[dropcap]చు[/dropcap]క్క చుక్క నేల కొరిగి
చెమటోడ్చినోడా
ఓ కార్మికుడా
నీకు నా సలాం..
రాయి, రాయి పేర్చి కట్టు
భవనాల సొగసు కష్టం నీదేరా
ఎండ లేదు, వాన లేదు
సమయానికి తిండి లేదు
ఓ కార్మికుడా!
కష్టమంత నీదేరా..
కండ బలం చూపించి
కొండని సైతం పిండిచేసి
పగలనక, రేయనక
రహదారులు వేసినోడా..
ఓ కార్మికుడా!
కష్ట మంత నీదేరా..
భార్య బిడ్డల్ని
సైతం వదిలిపెట్టి,
ఉన్న ఊరు విడిచిపెట్టి,
ఊరు కానీ ఊరులో,
అయిన వాళ్ళు లేని చోట,
బతుకు బండి నీవు ఈడ్చేరా
ఓ కార్మికుడా!
కష్టమంత నీదేరా..
మేడ, మిద్దలైన కానీ,
రహదారులైతే నేమి,
ఫ్యాక్టరీలు, కంపెనీలు,
పాడి, పంట అయిన నేమి,
తొడిగిన చెప్పు, కట్టిన బట్ట,
ఏరిన చెత్త, ఏది అయిన
ఏమి కానీ
కష్ట మన్నది నీదేరా..
మా సుఖం కోసం,
కష్ట పడ్డది నీవేరా..
ఓ కార్మికుడా!
మండే ఎండలో
ఎన్డే గుండెతో
చేసే కష్టం, వచ్చే నష్టం
లెక్క సేయనోడివిరా!!!
ఓ కార్మికుడా నీకు నా సలాం
ఓ అన్న నీకు నా ప్రణామ్🙏