మృతవర్షిణి
Chapter 59
[dropcap]సి[/dropcap]మ్పతీ ఫర్ లేడీ వెన్జన్స్ 2005లో వచ్చింది. కొరియన్ సినిమా చరిత్రలో ఇలాంటి నటి ఇంతకు ముందు లేదు. ఇకపై రాకపోవచ్చు. అని విమర్శకుల, ప్రేక్షకుల జేజేలందుకున్న ఈ యూంగ్-ఏ దీనిలో ప్రధాన పాత్ర పోషించింది. జాయింట్ సెక్యూరిటీ ఏరియాలో మేజర్ సోఫీ పాత్రతో కొరియన్ వెండితెర మీద తన ప్రతిభ చాటుకున్నాక మళ్ళా టెలివిజన్ వైపు మళ్ళి హే జాంగమ్‌లో టైటిల్ పాత్రతో ఆసియన్ల మనసు గెలుచుకుంది.
తరువాత మన పార్క్ తను తీస్తున్న వెన్జన్స్ సినిమాల్లో చివరి దాన్ని ఈసారి ప్రతీకారాన్ని ఒక మహిళ కథగా చెప్పాలని చూశాడు. అది అలాంటిలాంటి పాత్ర కాదు. సినిమాగా Oldboy దీనికన్నా చాలా గొప్పది. కానీ, పాత్ర పరంగా అటు ఓ డే-సు కానీ, ఈ వు-జిన్ కానీ Lady Vengeance లో ఈ యూంగ్-ఏ పోషించిన గమ్-జా పాత్రకు సాటి రావు.
మనం రెగ్యులర్‌గా వినే లేదా చూసే జోక్..
మహిళల మనస్తత్వం గురించి పుస్తకం అంటూ ఖాళీ పేజీల పుస్తకం. నిజానికి స్త్రీ హృదయపు లోతులు తెలుసుకోవాలంటే అది మానవమాత్రులకు సాధ్యం కాదు. జనాలు జోక్ చేస్తారు కానీ, వారి ఆలోచనల వేగానికి, intensity కి తట్టుకోగలిగే పురుషులు చాలా అరుదు. ఏ శ్రీకృష్ణ భగవానుడో దిగి రావాలి. But funnily enough, they can handle their thoughts quite well in the absence of a male worm 😉
అందుకే దర్శకుడు పార్క్, మన కొరియన్ సావిత్రి ఈ కు Sympathy for Lady Vengeance అని టైటిల్ పెట్టి, ఒక ఖాళీ notebook పంపాడు. జోక్‌తో పాటూ పార్క్ ఆలోచన అర్థమైన ఈ ఈ సినిమా కోసం రంగంలోకి దిగింది.
మరి ఈ లాంటి (Pun absolutely intended) నటికి ఎదురుగా విలన్ పాత్ర ఎవరు చేయాలి?
You guessed it right! Choi Min-sik.
Oldboy తరువాత తిరుగులేని స్టార్డమ్ అందుకున్న చోయ్, పాత్ర నిడివికన్నా, ఆ పాత్ర తననెంత చాలెంజ్ చేస్తుంది అన్నది చూస్తాడు. అందుకే ఈ సినిమాలో విలన్ పాత్రకు ఒప్పుకున్నాడు. ఇంకో విశేషం మొదటి వెంజన్స్ సినిమా అయిన సిమ్పతీ ఫర్ మిస్టర్ వెన్జన్స్‌లో ప్రధాన పాత్రలు పోషించిన Song Kang-ho, Shin Ha-kyun లు ఈ సినిమాలో cameo లలో మెరిశారు. రౌడీ వెధవలుగా.
మొత్తానికి పార్క్ తన హీరోలు ముగ్గురినీ ఈ యూంగ్-ఏ కోసం రంగంలోకి దించాడు. విలనీయులుగా.
The movie follows the story of Lee Geum-ja, a woman who has just been released from prison after serving a thirteen-year sentence for a murder she did not commit. Throughout the film, Lee seeks revenge on the true perpetrator while coming to terms with her past and seeking redemption for the sins she has committed.
One of the most striking aspects of the film is its visual style. The cinematography is beautiful and often uses bright colours and bold patterns to create a vivid and intense atmosphere.
This is particularly true in the film’s violent scenes, which are depicted with graphic and often surreal imagery. The movie also makes use of flashbacks and dream sequences to provide insight into Lee’s past and her motivations for seeking revenge.
Thematically, the movie explores the idea of justice and redemption. Lee’s desire for revenge is driven by a need for justice, both for herself and for the victim of the crime she was falsely accused of committing.
However, as the film progresses, it becomes clear that Lee’s motivations are more complex than simple vengeance. She is also seeking redemption for her past actions, which she believes were a result of her own weaknesses and insecurities.
అంటే కేవలం గమ్-జా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవటమే కాదు. తన బలహీనతల మీద కూడా పగ సాధిస్తుంది. కొన్నిసార్లు ఆ బలహీనతలను తాను కలిగి ఉన్నందుకు తనను తానే శిక్షించుకుంటుంది.
ఉత్తినే ఏదో వైలెన్స్ సీన్లు పెట్టేసి సినిమా తీసేద్దాం అనో, లేదా బాగా జనానికి ఎక్కుతుంది కనుక revenge story అని కాక, ఒక మనిషి తనను తాను ఎలా మలచుకోవాలో, బలహీనతలను వదిలించుకుని మానసికంగా దృఢంగా ఎలా తయారు కావాలో చెప్తాడు పార్క్.
ఈ వెన్జన్స్ కథలు మొత్తం మూడు.
- Sympathy for Mr. Vengeance
- Oldboy
- Sympathy for Lady Vengeance
మొదటి సినిమాలో కేవలం ప్రతీకారమే ఉంటుంది. ఇక్కడ పగ అన్న మాట ఉండదు. పరిస్థితులు అలా తన్నుకు వస్తాయి. ఇద్దరు మంచి మనుషులు అనుకోని, వేరే ఆప్షన్ లేని పరిస్థితులలో ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీర్చుకోవలసి వస్తుంది. చిత్రంగా ఈ కథ చాలా జనరిక్‌గా ఉంటుంది.
ఎక్కడైనా జరుగవచ్చు. ఎవరికైనా జరుగవచ్చు. మీకైనా, నాకైనా, మన పక్కనున్న వాళ్ళకైనా.
రెండో సినిమాలో ఇద్దరు మామూలు మనుషులు, both grey characters who could go down to any extent to get vengeance తలబడతారు. ఎవరు మంచి? ఎవరు చెడ్డ? అన్న మాట ఏమాత్రం ఉండదు. ఇక్కడ పగా, ప్రతీకారం రెండూ ఉంటాయి.
మనకు ఆ ఇద్దరు యాక్టర్లలో ఎవరు నచ్చితే వారి పక్షానికెళ్ళిపోతాం మానవ సహజంగా. చివరికి వారు పరిస్థితుల వల్ల చెందిన మార్పు, ఆ సందర్భంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరు మిగులుతారు? ఎవరు టాటా అంటారు? అన్నది నిర్ణయింపబడుతుంది. ఒకరు మాత్రం ప్రేమ/ ఆప్యాయత/ అనుబంధం/ కడుపుతీపి అనే వాటి వల్ల తనలో ఉన్న బీస్ట్‌ను వదిలించుకుని మనిషిగా నిలుస్తారు.
ఇక మూడవ సినిమా Lady Vengeance లో span చాలా ఎక్కువ. ఇక్కడ alongside vengeance, there’s an attempt for redemption.
చిత్రంగా ఈ సినిమాలో మన కొరియన్ సావిత్రి వేసిన పాత్ర, ఆమె కథ Bildungsroman జాన్రా కిందకు వస్తాయి. ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేదు. Oldboy మండేలా ఎఫెక్ట్ అనే psychological phenomenon మీద ఆధారపడి తీసిన సినిమా అని గుర్తించనట్లుగానే.
***
ఆదాము, అవ్వ అటువైపు చూశారు. సన్నటి వీల లాంటి శబ్దం. ఎండుటాకులు నిశ్శబ్దాన్ని చీలుస్తున్నట్లు శబ్దం చేస్తూ అటూ ఇటూ కదులుతున్నాయి. మెరుస్తున్న నల్లటి ఆకారం. ఒక ఎండుటాకుల కుప్ప లోనుంచీ లేస్తోంది. అప్పుడు కనిపించాయి రెండు నాలుకలు. బైటకు లోపలకు. బైటకు లోపలకు. పొలుసుల శరీరం.
పాము.
అదే ఆకారం. తనకు Apple చూపి కొయ్యమన్నప్పుడు ఉన్న రీతిలో.
అవ్వ గుర్తుపట్టింది.
“How are you Oldboys?” పాము పలకరించింది.
సినిమా చాలా బాగుంది. చెప్పాడు ఆదాము.
ఇంతకాలం ఏమయ్యావ్? అవ్వ అడిగింది. డాలింగ్ మన పాము మిత్రుడు. ఆదాముతో అన్నది.
అదివరకు డాళింగ్ అనేదానివి. ఇప్పుడు డాలింగ్ అంటున్నావు? ఏమైంది? పాము అవ్వతో నవ్వుతూ అంది. రెండు నాలుకలను ఆడిస్తూ.
ఇప్పుడు అఅఅ… ఆ అక్షరం పలకటం లేదు. వయసైపోయింది కదా. అవ్వ చెప్పింది.
లేదులే. తెలుగు సినిమాలు చూస్తోంది ఈమధ్య. అందుకే ళ కావాలని పలకటం లేదు. Fashion గా. నాతో మాట్లాడుతూ కూడా వెల్లి వెల్లి అంటోంది. వెల్లుల్లిపాయ అనుకుని ఇక్కడ ఈడెన్‌లో దొరకదు కదా అన్నాను. అది వెళ్ళి అని అర్థం చేసుకునే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఆదాము కొంచెం వెక్కిరింతగా అన్నాడు.
మనకు తోక లేదుగా. అంది అవ్వ.
సరే సరే! నువ్వు మరణించావని విన్నాము. చాలా ఇబ్బంది పడేలా జరిగిందని. ఎలా వచ్చావిలా? ఆదాము పాముతో అన్నాడు.
నేను ఆ పాము కాదు. అదే జాతికి చెందిన ఇంకో పామును. మీకో ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను.
ఏంటది? అవ్వ అడిగింది. Oldboy కథను ఎంతసేపూ ఓ డే-సు వైపు నుంచీ చెప్పాడు ఆదాము. మరి ఈ వు-జిన్ వైపు నుంచీ చెప్పరా?
అంటే.. అది సినిమాలో లేదు కదా. ఓ డే-సు వైపు నుంచీ చూపాడు పార్క్.
అయితే నేను చెప్తాను వినండి. అంది పాము. ఓపిక లేనట్లుంది. మెలికలు చుట్టుకుని బద్ధకంగా పడుకుంది.
కొరియానం నారేటర్ జాయింట్ సెక్యూరిటీ ఏరియాను సినిమాలో చూపినట్లు మేజర్ సోఫీ పాయింటాఫ్ వ్యూలో చెప్పకుండా సైనికుల తరఫు నుంచీ చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు ఆమె వైపు నుంచీ కథను చెప్పు ప్రియమైన అవ్వా! అంది పాము.
అవ్వ ఉవాచ:
ఎప్పటిలాగానే పార్క్ చాన్-వుక్ ఈ సినిమాను ఒక నవల ఆధారంగా తీశాడు డాలింగ్..
ఆదాము says: ఇదిగో ఆ డాలింగ్ అనే మాట పదిసార్లు అనకు. తెలుగు సినిమాల్లో పెళ్ళి బదులు పెల్లి అని అంటుంటే కడుపు దేవేసినట్లు.. వద్దులే. Get serious darling.
సరే! ఆ నవల పేరు DMZ. అంటే De-Militarised Zone. దాన్ని రాసింది పార్క్ శాంగ్-యోన్. Park Sang-yeon.
ఆ ప్రదేశంలో ఒకరోజు అనుకోని విధంగా ఇద్దరు ఉత్తర కొరియా సైనికులు మరణిస్తారు. ఒక దక్షిణ కొరియా సైనికుడు గాయపడతాడు. అది రెండు దేశాల మధ్య కాల్పులలా అనిపించి యుద్ధానికి దారితీసేలా ఉందేమో అని ముందు జాగ్రత్తగా ఒక న్యూట్రల్ కమిటీ చేత విచారణ జరిపించాలని నిర్ణయిస్తారు.
ఆ విచారణ చేసేది సోఫీ జా. స్విజర్లాండ్ దేశస్తురాలు. కొరియన్ వారసత్వం ఉంటుంది. తండ్రి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అయినా దానిని వాడుకోకుండా తన స్వంతంగా ఎదుగుతుంది. ఆమెతో పాటూ మరో న్యూట్రల్ అధికారి కూడా వస్తారు.
ఆ పోరుతో సంబంధం ఉండి, బతికి ఉన్న సైనికులను ప్రశ్నించటం ద్వారా, ఇతర ఆధారాల ద్వారా సోఫీ ఈ సంఘటన రెండు సైన్యాల మధ్య యుద్ధ కాంక్ష వల్ల జరుగలేదని, కేవలం ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సైనికుల మధ్య వ్యక్తిగత వైరం వల్ల కావచ్చని గ్రహిస్తుంది. దక్షిణ కొరియా సైనికుడు, సార్జెంట్ ఈ సూ-హ్యుక్ (లీ బ్యూంగ్-హున్), ఇద్దరు ఉత్తర కొరియా సైనికులు, Private నామ్ సుంగ్-సిక్, Private హాన్ సుక్-క్యులతో సన్నిహితంగా మెసిలేవాడని తెలుసుకుంటుంది.
వారిది చాలా గట్టి స్నేహమని, బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకునేవారని, తరచూ కలిసేవారని తరువాత తరువాత అర్థం చేసుకుంటుంది.
ఇంకొంచం వివరంగా చెప్పాలంటే..
సార్జంట్ ఈ సూ-హ్యుక్ కాల్పులను జరిపినట్లు అంగీకరిస్తాడు. అంగీకరించినట్లుగా, రెండు వైపుల నుంచీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు వచ్చాయో సోఫీ పరిశోధిస్తుంది. సూ-హ్యుక్ తను ముంబై (నేచర్ కాల్) కోసం వెళ్ళినప్పుడు తనను చావగొట్టి కిడ్నాప్ చేసి ఉత్తర కొరియన్లు తీసుకువెళ్ళారని, తాను కాల్పులు జరిపి తప్పించుకు వచ్చానని, అప్పుడు ఇద్దరు మృతి చెంది మరొకరు గాయపడ్డారని అంటాడు.
మరోవైపు ఉత్తర కొరియా సార్జంట్ (స + అర్జంట్ కాదు) ఓ క్యుంగ్-పిల్ సూ-హ్యుక్ తమ మీద దాడి చేసి అందరి మీదా కాల్పులు జరిపాడని, తాను ఆ షాక్ నుంచి కోలుకుని ఎదురు కాల్పులు జరిపే సరికి అతను పలాయనం చిత్తగించాడని విన్నవిస్తాడు.
Autopsy report ప్రకారం ఉత్తర కొరియా సైనికుడు జ్యుంగ్ వు-జిన్ శరీరంలో ఎనిమిది బులెట్లున్నాయని తేలుతుంది. ఇది ఎవరో కక్ష పెట్టుకుని చంపారని సూచిస్తుంది. వాటిలో ఒక unaccounted bullet కూడా ఉంటుంది.
పాము ఉవాచ: ఈ “వు-జిన్” అనే పేరు పార్క్ చాన్-వుక్ కు బాగా కోపమేమో. Oldboy విలన్ పేరు కూడా అదే.
ఆదాము says: కావచ్చు.
అవ్వ కోప్పడింగ్: వింటారా లేదా?
పాము అంటుంది: చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు..
కొరియానం నారేటర్ aka కొనా: అప్పటికి చెప్పులు లేవు కనుక ఆ జోక్ invalid అయింది.
అవ్వ కొనసాగించింది.
ఈ లోగా ఉత్తర కొరియా సైనికుడు నామ్ సుంగ్-సిక్ ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తాడు. అలాగే ఒకరి మీద ఒకరు గట్టి ఆరోపణలు చేసుకున్న సూ-హ్యుక్, క్యుంగ్-పిల్ లు పరస్పరం ఎదురుపడినప్పుడు కళ్ళతో మాట్లాడుకోవటం సోఫీ గమనిస్తుంది. దాంతో ఆమె అనుమానాలు మరింత బలపడి, వేరే రూట్లో ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. కానీ ఇంతలో ఆమె ఈ పరిశోధన చేయటానికి అనర్హురాలని తేల్చి ఆమెను వెళ్ళిపొమ్మంటారు.
కారణం.. ఆమె తండ్రి 1953 కొరియా యుద్ధం సమయంలో ఉత్తర కొరియాకు ఆయుధాల సప్లయ్ విషయంలో సహకరించాడు కనుక ఆమె న్యూట్రల్ కాదని పెద్ద తలకాయల అభిప్రాయం.
పాము ఉవాచ: ఆమె తండ్రి గతంలో ఎప్పుడో చేసిన పనికి ఈమె 2000లో చేస్తున్న పరిశోధనకు సంబంధం ఏమున్నది? పైగా ఆమె నిజాయితీగా వ్యవహరిస్తోంది. Cough this..! (కొనా: Cough అంటే ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు).
అవ్వ (with little tinge of sadness in her voice): అవును. ఆదాము ఎంత మంచివాడు! కానీ కయీను..
స్వరం బొంగురుపోతుంది. కానీ ఇంతలోనే తమాయించుకుని కొనసాగిస్తుంది.
అవ్వ continues.
ఇక మిగిలిన కథ ఆదాము ఎప్పుడో చెప్పాడు.
నిజానికి సోఫీ పూర్తి సత్యం కనుక్కుంటుంది. ఆ సైనికుల స్నేహం, అది బైట పడితే తమ అధికారుల వల్ల ఏమి ప్రమాదం ముంచుకు వస్తుందో అనే భయం, వారనుకున్న చివరి కలయిక, వారిలో ఒకరిని భయం బాగా డామినేట్ చేయటం, దాని వల్ల జరిగిన అనవసర కాల్పులు..
ఇంతకీ ఆదాము నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు పామూ.
పాము says: ఏమి చెప్తాడు. ఏదైనా సరే we have to strive for greater good. కానీ..
ఆదాము: ఆ కానీ కే సమాధానం లేదు.
భవదీయుడు ఉస్తాద్ కొనా:
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, greater good should always be considered. But it is in small things that the real happiness lies. అసలు మనుషుల మధ్య గోడలు, సరిహద్దులు ఎందుకు? అవసరమా?
Let’s go into physics, Time Independent equations may look beautiful. But all our calculations are possible in real world only thanks to Time Dependent equations. In Classical Mechanics (classical physics) we study about Constraints. Even when studying Quantum Mechanics, we study about Particles in the well. Or particle in the box. A constraint makes things a bit orderly.
GitacharYa says: విషయం అర్థం అవుతోంది కానీ, చెప్తున్న సైన్సు వివరం తెలిసే చెప్తున్నావా?
కొనా: రాసేది నువ్వు. ఏసేది నా మీదా?
గీతాచార్య: అంతే కదా. తప్పులన్నీ ఎదుటివారి మీదకు నెట్టేయాలి.
కొనా: ఏ నెట్? Hathaway? ACT Fibre? JIO Fibre? Airtel?
***
ఏదైనా సరే we have to strive for greater good. ఈ మాట అనగానే దేవుడు ఒక క్షణం కనిపించి పాము తోకను నిమిరాడు. దాంతో పామును అంత వరకూ ఆవరించి ఉన్న నిస్సత్తువ వదిలి పోయింది.
గొంతు సవరించుకుని మొదలు పెట్టింది.
Oldboy ని చాలామంది Choi Min-sik పాత్ర ఓ డే-సు కోణం నుంచీనే చూస్తారు. ఎవరూ ఈ వు-జిన్ గురించి లోతుగా ఆలోచించరు. కానీ, అతని వైపు నుంచి కథ ఒక timeless classic.
పాము స్వరానికి ఆదాము, అవ్వ మంత్రముగ్ధులై వింటున్నారు.
Let’s not disturb them.
(వచ్చేవారం టాటా చెప్పుకుందాం)