంగ సాక్ష్యాలను వీరే కల్పించినప్పటికీ వారి మానసిక రుగ్మత వారిని అదే నిజమని నమ్మేలా మళ్ళీ భ్రమింపజేస్తుంది. కొన్ని సార్లు ఇట్టి రుగ్మతలు వారిని ఆత్మహత్యలకు పాల్పడేలా చెయ్యడమో, లేక ఎదుటివారిని కొట్టీ, తిట్టీ చివరికి చంపేసేలా చెయ్యడమూ వరకూ దారి తీస్తుంది. ఇది అట్టి ప్రమాదకరమైన పరిస్థితి. అందువల్ల సైకోసిస్ రోగులు నిలకడగా ఒక ఉద్యోగములోవుండలేరు, ఏదో ఒక పరిస్థితి కారణంగా ఎవరయినా సహృదయం తోఆదరించి ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ఆ ఒసులుబాటుకు కాస్తంతయినా తలవంచగలిగి పనిచేసుకొని ఉద్యోగం నిలబెట్టుకోవాలని ఆలోచించరు. మళ్ళీ విచక్షణారహితమే, అదే ధోరణి వారు సమస్యల్లో చిక్కుకొనీ, సహృదయంతో పనిచ్చిన వాళ్ళని కూడా సమస్యల్లోకి లాగుతారు. ఇటువంటి పక్ష్యంలో వారితో ఖచ్చితమైన ధోరణిలో వుండడమే సరయిన ట్రీట్మెంట్. ఆ ఖచ్చితము వారికినచ్చకపోయినా … వారి విచక్షణారహిత ధోరణికి మాత్రము ఆనకట్ట పడుతుంది, ఆ సమయంలోనే కొలీగ్స్ సరియైన నిర్ణయాలు తీసుకొని అధికారులకు సహాయ పడగలిగినట్లయినా అనవసరమయిన కంపైంట్లు, కమిటీలు, దొంగ సాక్ష్యాలు మొదలైన వాటిలో కాలం వృధాకాకుండా ఆపగలరు. అప్పుడు ఈ రుగ్మతగలవాళ్ళాలో ఏదో చిన్న మార్పు సంభవించే అవకాశము తప్పకుండావుంటుంది. అంతే గానీ వారిని అలాయే వదిలేస్తే అందరికీ ప్రమాదమే.

అలాగే కుటుంబ వ్యవస్థ. ఈ మధ్యకాలంలో తీవ్రమైన దాడులకు, కక్ష్యా కార్పణ్యాలకు గురవుతోంది కుటుంబవ్యవస్థ. దీనికి కారణము కుటుంబ సభ్యులమధ్య గౌరవాభిమానాలు లేకపోవడము, అహంకారమూ, మానసిక వైఫల్యమూ. ప్రతి ఒక్కరికీ ఆర్ధిక స్వేచ్చ పెరగడంతో తమ తమ తెలివితేటలను వుపయోగించి కష్ఠపడే తత్వాన్ని ప్రదర్శించి ఆర్ధికంగా చాలా మంది చిన్న వయసుల్లోనే నిలదొక్కుకుంటున్నారు. ఇలా కష్ఠపడే మనస్థతత్వం లేని వాళ్ళు పెద్దరికమనో, చిన్నరికమనో బంధాలను అడ్డం పెట్టుకొని మానసిక వైఫల్యానికి గురయ్యి తాము ముందంజలోవుండాలనే రాజకీయ ఆలోచనా ధోరణిని కుటుంబంలో ప్రవేశింపజేస్తున్నారు. కుటుంబమనే కనీస అభిమానం కూడా లేకుండా వారిలోని ఏదో ఒక బలహీనతను కనిపెట్టి వాడుకొంటూ లబ్ధి పొందుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఎదుటివారు వారికి తెలియకుండానే తమజీవితాలో ముఖ్యమైన వాటిని కోల్పోతున్నారు, అబద్ధాన్ని నిజమని నమ్మి జీవితాల్ని నాశనమూ చేసుకొంటున్నారు. ఇది నేరం. నేర ప్రవృత్తి. ఇటువంటి నేరాలకు శిక్షలు వెయ్యడానికి ఈ భూమి మీద అసలు కోర్టులే లేవు! ఇలా సుఖపడాలనే విపరీతకాంక్షలతో మానసిక వైఫల్యాలకు గురయ్యి సైకోసి లక్షణాలను పొందేవారు కోకొల్లలు.

చిన్న చిన్న మానసిక వైఫల్యాలు తగుమోతాదుల్లో వుంటే ఫర్వాలేదనిపిస్తుంది ఉదాహరణకు కోడలురాగానే అత్తగారి స్థానన్ని పొందిన చాలామంది స్త్రీలు కాస్త మానసిక వైఫల్యాలకు గురవుతారు. ఎప్పుడూ తనచుట్టూ తిరుగుతూ తాను వడ్డిస్తేనే తినే కొడుకు, కోడలు రాగానే ఆ బాద్యతను ఆ క్రొత్తపిల్ల మీద వేస్తాడు, అది కాస్త తల్లికి నొప్పిదమే. అది సర్దుబాటయ్యే టైములో కాస్త మానసిక ఇబ్బందికి అందరూ గురయినా కొద్ది దినాల్లో సర్దుకుపోతే ఫర్వాలేదు, అంతే గానీ ఆవేశకావేశాలకు లోనయ్యి రోజూ యుద్ధాలు చేస్తూ కొడుకూ, కోడలి మధ్య అత్తగారు పడుకొని నిద్రపోయే సంగతులూ వింటున్నాము, చేతిలో కత్తిపీట విసిరి అత్తగారి రక్తం కళ్ళ జూసే కోడలిగారి విషయాలూ వింటున్నాము, కొన్ని కుటుంబాల్లో అత్తాకోడళ్ళు బాగా కలిసిపోయి అరాచకాలు, అవమానాలు ఆ సదరు కొడుక్కీ లేదా భర్తకు తెచ్చి పెట్టి అతగాడి ఆత్మహత్యకు కారణమయ్యే ఉదంతాలూ వింటున్నాము. తనని పెళ్ళిచేసుకొని వూరుకుంటే సరిపోదూ, తాను సూచించిన తనతరపు వాళ్ళకు కూడా తన స్థానం ఇవ్వాలనీ, వారి బాగోగులు, వారి పిల్లల బాగోగులు ఈ ఒక్క అర్భక భర్త చూసితీరాలనీ వేధించుకొని తినే అత్తవారినుండీ, పాపమా భర్తా. వియ్యపురాలూ అంటే అతని తల్లి పారిపోయి ఎక్కడో తలదాచుకొనే వార్తలు బయటపడుతున్నాయి. ఈ చెడు ప్రవృత్తులన్నీ కూడా వారు వివిధకారణాలవల్ల అలవరచుకొన్నవి. వాటికి తగు ఆదరణ భర్తా, భర్త తరపువారినుండి రానప్పుడు న్యూనతా భావానికి లోనయ్యి సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. దీనికి గలకారణం సంకుచిత భావాలు, వారికిష్ఠులయిన వారిపై మనసా, వాచా, కర్మేణా ఆధారపడివుండడం మరియు సామాజిక స్పృహ లేకపోవడము. క్రొత్తవారితో జీవితాన్ని పంచుకోవాలసిన అవసరం ఏర్పడినప్పుడు ఆ క్రొత్తదనాన్ని వారు అంగీకరించకపోవడంతో అభిప్రాయ బేధాలతో సైకోసిస్ లక్షణాలకు ప్రేరేపితులవుతారు. వారు చెప్పినటుల వింటేనే తమవారిగా గుర్తిస్తారు, లేదంటే ఇంట్లోనే శత్రువులయిపోతారు. క్షణ క్షణానికి కలిగే వారి భ్రమలతో సాధిస్తారు, అనుమానాలతో ఆరాలు తీస్తారు, ఒక రూపమని చెప్పడం కష్ఠం, సంకుచితతత్వానికి అనంతరూపాలు. వీటన్నిటినుండీ ఎలా వారిని తప్పించడం లేదా తప్పుకోవడం?

తప్పుకోవడానికి ముందు ప్రయత్నించాలి. అదెలా సాధ్యం? వారి మానసిక పరిస్థితే వారికి తెలిసివుండివుంటే ఇలా చెయ్యనే చెయ్యముగా అని అంటారు లేదా ఎలా తెలుసుకోవడము అని ప్రశ్నిస్తారు.

ఎందుకు తెలియదండీ? ఎలా తెలుసుకోవాలి అని సద్గురు జగ్గి వాసుదేవ్ గారిని ప్రశ్నించినప్పుడు, ఆయన నవ్వుతూ ఇచ్చిన సమాధానమేమిటంటే, “చేతికో కాలికో సెన్స్ లేకపోవడమో లేదంటే మన ప్రమేయమే లేకుండా వాటికవే కొట్టేసుకోవడమో జరిగితే … అమ్మో కాలికి ఏదో జరిగిందనో, చేతికి ఏదో జరిగిందనో వెంటనే హాస్పిటల్ కి పరిగెట్టమా??? అలాగే తల, దాంట్లోని బ్రెయిన్ కూడా ఒక అవయవమే. దాని పనితీరు సరిగ్గా లేదంటే తప్పక తెలుస్తుంది. విపరీత కోపం కలిగి ఏదయినా అపాయంలో పడినా, లేక ఎవరికయినా అపాయంలో పడేసినా అదొక విచిత్ర ప్రవర్తన అని ఆ బ్రెయినే నోట్ చేస్తుంది. అలాగే విపరీత భావనలు, తమకిష్ఠమయిన వారిని బాధిస్తున్నామనే ఆలోచనలు సరియైనవి కావని బ్రెయిన్ హెచ్చరిస్తుంది. మిగితా అవయవాలను గురించి హెచ్చరించినట్లే తన గురించి కూడా తాను హెచ్చరిస్తుంది, అలాగే మన విపరీతధోరణిని భరిస్తున్నావారుకూడా చెప్తారు, అది మనం పట్టించుకోవాలి, తగు జాగ్రత్తలు, వైద్యం తీసుకోవాలి”. అదే నేనూ చెప్తున్నాను. అలా కాకుండా దురహంకారానికిపోయి, ఎవరిగురించి నన్ను భరించరు, అలా భరించకపోతే కుటుంబం అనడానికి అర్ధమేముంటుందన్న మూర్ఖత్వాన్ని పాఠించకూడదు. ఇదే సంకుచిత భావం, దీనికి స్వస్తి చెప్పాలి, అప్పుడే పూర్ణారోగ్యవంతులు కాగలరు.

జరుగుతున్న పరిస్థితులమీద ఒక అవగాహన ఏర్పడడం, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమని తాము మార్చుకోగలగడము అనేది ఒక అవసరం. లేకుంటే కుటుంబపరిగణన నుండి ఐసొలేట్ అయిపోతారు. ఈ ఐసొలేట్ అయిపోతే తాము అయిపోతున్నామనే ఆలోచన చెయ్యకుండా వేరే అవతలివాళ్ళే తమని దూరంచేస్తున్నారనే అభాండాన్ని వారిపై వేసేసి ఇక కక్ష్య సాధింపులకు ఓంకారం చుడతారు. అప్పటినుండి ఆ కక్ష్య సాధింపులతో తమను తాము తమలోనే సెల్ఫ్ బూస్ట్ చేసుకొంటూ తృప్తి చెందుతుంటారు. ఇది కూడా సైకోసి రుగ్మతే. ఈ రుగ్మతతో బాధపడేవారిని నిరంతరం సంతోషపరచడం ఒక తప్పనిసరి విధి అయ్యి కూర్చుంటుంది వారిని అనుసరించుకొని బ్రతికేవారికి. ఇలాంటి వారిని తీసికెళ్ళి కౌన్సిలింగు సెంటర్లలో కూర్చోబెడితే వచ్చే ఉపయోగమేమీ వుండదు. నిజానికి ఇది ఎవరికి వారు చేసోగలిగే చిన్న సమస్యే. అదే తమ ఆలోచనలను పరిశీలించుకోవడము. అజ్ఞానమనే కిటికీని తెరిస్తే బుర్రలోని కంపు అంతా బయటికి వెళ్ళిపోతుంది. సుఖబోదానందస్వామి సూఫీకధ ఒకటి ఇలా చెప్తారు. ఒకడు తన భార్య మీద కంప్లైంట్ చేస్తుంటాడు, ఆమె తన పెంపుడు జంతువులన్నీ ఇంట్లో పెట్టి, ఇల్లంతా వాసన కొట్టిస్తోందని. అయితే నువ్వు నీ గది కిటికీ తెరు అని సలహా ఇస్తారు అందరు. కాని అతడు “అమ్మో కిటికీ తెరిస్తే నా పావురాలు బయటికి ఎగిరిపోతాయి” అని. అలా అనవసరమైన వాటి మీద దృష్ఠిని సారించి అజ్ఞానమనే కిటికీ తెరవకుండా ఆ కంపును అలానే భరిస్తానంటే దానికి ఎవరు బాధ్యులు? కాబట్టి ఆలోచనలని క్షుణ్ణంగా పరిశీలించడం నేర్చుకోవాలి. మొదట కన్నపిల్లలయొక్క వ్యక్తిత్వాలను తీర్చదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. దానికి పటిష్ఠమైన కుటుంబవ్యవస్థవుండాలి. అక్కడ లోపం వున్నప్పుడు వ్యక్తి కనీసం సమాజంలోకి వెళ్ళాకయినా  తనకు తానుగా లేదా తెలిసినవారి సూచనల ప్రకారమయినా కొంత సాధన చేసుకోవాలి. అలాకాకుండా నేనిలానే వుంటాను, నేనొక అండపిండ బ్రహ్మాండాన్ని అంటే ఎవ్వరూ బాగుచెయ్యరు. మంచి ఆలోచనయినా, చెడు ఆలోచనయినా దానికి భాషను చేకూర్చేది మస్తిష్కమేగా. ఆ ఆలోచనలకు తటస్థంగా వుంటూ ఒక మూడో వ్యక్తిలా మీ అంతరంగంలో ఆ అలోచనలు కూరుస్తున్న మాటలను వినండి, అదే ధ్యానము. ఆ అంతరంగంలోని మాటలను మీరు వింటునప్పుడు మీకు కలిగే అసహనం, అసంత్రుప్తి, చిరాకు, పరనింద, పరదూషణ మొదలైనవాటన్నిటినీ జాగ్రత్తగా సమకూర్చినప్పుడు వాటిపై ఆటోమేటిక్ గా కంట్రోల్ ఏర్పడి వాటినుండి విముక్తులవుతారు. ఇక ఇంతకుమునుపులా ఫ్రీగా అవి ఇతరులపైకిసునామీలా దూకదు, అప్పటినుండీ మీలో మార్పు సంభవించడం జరుగుతుంది. ఇదంతా ఒక సాధన. ఫ్రీగా ఆలోచనలను రానివ్వాలి, ఆపై వాటిని కంట్రోల్ చెయ్యాలి. ఈ విధంగా ఎవరికి వారు సైకోసిస్ లక్షణాలను మొదట్లో వుంటుండగానే త్రుంచుకోవచ్చు. ఈ సాధనలో మరొక ముఖ్యమైన విషయం కంట్రోల్ చేసి ఆగిపోతే సరిపోదు ఆ కంట్లోల్డు ధ్యానాన్ని మరో మంచి, క్రొత్త విషయం మీదకు మళ్ళించాలి అదే నెగటివ్ నుండి విముక్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here